Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India Tour of South Africa 2021: ఫస్ట్ టెస్ట్‌ ప్రారంభానికి ముందు సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం!

India Tour of South Africa 2021: First Test Match likely to be played behind the closed doors

సెంచూరియన్: భారత్‌తో టెస్ట్ సిరీస్‌కు ముందు సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో ముందస్తు భద్రతాపరమైన చర్యలు చేపట్టింది. డిసెంబర్ 26(బాక్సింగ్ డే) నుంచి ప్రారంభంకానున్న తొలి టెస్ట్‌ను ప్రేక్షకులు లేకుండానే నిర్వహించనున్నారు. అంతేకాకుండా దేశీయంగా నాలుగు రోజులపాలు జరిగే మ్యాచ్‌లను వాయిదా వేస్తున్నట్లు సీఎస్‌ఏ ప్రకటించింది.

'డొమిస్టిక్‌ క్రికెట్‌లో డివిజన్ వన్ (డిసెంబర్ 19-22) ఐదో రౌండ్ మ్యాచ్‌లను వాయిదా వేయాలని నిర్ణయించాం. కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో బయో బబుల్‌ వెలుపల పోటీలు జరుగుతున్నందున రక్షణ చర్యగా వాయిదా వేయాలని అనుకున్నాం. ఇక భారత్‌తో జరిగే ఫస్ట్ టెస్ట్‌ను ప్రేక్షకులు లేకుండానే నిర్వహించనున్నారు'అని సీఎస్‌ఏ అధికారి వెల్లడించారు. అయితే వాయిదా పడిన దేశవాళీ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను నూతన సంవత్సరంలో ఖరారు చేస్తామని తెలిపారు.

భారత్‌, సౌతాఫ్రికా జట్ల మధ్య డిసెంబర్ 26 (బాక్సింగ్ డే) నుంచి తొలి టెస్టు ప్రారంభమవుతుంది. ఇప్పటికే విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టెస్టు జట్టు సౌతాఫ్రికాలో అడుగు పెట్టింది. టెస్టు సిరీస్‌ కోసం ఆటగాళ్లు కఠినంగా సాధన చేస్తున్నారు.

ఇప్పటి వరకు ఆఫ్రికా గడ్డ మీద ఒక్క సిరీస్‌ను గెలుచుకోని టీమిండియా.. చరిత్ర తిరగరాయాలని భావిస్తోంది. తొలి టెస్టు డిసెంబర్ 26-30, రెండో టెస్టు జనవరి 03-07, ఆఖరి టెస్టు జనవరి 11-15 వరకు జరుగుతుంది. జనవరి 19, 21, 23వ తేదీల్లో మూడు వన్డేలు జరుగుతాయి.

Story first published: Monday, December 20, 2021, 13:06 [IST]
Other articles published on Dec 20, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+