India Tour Of South Africa: టీమిండియాకు బిగ్ షాక్!
Mohammed Shami Injured: సౌతాఫ్రికా పర్యటనకు ముందే టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. స్టార్ పేసర్ మహమ్మద్ షమీ ఈ పర్యటనకు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పర్యటనలోని టెస్ట్ సిరీస్‌కు మాత్రమే ఎంపికైన షమీ.. ప్రస్తుతం చీలమండ గాయంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతను ముంబైలోని స్పోర్ట్స్ ఆర్థోపెడిక్ స్పెషలిస్ట్ వద్ద చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం.
సౌతాఫ్రికాతో టీమిండియా రెండు టెస్ట్‌లు ఆడనుండగా తొలి మ్యాచ్ డిసెంబర్ 26న ప్రారంభం కానుంది. ఈ బాక్సింగ్ డే టెస్ట్‌కు షమీ అందుబాటులో ఉండటం అనుమానంగా మారింది. ఈ సిరీస్‌కు 16 మంది సభ్యులతో కూడిన జట్టును అజిత్ అగార్కర్ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీ ప్రకటించింది. బీసీసీఐ ప్రకటనలోనే మహమ్మద్ షమీ ఫిట్‌నెస్ విషయాన్ని ప్రస్తావించింది. అతను పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తేనే ఈ సిరీస్ ఆడుతాడని తెలిపింది.

అయితే ఈ చీలమండ గాయం మైదానంలో అయ్యింది కాదని ఓ ప్రముఖ వార్తా సంస్థ పేర్కొంది. 'ఇది మైదానంలో అయిన గాయం కాదు. కొన్నాళ్లుగా చీలమండలో డెవలప్ అయిన గాయం. స్పోర్ట్స్ ఆర్థోపెడిక్ స్పెషలిస్ట్‌ను కలిసేందుకు మహమ్మద్ షమీ ముంబైకి వచ్చాడు. చికిత్స అనంతరం అతను నేరుగా ఎన్‌సీఏకు వెళ్లి రిహాబిలిటేషన్ తీసుకోనున్నాడు.
సౌతాఫ్రికాతో బాక్సింగ్ డే టెస్ట్ సమయానికి అతను కోలుకోకపోతే సెలెక్టర్లు అతన్ని జట్టు నుంచి తప్పించనున్నారు. 'అని సదరు వార్తా సంస్థ తెలిపింది. ఈ గాయం కారణంగానే షమీని సౌతాఫ్రికాతో పరిమిత ఓవర్ల సిరీస్‌లకు ఎంపిక చేయలేదు.
వన్డే ప్రపంచకప్ 2023లో సంచలన ప్రదర్శనతో 24 వికెట్లు పడగొట్టిన మహమ్మద్ షమీ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ప్రపంచకప్ చరిత్రలో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా.. జహీర్ ఖాన్(44)ను మహమ్మద్ షమీ(55) అధిగమించారు. అంతేకాకుండా అత్యధిక సార్లు ఐదు వికెట్ల ఘనతను పేసర్‌గా చరిత్రకెక్కాడు.
సౌతాఫ్రికా పర్యటనకు ఎంపిక చేసిన భారత టెస్ట్ టీమ్:
రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యశస్వీ జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్(కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ సిరాజ్, ముఖేశ్ కుమార్, మహమ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా, ప్రసిధ్ కృష్ణ
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications