India Tour Of South Africa: టీమిండియా క్వారంటైన్ షురూ.. ఇంకా జట్టుతో కలవని కోహ్లీ!

న్యూఢిల్లీ: సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లనున్న భారత క్రికెట్ జట్టు మూడు రోజుల క్వారంటైన్ మొదలైంది. ఈ పర్యటనలో సౌతాఫ్రికాతో మూడు టెస్ట్‌లు, మూడు వన్డేల సిరీస్ ఆడేందుకు 18 మంది సభ్యులతో కూడిన టీమిండియా డిసెంబర్ 16న ప్రత్యేక విమానంలో జోహన్నెస్ బర్గ్ వెళ్లనుంది. ఫ్లైట్ ఎక్కక ముందే ముంబైలో ప్రాక్టీస్ క్యాంప్ ఏర్పాటు చేసిన బీసీసీఐ.. ముందు జాగ్రత్తగా క్వారంటైన్ కూడా ఏర్పాటు చేసింది. అయితే టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రాక్టీస్ క్యాంప్‌ను ఎగ్గొట్టడంతో పాటు ఇంకా జట్టుతో చేరలేదు. దాంతో ఈ వ్యవహారం భారత క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

జట్టుతో కలవని కోహ్లీ..
భారత వన్డే జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్‌ను తప్పించి రోహిత్ శర్మను నియమించినప్పటి నుంచి అతను ఎవరికీ అందుబాటులోకి రావడం లేదు. చివరకు ఫోన్‌ను సైతం స్విచ్ ఆఫ్ చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. వన్డే కెప్టెన్సీపై తాను ఏ నిర్ణయం తీసుకోకముందే బీసీసీఐ రోహిత్‌కు టీమిండియా వన్డే పగ్గాలు అప్పజెప్పడం సహించకే కోహ్లీ ఇలా ప్రవర్తిస్తుంటాడని అభిమానులు ఆరోపిస్తున్నారు. జొహనెస్‌బర్గ్ ఫ్లయిట్ ఎక్కేందుకు మరో రెండు రోజుల సమయం మాత్రమే ఉండడం.. కోహ్లీ ఇంతవరకు జట్టుతో కలవకపోవడంతో అభిమానులు కలవరపడుతున్నారు.

అన్ని గాలి వార్తలే..
అయితే విరాట్ కోహ్లీ మంగళవారం(డిసెంబర్ 14)న జట్టుతో కలుస్తాడని బీసీసీఐ వర్గాలు స్పష్టం చేశాయి. ప్రాక్టీస్ క్యాంప్, క్వారంటైన్‌కు ఆలస్యంగా వస్తానని కోహ్లీ తమకు సమాచారమిచ్చాడని పేర్కొన్నాయి. ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్న ఓ భారత ఆటగాడు సైతం ఈ విషయాన్ని ధృవీకరించాడు. రోహిత్, కోహ్లీ మధ్య ఎలాంటి విభేధాలు లేవని, అవన్నీ వండివార్చిన కథనాలేనని కొట్టిపారేసాడు. 'రోహిత్-కోహ్లీ మధ్య ఎలాంటి విభేధాలు లేవు. వారిద్దరి మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. ఇవన్నీ వండి వార్చిన కథనాలే. వాళ్లిద్దరూ ఫ్రొఫెషనల్ క్రికెటర్లు. ఒకరికొకరు పరస్పరం గౌరవించుకుంటారు. టీమ్ ఆటగాళ్లందరికి విరాట్ భాయ్ అంటే గౌరవమే. అతను కూడా అందరితో సన్నిహితంగా ఉంటాడు. అతను ఇంకా జట్టుతో చేరలేదు.'అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ భారత క్రికెటర్ పేర్కొన్నాడు.

కోహ్లీ ఫోన్ స్విచ్చాఫ్..
విరాట్ తన రాకపై అధికారికంగా సమాచారమిచ్చాడు. వ్యక్తిగత కారణాలతో ఇంకా అతను భారత క్యాంప్‌లో చేరలేదు. మంగళవారం జట్టుతో కలిసే అవకాశం ఉంది. జోహన్నస్ బర్గ్ ముందు ఆటగాళ్లంతా మూడు రోజుల క్వారంటైన్ పాటించనున్నారు'అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇక శ్రేయస్ అయ్యర్ తన క్వారంటైన్ పిక్‌ను ఇన్‌స్టా స్టోరీలో పంచుకున్నాడు. ఇక బీసీసీఐ అధికారులు, సెలెక్టర్లు విరాట్ కోహ్లీకి ఫోన్ చేసినా అతను స్పందించలేదని ఇన్‌సైడ్ స్పోర్ట్స్ వెబ్‌సైడ్ పేర్కొంది. కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ శర్మ సైతం ఈ విషయాన్ని వెల్లడించాడు. కోహ్లీ ఫోన్ స్విచ్చాఫ్‌లో ఉందన్నాడు.

బాక్సింగ్ డే టెస్ట్‌తో..
కాగా, డిసెంబర్ 26న ప్రారంభమయ్యే బాక్సింగ్ డే టెస్టుతో టీమిండియా.. దక్షిణాఫ్రికా పర్యటన మొదలవుతోంది. 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ అనంతరం టీమిండియా మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. టెస్ట్ జట్టుకు కోహ్లీ సారథ్యం వహించనుండగా.. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌కు రోహిత్ శర్మ జట్టును నడిపించనున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications