
న్యూఢిల్లీ: వన్డే కెప్టెన్సీ మార్పు భారత క్రికెట్ జట్టులో.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మధ్య అగ్గిరాజేసింది. తనను తప్పించి రోహిత్ శర్మకు వన్డే సారథ్యం అప్పగించడం, బోనస్‌గా టెస్ట్ వైస్ కెప్టెన్సీ ఇవ్వడంపై విరాట్ కోహ్లీ ఆగ్రహంగా ఉండగా.. బీసీసీఐ, సెలెక్షన్ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించడం లేదని కోహ్లీపై రోహిత్ అంతే కోపంగా ఉన్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఇద్దరూ ఒకరికొకరు ఎదురపడేందుకు కూడా ఇష్టపడటం లేదని, ఒకరి కెప్టెన్సీ మరొకరు ఆడేందుకు నిరాకరిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా ఈ నెల 26 నుంచి జరిగే టెస్ట్ సిరీస్‌కు రోహిత్ శర్మ గాయం కారణంగా దూరం కాగా.. ఇప్పుడు వన్డే సిరీస్ నుంచి విరాట్ కోహ్లీ తప్పుకుంటున్నాడు.
తన కూతురు వామిక ఫస్ట్ బర్త్‌డేను ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకోవాలని చెబుతూ వన్డేలకు దూరంగా ఉంటానని, ఈ మేరకు సిరీస్ టైమ్‌లో తనకు రెస్ట్ ఇవ్వాలని బీసీసీఐని కోహ్లీ రిక్వెస్ట్ చేసినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది. ఇక గాయంతో టెస్ట్ సిరీస్‌కు దూరమైనట్టు ప్రకటన వచ్చేదాకా కోహ్లీ ముంబైలో భారత టెస్ట్ టీమ్‌కు ఏర్పాటు చేసిన బయో బబుల్‌లో చేరకపోవడం కూడా అనుమానాలను పెంచుతోంది. మరోపక్క టెస్ట్ టీమ్ వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ నిజంగానే గాయపడ్డాడా? అనే సందేహాలు కూడా మొదలయ్యాయి.
విరాట్ కోహ్లీ కూతురు వామిక పుట్టిన రోజు జనవరి 11న కాగా, అదే రోజున సౌతాఫ్రికాతో మూడో టెస్ట్ ప్రారంభమవుతోంది. ఇది కోహ్లీకి వందో టెస్ట్ కావడం విశేషం. జనవరి 19 నుంచి భారత్, సౌతాఫ్రికా మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభమవ్వనుంది. ఒకవేళ కూతురు తొలి బర్త్‌డే కోసం లీవ్ తీసుకోవాలని కోహ్లీ భావిస్తే.. 11కు ముందే తీసుకోవాలి. కానీ బర్త్‌డే అయిన వారం తర్వాత మొదలయ్యే వన్డే సిరీస్‌కు దూరంగా ఉండాలనుకోవడం చూస్తే రోహిత్ కెప్టెన్సీలో ఆడటం తనకు ఇష్టం తేదన్న అనుమానాలు కలుగుతున్నాయి.
ఇక వన్డే కెప్టెన్సీ నుంచి వేటుకు గురైనప్పటి నుంచి మౌనంగా ఉన్న విరాట్ కోహ్లీ.. నేడు మీడియా ముందుకొస్తున్నాడు. టెస్ట్ సిరీస్ కోసం సౌతాఫ్రికా బయల్దేరే ముందు తన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడనున్నాడు. ఇందులో అన్ని అంశాలపై క్లారిటీ రానుంది. సౌతాఫ్రికాతో వన్డేలు ఆడాలని బీసీసీఐ నుంచి వస్తున్న రిక్వెస్ట్‌కు కోహ్లీ ఒప్పుకునే చాన్సుంది. ఒకవేళ బ్రేక్ తీసుకునేందుకు మొగ్గు చూపితే అందుక కారణాలను వెల్లడించొచ్చు. ఈ రోజు మధ్యాహ్నాం 1 గంటలకు ఈ మీడియా సమావేశం ప్రారంభమయ్యే అవకాశం ఉంది.