India Tour of WI: టీమిండియా చార్టెడ్ ఫ్లైట్ ఖర్చు రూ. 3.5 కోట్లు.. గుడ్డు మీద ఈక కాదంటున్న ఫ్యాన్స్!

న్యూఢిల్లీ: ఇంగ్లండ్ పర్యటనను దిగ్విజయంగా ముగించిన టీమిండియా.. వెస్టిండీస్ పర్యటనలోని పరిమిత ఓవర్ల సిరీస్‌లకు సిద్దమైంది. మంగళవారమే కరేబియన్ గడ్డపై అడుగుపెట్టింది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ వన్డే సిరీస్‌కు దూరంగా ఉండటంతో శిఖర్ ధావన్ జట్టును నడిపించనున్నాడు. మూడు వన్డేల సిరీస్ శుక్రవారం నుంచి మొదలు కానుంది. అయితే వెస్టిండీస్ పర్యటనకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త భారత క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వెస్టిండీస్‌కు భారత ఆటగాళ్లను తరలించేందుకు బీసీసీఐ ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసింది. దీని ఖర్చు అక్షరాల మూడున్నర కోట్లు అంట. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారి వెల్లడించడంతో సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్‌గా మారింది.
టికెట్లు దొరకకపోవడంతోనే..
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ ముగిసిన వెంటనే భారత ఆటగాళ్లు విండీస్ పర్యటనకు బయలుదేరారు. అయితే కమర్షియల్ ఫ్లైట్‌లో బీసీసీఐకి సరిపోని టికెట్లు దొరకకపోవడంతో బోర్డు ప్రత్యేక విమానాన్నే ఏర్పాటు చేసింది. ఈ స్పెషల్ చార్టెడ్ ఫ్లైట్‌లో భారత ఆటగాళ్లతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా వెళ్లారు. ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేయడానికి కరోనానే కారణమని ప్రచారం జరగ్గా.. అది వాస్తవం కాదని తేలింది. కమర్షియల్ ఫ్లైట్‌లో సరిపోను టికెట్లు దొరకకపోవడంతోనే బీసీసీఐ చార్టెడ్ ఫ్లైట్ ఏర్పాటు చేసిందని ఓ అధికారి తెలిపాడు.
గుడ్డు మీద ఈక కాదు..
ప్రత్యేక విమానానికి రూ.3.5 కోట్లు ఖర్చు పెట్టడంపై సోషల్ మీడియా వేదికగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓ వైపు దేశంలో వరదలు భీభత్సం సృష్టిస్తున్నాయని, వరద బాధితులకు బీసీసీఐ సాయం చేయాల్సిందని కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం బీసీసీఐకి ఈ రూ. 3.5 కోట్లు పెద్ద లెక్క కాదని, పెట్టిన పెట్టుబడికి ట్రిపుల్ సంపాదిస్తోందని అభిప్రాయపడుతున్నారు. గుడ్డు మీద ఈక కూడా కాదని మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు.
ప్రాక్టీస్ షురూ..
మంగళవారమే ట్రినిడాడ్ చేరిన భారత జట్టు శుక్రవారం జరిగే తొలి వన్డే కోసం ముమ్మరంగా సాధన చేస్తోంది. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ ఆడిన జట్టులో నుంచి రోహిత్, బుమ్రా, రిషభ్ పంత్, కోహ్లీ తప్పుకోగా.. శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, సంజూ శాంసన్ జట్టుతో కలిసారు. ఈ సిరీస్‌లో జడేజా వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. వన్డే సిరీస్ అనంతరం జరగనున్న ఐదు టీ20ల సిరీస్‌కు రోహిత్, పంత్ హార్దిక్ అందుబాటులోకి రానున్నారు. జూలై 29 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఇక బుమ్రా, కోహ్లీ ఈ పర్యటన మొత్తానికి దూరంగా ఉండనున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications