T20 World Cup 2022: హమ్మయ్యా.. ఆ దరిద్రపుగొట్టు అంపైర్ అయితే లేడు!

హైదరాబాద్: టీ20 ప్రపంచకప్ 2022లో అంచనాలకు తగ్గట్లు దుమ్మురేపిన టీమిండియా సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. జింబాబ్వేతో ఆదివారం ఏక పక్షంగా సాగిన ఆఖరి సూపర్ 12 మ్యాచ్‌లో సమష్టిగా రాణించి 71 పరుగులతో గెలుపొందింది. ఈ విజయంతో గ్రూప్-2లో అగ్రస్థానంలో నిలిచిన భారత్.. సెమీఫైనల్-2లో గ్రూప్-1 రన్నరప్‌గా నిలిచిన ఇంగ్లండ్‌తో తలపడనుంది.
గురువారం అడిలైడ్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో రోహిత్ సేన.. జోస్ బట్లర్ టీమ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్‌కు అంపైరింగ్ చేసే అంపైర్ల జాబితాను ఐసీసీ తాజాగా విడదుల చేసింది. కుమార ధర్మసేన- పాల్ రీఫెల్ ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరించనుండగా.. క్రిస్ గాఫ్‌నే మూడో అంపైర్‌గా.. రాడ్ టక్కర్ ఫోర్త్ అంపైర్, డేవిడ్ బూన్ మ్యాచ్ రిఫరీగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
ఆ దరిద్రపుగొట్టు అంపైర్ లేడు..
ఈ జాబితాను చూసి భారత అభిమానులు తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సారి టీ20 ప్రపంచకప్ భారత్‌దేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. సెమీస్‌లో ఇంగ్లండ్ చిత్తవ్వడం ఖాయమని, ఫైనల్లో న్యూజిలాండ్ వచ్చినా.. పాక్ తలపడినా.. రోహిత్ సేన విజయాన్ని ఆపలేరని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు దరిద్రపుగొట్ట అంపైర్ రిచర్డ్ కెటిల్ బరో లేడని, ఇది భారత్‌కు కలిసొచ్చే అంశమని పేర్కొంటున్నారు. గత 9 ఏళ్లుగా భారత్ ఐసీసీ టైటిల్ గెలవకపోవడానికి కెటిల్ బరోనే కారణమని, ఈసారి అతను లేడు కాబట్టి భారత్ విజయం లాంఛనమేనని కామెంట్ చేస్తున్నారు.
2014 నుంచి ఓటమే..
మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని భారత జట్టు 2013 చాంపియన్స్ ట్రోఫీతో చివరి ఐసీసీ టైటిల్‌ను గెలిచింది. ఆ తర్వాత ఐసీసీ టోర్నీల్లో ఆరు సార్లు నాకౌట్ చేరినా.. టీమిండియాకు ఓటమే ఎదురైంది. ముఖ్యంగా కెటిల్ బరో అంపైరింగ్ చేసిన నాకౌట్ మ్యాచ్‌ల్లో భారత్‌కు ప్రతికూల ఫలితమే వచ్చింది. 2014 టీ20 ప్రపంచకప్ ఫైనల్, 2015 వన్డే ప్రపంచకప్ సెమీ ఫైనల్, 2016 టీ20 ప్రపంచకప్ సెమీ ఫైనల్, 2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్, 2019 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్, 2021 వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో కెటిల్ బరో అంపైరింగ్ చేయగా.. భారత్ ఓటమిపాలైంది.
మూడేసి ఫైనల్స్, సెమీ ఫైనల్స్..
ఈ క్రమంలోనే కెటిల్ బరోను భారత అభిమానులు దరిద్రపుగొట్టు అంపైర్‌గా పిలుస్తారు. 2014 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో శ్రీలంక చేతిలో ఓడిన టీమిండియా తృటిలో టైటిల్ చేజార్చుకుంది. విరాట్ కోహ్లీ రాణించినా.. యువరాజ్ సింగ్ జిడ్డు బ్యాటింగ్ టైటిల్‌ను దూరం చేసింది. 2015 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియాతో ధోనీ సేన ఓటమిపాలైంది. భారత్ వేదికగా జరిగిన 2016 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో విండీస్ విధ్వంసకర బ్యాటింగ్ ముందు టీమిండియా తేలిపోయింది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ సత్తా చాటినా ఫలితం లేకపోయింది.
పాక్ చేతిలోనూ...
2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్థాన్ చేతిలో టీమిండియా చిత్తయ్యింది. జస్‌ప్రీత్ బుమ్రా నోబాల్ తప్పిదంతో పాటు రాహుల్, రోహిత్, విరాట్ కోహ్లీ బ్యాటింగ్ వైఫల్యం జట్టు పతనాన్ని శాసించింది. 2019 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్లో కీలక సమయంలో మహేంద్ర సింగ్ ధోనీ రనౌటవ్వడం.. కెటిల్ బరో అయ్యో అంటూ ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వడం అభిమానులు ఎప్పటికీ మరిచిపోలేరు.
2021 వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్లో కెటిల్ బరో థర్డ్ అంపైర్‌గా వ్యవహరించగా.. భారత్ పేలవ బ్యాటింగ్‌తో మూల్యం చెల్లించుకుంది. ఈ టీ20 ప్రపంచకప్ అంపైరింగ్ ప్యానెల్‌లో కెటిల్ బరో కూడా ఉన్నప్పటికీ అతను భారత్-ఇంగ్లండ్ మ్యాచ్‌కు అంపైరింగ్ చేయడం లేదు. ఫైనల్‌కు అంపైరింగ్ చేస్తాడా? అని కూడా అభిమానులు సందేహపడుతున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications