India T20 WC Squad: బుమ్రా ప్లేస్‌లో మహమ్మద్ సిరాజ్.. అతనొక్కడే అడ్డు!

న్యూఢిల్లీ: అందరూ ఊహించినట్లుగానే టీ20 ప్రపంచకప్‌కు జస్‌ప్రీత్ బుమ్రా దూరమయ్యాడు. వెన్నుగాయంతో సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ నుంచి తప్పుకున్న బుమ్రా.. మెగా టోర్నీ కూడా ఆడటం లేదని బీసీసీఐ సోమవారం అధికారికంగా ప్రకటించింది. వెన్నులో ఫ్రాక్చర్ కారణంగా జట్టుకు దూరమైన బుమ్రా... ప్రస్తుతం ఎన్‌సీఏలో రిహాబిలిటేషన్‌లో ఉన్నాడు. 'బుమ్రా గాయం తగ్గడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అతను ప్రపంచకప్‌లో ఆడలేడు. మెడికల్ రిపోర్ట్స్, నిపుణుల సలహాలు, సూచనల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాం'అని బీసీసీఐ సెక్రటరీ జైషా వెల్లడించాడు. బుమ్రాకు రీప్లేస్‌మెంట్‌ను త్వరలో ప్రకటిస్తామని తెలిపాడు.

సిరాజ్‌కు చాన్స్..
అసాధారణమైన బౌలింగ్ యాక్షన్ కారణంగానే బుమ్రా వెన్ను ఒత్తిడికి గురవుతుందని నిపుణులు తేల్చారు. సుమారు 6 నెలల వరకు అతను ఆటకు దూరం కానున్నాడు. బుమ్రా స్థా స్టాండ్‌బైలో ఉన్న మహమ్మద్ షమీ, దీపక్ చాహర్‌తో పాటు హైదరాబాద్ స్టార్ మహమ్మద్ సిరాజ్ రేసులో ఉన్నాడు. ఈ క్రమంలోనే అతన్ని సౌతాఫ్రికాతో సిరీస్‌కు తీసుకున్నారు. నేడు జరిగే మూడో టీ20లోనూ సిరాజ్ ఆడే అవకాశం ఉంది. అయితే షమీ అందుబాటులో లేకుంటేనే సిరాజ్‌ను జట్టులోకి తీసుకోనున్నారని జట్టు వర్గాలు పేర్కొన్నాయి.

చెమటోడుస్తున్న షమీ..
ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న మహమ్మద్ షమీ.. తన సొంతమైదానంలో ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. వాస్తవానికి బుమ్రాకు బ్యాకప్‌గా షమీనే బీసీసీఐ ఎంపిక చేసినప్పటికీ అతను కరోనా బారిన పడి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలతో సిరీస్‌లకు దూరమయ్యాడు. ఇప్పుడు కోలుకున్నా ఫిట్‌నెస్ టెస్ట్ క్లియర్ చేయాల్సి ఉంది. ఎన్‌సీఏలో ఈ నెల 5, 6 వ తేదిల్లో షమీకి ఫిట్‌నెస్ టెస్ట్ పెట్టే అవకాశం ఉంది. ఈ టెస్ట్ పాసైతే అతనే జట్టులోకి రానున్నాడు. లేకుంటే సిరాజ్‌కు ఎంట్రీ ఖాయం అయితే. అతను సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌లో సత్తా చాటాల్సి ఉంది.

దీపక్ చాహర్ ఉన్నా..
దీపక్ చాహర్ సూపర్ ఫామ్‌లో ఉన్నా.. అతని బౌలింగ్‌లో అంతగా పేస్ లేకపోవడంతో సెలెక్టర్లు పునరాలోచనలో పడ్డారు. పైగా అతన్ని భువనేశ్వర్ కుమార్‌కు బ్యాకప్‌గానే పరిగణిస్తున్నారు. ఎందుకంటే భువనేశ్వర్, దీపక్ చాహర్‌ల బౌలింగ్ శైలి ఒక్కటే. ఇద్దరూ స్వింగ్ బౌలర్లే. పవర్ ప్లేలో సత్తా చాటగలరు. తప్ప కీలక డెత్ ఓవర్లలో అంతగా ప్రభావం చూపలేరు. ముఖ్యంగా ఆసీస్ పేస్ పిచ్‌లపై వీరు అంతగా ప్రభావం చూపలేరనేది విశ్లేషకుల అభిప్రాయం. పవర్ ప్లేలో సత్తా చాటేందుకు భువీ ఉన్నప్పటికీ.. డెత్ ఓవర్లలో రాణించే బౌలర్ కోసం టీమ్‌మేనేజ్‌మెంట్ ఎదురు చూస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications