India T20 World Cup Squad: సుందర్ ఔట్.. అశ్విన్‌కు చాన్స్.. రేసులో ఆ ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ కూడా!

న్యూఢిల్లీ: కీలక టీ20 ప్రపంచకప్ ముందు టీమిండియాకు గట్టి షాక్ తగిలింది. టీమ్ యువ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్.. ఈ మెగా టోర్నీ ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి. ఐదు టెస్ట్‌ల సిరీస్ కోసం ఇంగ్లండ్ పర్యటనకు వచ్చిన సుందర్.. అనూహ్యంగా సిరీస్ ఆరంభానికి ముందే తీవ్రంగా గాయపడి ఇంటిదారిపట్టాడు. కౌంటీ ఎలెవన్ టీమ్‌తో జరిగిన సన్నాహక మ్యాచ్‌లో భారత స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో సుందర్ కుడిచేతి వేలికి తీవ్ర గాయమైంది.
ప్రాక్టీస్ కోసం కౌంటీ ఎలెవన్ తరఫున బరిలోకి దిగడం సుందర్ కొంపముంచింది. ప్రస్తుతం రిహాబిలిటేషన్‌లో ఉన్న సుందర్.. గాయం తీవ్రత కారణంగా సెప్టెంబర్ 19 నుంచి యూఏఈ వేదికగా ప్రారంభంకానున్న ఐపీఎల్ 2021 సెకండాఫ్ లీగ్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో రాయల్ చాలెంజర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతను.. 15 రోజుల వ్యవధిలోనే ప్రారంభమయ్యే టీ20 ప్రపంచకప్ ఆడటంపై కూడా అనుమానాలు నెలకొన్నాయి.

సుందర్ దూరం..
సుందర్ స్థానాన్ని బెంగాల్ క్రికెటర్ అక్షదీప్‌తో ఆర్‌సీబీ భర్తీ చేయగా.. టీమిండియా సైతం మెగాటోర్నీ కోసం ప్రత్యామ్నాయ ఆటగాడిని వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దొరకడం ఖాయమనే వాదన వినిపిస్తోంది. వాస్తవానికి అశ్విన్‌ను పరిమిత ఓవర్ల క్రికెట్‌కు ఎందుకు దూరం పెట్టారనే విషయమే పెద్దగా ఎవరికీ అర్థం కాదు. మహేంద్ర సింగ్ ధోనీ తప్పుకోవడం.. జట్టులోకి చాహల్, కుల్దీప్ రావడంతో చెన్నై ప్లేయర్ దారులు మూసుకుపోయాయి. ఆ తర్వాత టీ20ల్లో సుందర్ అద్భుతాలు చేయడంతో అతనికి అవకాశాలు దక్కాయి.
అశ్విన్‌కు చాన్స్..
ఇప్పుడు సుందర్ ఆడలేని పరిస్థితి ఉండటంతో అశ్విన్ రీఎంట్రీ ఇవ్వడం ఖాయామనే వాదన వినిపిస్తోంది. ఎందుకంటే మెగాటోర్నీలో ఇంగ్లండ్, వెస్టిండీస్ జట్లతో ఆడాల్సి వస్తే.. ఆ జట్లలో ఎక్కువగా ఉండే లెఫ్టాండార్స్‌ను ధీటుగా ఎదుర్కొవాలంటే బంతిని బయటకు టర్న్ చేయగల అశ్విన్‌లాంటి స్పిన్నర్ జట్టులో ఉండటం కీలకం. కాబట్టి అశ్విన్‌కు అవకాశం దక్కుతుందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.
అయితే యూఏఈ పరిస్థితులు, ఆల్‌రౌండ్ సామర్థ్యం నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్‌కే చెందిన లలిత్ యాదవ్‌ను విస్మరించలేమని చెబుతున్నారు. సెకండాఫ్ ఐపీఎల్‌లో లలిత్ మ్యాచ్ విన్నింగ్ పెర్ఫామెన్స్ కనబరిస్తే అతనికే అవకాశం దక్కవచ్చంటున్నారు. ఫస్టాఫ్‌లో 5 మ్యాచ్‌లు ఆడిన లలిత్ 3 వికెట్లు తీశాడు.

అనుభవం దృష్ట్యా..
ఇక అనుభవం, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అశ్విన్‌కే ఎక్కువ అవకాశాలున్నాయని, పైగా అశ్విన్ సైతం ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయరేనని, అతను కూడా యూఏఈ గడ్డపై రాణించగలడనే వాదన వినిపిస్తోంది. 15 మంది సభ్యుల గల జట్టులో అశ్విన్ ఉండటం ఖాయమని, కానీ పిచ్ పరిస్థితులు, ప్రత్యర్థి జట్టును బట్టి తుది జట్టులో అవకాశం దక్కవచ్చంటున్నారు.
ప్రముఖ క్రికెట్ వెబ్‌సైట్ క్రిక్‌ఇన్‌ఫో సైతం ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ అశ్విన్‌కు అవకాశం ఉంటుందా? అని అభిమానులను ప్రశ్నించింది. చాలా మంది అభిమానులు అశ్విన్‌కే అవకాశం దక్కుతుందని, ఇవ్వాలని కామెంట్ చేస్తున్నారు.

నాలుగేళ్ల క్రితం..
ఇక అశ్విన్ పరిమిత ఓవర్ల సిరీస్ ఆడి నాలుగేళ్లు అవుతుంది. 2017 వెస్టిండీస్ పర్యటనలో వన్డే, టీ20 మ్యాచ్‌లు చివరిసారిగా ఆడాడు. ఆ తర్వాతి నుంచి ఐపీఎల్ రెగ్యులర్‌గా ఆడుతున్నా... భారత టెస్ట్ టీమ్‌లో కొనసాగుతున్నా.. పరిమిత ఓవర్ల ఫార్మాట్స్‌లోకి రీఎంట్రీ ఇవ్వలేకపోయాడు. చాహల్, కుల్దీప్ జట్టులో పాతుకుపోవడంతో పాటు సుందర్ రాణించడం.. అశ్విన్‌కు అవకాశం రాకుండా చేశాయి. కానీ గతేడాదిగా పరిస్థితులు మారాయి. చాహల్, కుల్దీప్ దారుణంగా విఫలమవుతుండటం.. ఇప్పుడు సుందర్ గాయపడటంతో అశ్విన్ తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. అయితే ఐపీఎల్ 2021 సెకండాఫ్ ప్రదర్శన ఆధారంగానే టీ20 ప్రపంచకప్ ఎంపిక జరగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications