Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India Tour of South Africa పూర్తి షెడ్యూల్.. మ్యాచ్ టైమింగ్స్ ఇవే!

India Tour of South Africa: ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా సౌతాఫ్రికా పర్యటనకు సిద్దమైంది. ఈ టూర్‌లో సౌతాఫ్రికాతో టీమిండియా మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్ట్‌ల సిరీస్‌ ఆడనుంది. ఇప్పటికే ఈ సిరీస్‌లకు సంబంధించిన వేర్వేరు భారత జట్లను అజిత్ అగార్కర్ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీ ప్రకటించింది.

ఈ పర్యటనలోని పరిమిత ఓవర్ల సిరీస్‌లకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ దూరమయ్యారు. వైట్‌బాల్ సిరీస్‌లకు అందుబాటులో ఉండమని ఈ ఇద్దరూ బీసీసీఐకి సమాచారమిచ్చారు.

India Tour Of South Africa: Squads, Schedule and Timings Details

ప్రపంచకప్ ఫైనల్ పరాజయం అనంతరం ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు దూరంగా ఉన్న ఈ ఇద్దరూ.. ప్రస్తుతం లండన్‌లో తమ కుటుంబ సభ్యులతో కలిసి ఈ విశ్రాంతి సమయాన్ని ఆస్వాదిస్తున్నారు. సౌతాఫ్రికాతో జరిగే రెండు టెస్ట్‌ల సిరీస్‌తో మళ్లీ మైదానంలోకి రీఎంట్రీ ఇవ్వనున్నారు. డబ్ల్యూటీసీ 2025లో భాగంగా ఈ సిరీస్ జరగనుంది.

వైట్‌బాల్ సిరీస్‌లకు రోహిత్ శర్మ దూరంగా ఉండటంతో టీ20 సిరీస్‌‌కు సూర్యకుమార్ యాదవ్, వన్డేల్లో కేఎల్ రాహుల్ జట్టును నడిపించనున్నారు. ప్రపంచకప్‌లో చీలమండ గాయానికి గురైన హార్దిక్ పాండ్యా.. ఈ పర్యటన మొత్తానికి దూరమయ్యాడు.

డిసెంబర్ 10న జరిగే తొలి టీ20తో టీమిండియా సౌతాఫ్రికా పర్యటన మొదలవ్వనుంది. రెండో టెస్ట్ ముగిసే జనవరి 7 వరకు ఈ పర్యటన కొనసాగనుంది. సుమారు రెండు నెలల పాటు భారత ఆటగాళ్లు సౌతాఫ్రికా పర్యటనలోనే ఉండనున్నారు.

ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా టీ20 సిరీస్ షెడ్యూల్:

తొలి టీ20: డిసెంబర్ 10, డర్బన్ వేదికగా.. రాత్రి 7.30 గంటలకు ప్రారంభం.

రెండో టీ20: డిసెంబర్ 12, జిక్యూబెర్హా వేదికగా.. రాత్రి 8.30 గంటలకు ప్రారంభం.

మూడో టీ20: డిసెంబర్ 14, జోహన్నెస్‌బర్గ్ వేదికగా.. రాత్రి 8.30 గంటలకు ప్రారంభం

ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా వన్డే సిరీస్ షెడ్యూల్:

తొలి వన్డే: డిసెంబర్ 17, జోహెన్నస్‌బర్గ్ వేదికగా.. మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం.

రెండో వన్డే: డిసెంబర్ 19, జిక్యూబెర్హా వేదికగా సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభం.

మూడో వన్డే: పార్ల్ వేదికగా.. సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభం.

ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా టెస్ట్ సిరీస్ షెడ్యూల్:

తొలి టెస్ట్: డిసెంబర్ 26 నుంచి 30 వరకు, సెంచూరియన్ వేదికగా.. మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం

రెండో టెస్ట్: జనవరి 3 నుంచి 7 వరకు, కేప్‌టౌన్ వేదికగా.. మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం

భారత టీ20 జట్టు: యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), రింకూ సింగ్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్(కీపర్), జితేశ్ శర్మ(కీపర్), రవీంద్ర జడేజా(వైస్‌ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, దీపక్ చాహర్.

భారత వన్డే జట్టు: రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, తిలక్ వర్మ, రజత్ పటీదార్, రింకూ సింగ్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(కెప్టెన్), సంజూ శాంసన్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుత్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, ముఖేష్ కుమార్, ఆవేశ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, దీపక్ చాహర్.

భారత టెస్ట్ టీమ్: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్(కీపర్), కేఎల్ రాహుల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, మహమ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా(వైస్ కెప్టెన్), ప్రసిధ్ కృష్ణ.

Story first published: Monday, December 4, 2023, 16:03 [IST]
Other articles published on Dec 4, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+