For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్ X శ్రీలంక వన్డే సిరీస్.. కోహ్లీ, రోహిత్ రీఎంట్రీ!

ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ ముగిసిన వెంటనే టీమిండియా.. శ్రీలంక పర్యటనకు వెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు టెస్ట్‌ల అండర్సన్-సచిన్ ట్రోఫీ ఆగస్టు తొలి వారంలో ముగియనుంది. ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఇంగ్లండ్ పర్యటన అనంతరం టీమిండియా బంగ్లాదేశ్‌ టూర్‌కు వెళ్లాల్సి ఉంది. అక్కడ ఆ జట్టుతో వన్డేతో పాటు టీ20 సిరీస్ ఆడాల్సి ఉంది. కానీ అనూహ్యంగా ఈ పర్యటన 2026కి వాయిదా పడింది. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో నెలకొన్న పరిస్థితుల కారణంగా టీమిండియా పర్యటించలేదని బీసీసీ భావించింది. దాంతోనే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుతో చర్చలు జరిపి ఈ పర్యటనను వాయిదా వేసింది.

అనూహ్యంగా ఈ పర్యటన వాయిదా పడటంతో ఆటగాళ్లుక విశ్రాంతి దక్కుతుందని అందరూ భావించారు. మరోవైపు శ్రీలంకలో జూలై, ఆగస్టులో జరగాల్సిన లంక ప్రీమియర్ లీగ్ వాయిదా పడింది. దాంతో ఆ జట్టుకు కూడా ఈ విండో ఖాళీగా మిగిలిపోనుంది. ఈ గ్యాప్‌లో అంతర్జాతీయ సిరీస్‌లు నిర్వహించాలని శ్రీలంక క్రికెట్ బోర్డు భావిస్తోంది. ఈ క్రమంలోనే భారత్‌తో మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ నిర్వహించాలని ప్రయత్నిస్తోంది.

India to Play T20I and ODI Series Against Sri Lanka in August Reports

ఇరు దేశాల క్రికెట్ బోర్డుల ఈ ద్వైపాక్షిక సిరీస్‌లకు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఆగస్టులో భారత్, శ్రీలంక మధ్య మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌లు జరగనున్నాయి. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఈ సిరీస్‌లు జరిగితే అంతర్జాతీయ టెస్ట్, టీ20లకు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రీఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ ఇద్దరు ఆటగాళ్లు కేవలం వన్డే క్రికెట్‌లో మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే.

Story first published: Wednesday, July 9, 2025, 18:07 [IST]
Other articles published on Jul 9, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+