Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs PAK: పాక్‌తో మ్యాచ్.. కుప్పకూలిన భారత్!

అండర్ 19 ఆసియా కప్ టోర్నీలో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ 241 పరుగుల లక్ష్యాన్నే నమోదు చేసింది. విధ్వంసకర బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ(5) తీవ్రంగా నిరాశపర్చగా.. ఆరోన్ జార్జ్(88 బంతుల్లో 12 ఫోర్లు, సిక్స్‌తో 85) హాఫ్ సెంచరీతో భారత్‌ను ఆదుకున్నాడు. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 46.1 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌటైంది.

పాకిస్థాన్ బౌలర్లలో మహమ్మద్ సయ్యమ్, నిఖబ్ షఫీక్ మూడేసి వికెట్లు తీయగా.. నిఖబ్ షఫీక్ రెండు వికెట్లు పడగొట్టాడు. అలీరాజా, అహ్మద్ హుస్సేన్‌కు తలో వికెట్ దక్కింది.

వర్షం కారణంగా ఈ మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది. దాంతో ఒక ఓవర్‌ను కుదించారు. అయితే టీమిండియాకు ఆశించిన ఆరంభం దక్కలేదు. విధ్వంసకర ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ(5) తీవ్రంగా నిరాశపర్చాడు. పాకిస్థాన్ బౌలర్ మహమ్మద్ సయ్యమ్‌కు రిటర్న్ క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన ఆరోన్ జార్జ్‌తో కలిసి ఆయుష్ మాత్రే(38) ఆచితూచి ఆడాడు . నిలకడగా ఆడుతున్న ఈ జోడీని కూడా సయ్యమ్ విడదీసాడు.

India U19 vs Pakistan U19 U19 Asia Cup 2025 Live India Bowled Out for 240

హాఫ్ సెంచరీకి చేరువైన ఆయుష్ మాత్రే(38)ను కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో పవర్ ప్లేలో టీమిండియా 2 వికెట్లకు 78 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన విహాన్ మల్హోత్ర(12), వెదాంత్ త్రివేది(7) కూడా వెనువెంటనే పెవిలియన్‌కు చేరారు. అభిజ్ఞాన్ కుండు(22)సాయంతో ఆరోన్ జార్జ్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అభిజ్ఞాన్ కుండు, ఆరోన్ జార్జ్ ఒకే ఓవర్‌లో పెవిలియన్ చేరారు. కాన్షిక్ చౌహన్(46) ఆచితూచి ఆడి జట్టు స్కోర్‌ను 200 మార్క్ ధాటించాడు. యూఏఈతో మ్యాచ్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగిన భారత బ్యాటర్లు.. పాకిస్థాన్‌పై ఆ జోరును కొనసాగించలేకపోయారు. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ.. రెండోసారి పాకిస్థాన్‌పై చేతులెత్తేసాడు. ఎమర్జింగ్ ఆసియా కప్ టోర్నీలోనూ వైభవ్ సూర్యవంశీ నిరాశపర్చాడు.

Story first published: Sunday, December 14, 2025, 15:11 [IST]
Other articles published on Dec 14, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+