Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India squad for BAN: రిషభ్ పంత్ ఇన్.. సర్ఫరాజ్ ఖాన్ ఔట్! బంగ్లాదేశ్‌తో తలపడే భారత టెస్ట్ టీమ్ ఇదే!

బంగ్లాదేశ్‌తో జరిగే రెండు టెస్ట్‌ల సిరీస్‌తో టీమిండియా తమ హోమ్ సీజన్‌ను ప్రారంభించనుంది. సెప్టెంబర్ 19 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. అనంతరం బంగ్లాదేశ్‌తో మూడు టీ20ల సిరీస్ ఆడనున్న భారత్.. ఆ తర్వాత న్యూజిలాండ్‌తో మూడు టెస్ట్‌ల సిరీస్‌‌లో తలపడనుంది.

ప్రస్తుతం టెస్ట్ క్రికెట్‌లో టీమిండియా పూర్తి ఆధిపత్యం చెలాయిస్తోంది. ముఖ్యంగా సొంతగడ్డపై టెస్ట్‌ల్లో టీమిండియాకు తిరుగులేదు. 2013 నుంచి ఏ జట్టు కూడా సొంతగడ్డపై భారత్‌ను ఓడించలేదు. ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌ను భారత్ 4-1తో గెలుచుకుంది. హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో ఓడినా.. చివరి నాలుగు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.

India Test squad for BAN Rishabh Pant In and Sarfaraz Khan Out

సన్నాహకంగా..
బంగ్లాదేశ్‌తో సిరీస్‌లోనూ టీమిండియాకు తిరుగుండదు. అయితే వచ్చే నాలుగు నెలల్లో టీమిండియా 10 టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది. న్యూజిలాండ్‌తో పాటు ఆస్ట్రేలియా గడ్డపై 5 టెస్ట్‌ల సిరీస్‌లో పాల్గొననుంది. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌ను ప్రాక్టీస్ మ్యాచ్‌గా ఉపయోగించుకోవాలని భారత్ భావిస్తోంది.

ఈ క్రమంలోనే బంగ్లాదేశ్‌తో పూర్తి స్థాయి జట్టుతో బరిలోకి దిగనుంది. 16 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసేందుకు అజిత్ అగార్కర్ సారథ్యంలోని భారత సెలెక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది.

బుమ్రాకు రెస్ట్..
ఆస్ట్రేలియా పర్యటన నేపథ్యంలో టీమిండియా ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాకు రెస్ట్ ఇచ్చే అవకాశం ఉంది. అతను మినహా మిగతా స్టార్ ఆటగాళ్లంతా ఈ సిరీస్‌తోనే రెడ్ బాల్ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇవ్వనున్నారు. గాయంతో దాదాపు 10 నెలల పాటు భారత జట్టుకు దూరంగా ఉన్న మహమ్మద్ షమీ.. ఈ సిరీస్‌తోనే పునరాగమనం చేయనున్నాడు.

బుమ్రా దూరమైతే అతని స్థానంలో ముఖేష్ కుమార్‌కు అవకాశం దక్కవచ్చు. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ ఆడనుండగా.. మిడిలార్డర్‌లో శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, సర్ఫరాజ్ ఖాన్, కేఎల్ రాహుల్ ఎంపికవ్వనున్నారు. అయ్యర్, సర్ఫరాజ్ ఖాన్‌ల్లో ఒక్కరినే తీసుకోవాలనుకుంటే మాత్రం సర్ఫరాజ్ ఖాన్‌పై వేటు పడనుంది.

రిషభ్ పంత్ రీఎంట్రీ..
వికెట్ కీపర్లుగా రిషభ్ పంత్, ధ్రువ్ జురెల్ ఎంపికవ్వనుండగా.. స్పిన్ ఆల్‌రౌండర్లుగా రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్‌లు బరిలోకి దిగనున్నారు. మహమ్మద్ షమీ సారథ్యంలో సిరాజ్, ముఖేష్ కుమార్ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్‌కు చోటు దక్కనుంది.

బంగ్లాదేశ్‌తో రెండు టెస్ట్‌ల సిరీస్‌కు భారత జట్టు(అంచనా)

రోహిత శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్/ సర్ఫరాజ్ ఖాన్, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, ధృవ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, జస్‌ప్రీత్ బుమ్రా/ముఖేష్ కుమార్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్.

Story first published: Wednesday, August 14, 2024, 9:06 [IST]
Other articles published on Aug 14, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+