విశాఖపట్నం: ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య చివరి, ఐదో వన్డే మ్యాచ్‌కి విశాఖపట్నం ఆతిథ్యమిస్తుంది. ఈ నేపథ్యంలో రెండు జట్లు గురువారం విశాఖపట్నానికి చేరుకున్నాయి. కాగా బుధవారం రాంచీలో జరిగిన నాలుగో వన్డేలో టీమిండియాపై న్యూజిలాండ్ 19 పరుగుల తేడాతో విజయం సాధించింది.
రాంచీ వన్డేలో రహానేకి ధోని వార్నింగ్ ఇచ్చాడా?దీంతో ఇప్పటివరకు జరిగిన నాలుగు వన్డేల్లో మొదటి, మూడో వన్డే మ్యాచ్‌ల్లో భారత్ విజయం సాధించగా రెండు, నాలుగు వన్డేలో న్యూజిలాండ్ విజయం సాధించింది. దీంతో ఐదు వన్డేల సిరీస్ 2-2తో సమమైంది. దీంతో వన్డే సిరీస్ విజేత ఎవరనేది విశాఖపట్నం వేదికగా శనివారం జరిగనున్న వన్డేలో తేలనుంది.
మరోవైపు ఈ నెల 29న విశాఖలో జరగనున్న వన్డే మ్యాచ్ జరుగుతుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపాను 'కయాంత్' ప్రభావం కోస్తాంధ్రపై ఉంటుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో మ్యాచ్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి.

తుపాను కారణంగా ఈ నెల 28 నుంచి మూడు రోజుల పాటు కోస్తా అంతటా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. విశాఖ వన్డేకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇదే సందర్భంలో మ్యాచ్ టికెట్ల విక్రయం కూడా 80 శాతం పూర్తయింది.
ఈ నేపథ్యంలో తుపాను హెచ్చరికలు మ్యాచ్ జరుగుతుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఈ మ్యాచ్‌ని ఎలాగైనా సరే నిర్వహించాలనే పట్టుదలతో ఆంధ్రా క్రికెట్ ఆసోసియేషన్ ఉంది. ఇందులో భాగంగా స్టేడియంలో ఉన్న అత్యాధునిక యంత్రాలతో నాలుగు గంటల్లో గ్రౌండ్‌ను ఆటకు సిద్ధం చేస్తామని చెబుతున్నారు.
'కయాంత్' తుఫాన్ ఎఫెక్ట్: ఐదో వన్డేపై కమ్ముకున్న మేఘాలుగ్రౌండ్‌లో నీటిని బయటకు పంపడంతో పాటు ఔట్‌ఫీల్డ్‌ను ఆరబెట్టే సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉందని ఎసిఎ కార్యదర్శి గోకరాజు గంగరాజు వెల్లడించారు. అంతేకాదు భారత్ కు కలిసొచ్చిన వేదికగా ఏసీఏ-వీడీసీఏ స్టేడియానికి ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇప్పటివరకు ఇక్కడ జరిగిన ఆరు వన్డేల్లో ఒకే ఒక్క వన్డేలో భారత్ ఓటమి పాలైంది.
అలాగే ధోనీ, కోహ్లీలు ఈ స్టేడియంలో రికార్డులు నమోదు చేశారు. తుఫాన్ ప్రభావంతో ఈ నెల 30వ తేదీ వరకూ కోస్తాలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ జరగని పక్షంలో టికెట్ల మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తారు. గతంలో విశాఖలో జరగాల్సిన రెండు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయ్యాయి.
భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య 2012 సెప్టెంబర్ 8న జరగాల్సిన టి-20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. అలాగే భారత్ - వెస్టిండీస్ జట్ల మధ్య 2014 అక్టోబర్ 14న జరగాల్సిన వన్డే కూడా రద్దయింది. ఈ రెండు సందర్భాల్లో టికెట్ల మొత్తాన్ని ఆంధ్రా క్రికెట్ ఆసోసియేషన్ తిరిగి చెల్లించింది.