శ్రీలంకతో టెస్ట్ సిరీస్.. బుమ్రా, జడేజా రీఎంట్రీ! సుందర్, నితీష్ రెడ్డి డౌట్!
రెండు టెస్ట్‌ల సిరీస్ కోసం శ్రీలంక పర్యటనకు వెళ్లే భారత జట్టును అజిత్ అగార్కర్ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీ ఈ వారం ప్రకటించే అవకాశం ఉంది. ఆగస్ట్ 15న గాలే వేదికగా జరిగే తొలి మ్యాచ్‌తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఇంగ్లండ్ పర్యటనలోని వన్డే సందర్భంగానే ఈ సిరీస్‌కు సంబంధించిన చర్చలు జరిగాయి.
సుందర్, నితీష్ డౌట్..
అయితే వన్డే సిరీస్‌లో గాయపడిన వాషింగ్టన్ సుందర్ తుది ఫిట్‌నెస్ రిపోర్ట్ కోసం సెలెక్టర్లు వేచి చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్‌తో రెండో వన్డే సందర్భంగా వాషింగ్టన్ సుందర్‌కు కుడి తొడ కండరాల్లో గాయామైంది. స్కానింగ్‌లో గ్రేడ్ 1 గాయమని తేలగా.. నాలుగు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. దాంతో అతను ఆఖరి వన్డేకు దూరమయ్యాడు.

ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్(సీఓఈ)లో చికిత్స తీసుకుంటున్నాడు. అతనితో పాటు తెలుగు తేజం, యువ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి కూడా అక్కడే ఉన్నాడు. అఫ్గాన్‌తో వన్డే సిరీస్ ఆడిన నితీష్ రెడ్డి.. గాయంతో ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనకు దూరమయ్యాడు.
బుమ్రా, జడేజా రీఎంట్రీ..
ఈ ఇద్దరూ గాయాల నుంచి కోలుకోని పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తేనే భారత జట్టులో చోటు దక్కించుకుంటారు. ఆగస్ట్ 4న శ్రీలంక పర్యటనకు భారత జట్టు బయల్దేరనుంది. అఫ్గాన్‌తో టెస్ట్ సిరీస్‌కు దూరమైన స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజాకు ఈ సిరీస్‌తో రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ వాషింగ్టన్ సుందర్ దూరమైతే.. అతని స్థానంలో హర్ష్‌దూబేకు అవకాశం దక్కుతుంది.
మానవ్ సుతార్, కుల్దీప్ యాదవ్‌లు తమ స్థానాలను నిలబెట్టుకోనున్నారు. మహమ్మద్ సిరాజ్ కూడా తిరిగి జట్టులోకి రానుండగా.. గుర్నూర్ బ్రార్, ప్రసిధ్ కృష్ణ తమ స్థానాలను నిలబెట్టుకోనున్నారు. ఐపీఎల్ తర్వాత జడేజా ఒక్క మ్యాచ్ ఆడకపోయినా.. అతను వరల్డ్ నెంబర్ వన్ టెస్ట్ స్పిన్నర్ అంటూ అగార్కర్ చెప్పడం అతని రీఎంట్రీకీ బలం చేకూరుస్తోంది.
ఈ సిరీస్ గెలిచేనా..?
మరోవైపు గౌతమ్ గంభీర్ పర్యవేక్షణలో టీమిండియా టెస్ట్‌ల్లో ఘోర పరాజయాలను చవిచూసింది. సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో మూడు టెస్ట్‌ల సిరీస్‌ను వైట్ వాష్ అయిన టీమిండియా.. ఆ తర్వాత సౌతాఫ్రికా చేతిలోనూ చిత్తయ్యింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ చేరాలంటే శ్రీలంకతో సిరీస్ గెలవడం టీమిండియాకు కీలకం. ఈ సిరీస్ అనంతరం భారత్.. న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

