Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India Tour Of South Africa: టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. టెస్ట్ సిరీస్ నుంచి రోహిత్ శర్మ ఔట్!

Rohit Sharma Out Of Test Series Due To Injury

న్యూఢిల్లీ: భారత అభిమానులకు బ్యాడ్ న్యూస్. సౌతాఫ్రికా పర్యటనలోని టెస్ట్ సిరీస్‌ నుంచి టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్, టెస్ట్ వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ తప్పుకున్నాడు. ఈ పర్యటనను ఉద్దేశించి భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఏర్పాటు చేసిన ప్రాక్టీస్ క్యాంప్‌లో రోహిత్ శర్మ గాయపడ్డాడు. ఆదివారం జరిగిన ఈ ప్రాక్టీస్ సెషన్‌లో టీమిండియా త్రో డౌన్ స్పెషలిస్ట్ రఘుతో హై బౌన్సర్ ప్రాక్టీస్ చేసిన హిట్ మ్యాన్.. తొడ కండరాల గాయానికి గురయ్యాడు.

ఈ సెషన్‌లో అతని ఎడమ తొడ కండరాలు పట్టేసాయి. దాంతో మూడు టెస్ట్‌ల సిరీస్‌కు రోహిత్ దూరమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ దృవీకరించింది. రోహిత్ శర్మ స్థానంలో ప్రియాంక్ పాంచల్‌ను ఎంపిక చేస్తున్నట్లు ట్విటర్ వేదికగా ప్రకటించింది.

టెస్ట్ సిరీస్ అనంతరం ప్రారంభమయ్యే మూడు వన్డేల సిరీస్‌కు కూడా రోహిత్ దూరమయ్యే అవకాశం ఉంది. టెస్ట్ సిరీస్ అనంతరం ప్రారంభమయ్యే మూడు వన్డేల సిరీస్‌కు కూడా రోహిత్ దూరమయ్యే అవకాశం ఉంది. ముంబైలోని శరద్ పవార్ అకాడమీలో ఆదివారం రిషభ్ పంత్, అజింక్యా రహానే, కేఎల్ రాహుల్, శార్దూల్ ఠాకూర్‌తో కలిసి ట్రైనింగ్ సెషన్‌లో పాల్గొన్న హిట్ మ్యాన్.. బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ గాయపడ్డాడు. భారత వన్డే సారథిగా, టెస్ట్ టీమ్ వైస్ కెప్టెన్‌గా ఇటీవల డబుల్ ప్రమోషన్ అందుకున్న రోహిత్ శర్మ.. సౌతాఫ్రికా పర్యటన కోసం మూడు రోజుల క్రితమే ప్రాక్టీస్ షురూ చేశాడు. సఫారీ గడ్డపై సవాల్ విసిరే బౌన్సీ పిచ్‌లపై రాణించడంపై ప్రత్యేక దృష్టి సారించాడు.

టీమిండియా త్రో డౌన్ స్పెషలిస్ట్ రాఘవేంద్ర అలియాస్ రఘుతో ఎక్కువ బౌన్స్ అవుతున్న త్రో డౌన్స్ ప్రాక్టీస్ చేశాడు. సౌతాఫ్రికా పేసర్లు రబడా, అన్రిచ్ నోర్జ్, ఎంగిడిని ఫేస్ చేసేందుకు రఘుతో త్రో డౌన్స్ వేయించుకున్నాడు. అయితే రఘు వేసిన ఓ త్రో డౌన్ ఆడే క్రమంలో రోహిత్ శర్మ ఎడమ తొడ కండరాలు పట్టేసాయి. గతంలో కూడా రోహిత్ శర్మ ఇదే సమస్యతో బాధపడ్డాడు. ఫిట్‌నెస్‌పై అంతగా కేర్ తీసుకొని రోహిత్ శర్మ తరుచూ ఇలానే గాయపడుతూ జట్టుకు దూరమవుతున్నాడు. తొడకండరాల గాయం నుంచి కోలుకోవాలంటే.. బరువు తగ్గాలని ఇప్పటికే రోహిత్‌కు నిపుణులు సూచించారు. ఐపీఎల్ 2020 సీజన్ తర్వాత వెయిట్ లాస్‌పై హిట్ మ్యాన్ ప్రత్యేక దృష్టిసారించాడు. కానీ మళ్లీ అదే గాయానికి గురవ్వడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.

Story first published: Monday, December 13, 2021, 20:08 [IST]
Other articles published on Dec 13, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+