Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రాంచీ వన్డేలో రహానేకి ధోని వార్నింగ్ ఇచ్చాడా?

రాంచి: మ్యాచ్ ఎలా ఉన్న ఫలితంతో సంబంధం లేకుండా మైదానంలో ఎప్పుడూ కూల్‌గా ఉండే కెప్టెన్ ధోనికి కోపమొచ్చింది. ఎప్పుడూ మైదానంలో కూల్‌గా ధోని బుధవారం రాంచీలో జరిగిన వన్డేలో గాంభీర్యం ప్రదర్శించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

రన్ ఛేజ్‌లో కోహ్లీపైనే ఆధారపడ్డారా?: ధోని ఆన్సర్ ఇదీ

ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన నాలుగో వన్డేలో న్యూజిలాండ్ చేతిలో టీమిండియా 19 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 260 పరుగులు చేసింది.

అయితే న్యూజిలాండ్ 46 ఓవర్లు ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 227 పరుగులతో తీవ్ర ఒత్తిడిలో ఆడుతుంది. ఈ సమయంలో ధావల్ కులకర్ణి బౌలింగ్‌లో న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ డెవిచ్ 11 బంతుల్లో 11 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఈ దశలో కులకర్ణి వేసిన బంతిని డెవిచ్ మిడ్ వికెట్ మీదగా బాదాడు.

MS Dhoni warns Rahane in Ranchi ODI

భారత ఫీల్డర్లు బంతిని అందుకునే క్రమంలో కివీస్ బ్యాట్స్‌మెన్లు రెండు పరుగులు పూర్తి చేశారు. రెండో పరుగు తీస్తున్న క్రమంలో బంతిని అందుకున్న అక్షర్‌ పటేల్‌ త్రో ద్వారా బౌలింగ్‌ ఎండ్‌లో వికెట్లకు అతి దగ్గరగా ఉన్న రహానెకు విసిరాడు. అయితే బంతిని అంచనా వేయడంలో రహానే తడబడ్డాడు.

'కయాంత్' తుఫాన్ ఎఫెక్ట్: ఐదో వన్డేపై కమ్ముకున్న మేఘాలు

దీంతో బంతి రహానేను దాటుకుని వెళ్లిపోయింది. దీనిని గమనించిన కివీస్ బ్యాట్స్‌మెన్లు మరో పరుగు అదనంగా లభించింది. దీంతో ధోని కాసేపు మైదానంలో అసహనానికి గురయ్యాడు. 'రహానె ఏమైంది? వికెట్లకి కొంచెం దూరంగా ఉండి బంతిని అందుకో' అంటూ హెచ్చరించాడు.

నాలుగో వన్డేలో భారత్ ఓటమి వెనుక ఈ ఎక్స్‌ట్రాలు కూడా ఓ కారణమని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. టాప్ ఆర్డర్ విఫలంతో పాటు భారత బౌలర్లు కూడా ఓటమికి ప్రధాన కారణంగా నిలిచారు. నాలుగో వన్డేలో మొత్తం 16 పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో బౌలర్లు సమర్పించుకున్నారు.

ఈ వన్డేలో టీమిండియా కేవలం 19 పరుగుల తేడాతో మాత్రమే మ్యాచ్‌ను చేజార్చుకుంది. అదే ఎక్స్‌ట్రాలను మ్యాచ్ ఆరంభం నుంచే కట్టడి చేసి ఉంటే భారత విజయావకాశాలు మరింత మెరుగయ్యేవని అంటున్నారు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+