India T20 WC Squad: సెప్టెంబర్ 16న జట్టు ప్రకటన.. హర్షల్ పటేల్, జస్‌ప్రీత్ బుమ్రా డౌట్!

న్యూఢిల్లీ: అప్‌కమింగ్ టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది సభ్యులతో కూడా భారత జట్టును బీసీసీఐ సెలెక్షన్ కమిటీ సెప్టెంబర్ 16న ప్రకటించనుంది. ఇప్పటికే ఇంగ్లండ్, సౌతాఫ్రికా,ఆస్ట్రేలియా తమ జట్లను ప్రకటించగా.. బీసీసీఐ మాత్రం వెనకాడుతుంది. స్టార్ బౌలర్లు జస్‌ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్ గాయాలతో సతమతమవుతుండటంతోనే చేతన్ శర్మ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీ టైమ్ తీసుకుంటుంది. గాయాల కారణంగా బుమ్రా, హర్షల్ పటేల్ ఆసియాకప్‌కు దూరమయ్యారు. ఎన్‌సీఏలో రిహాబిలిటేషన్ తీసుకుంటున్నారు. అయితే వీరి గాయాలపై స్పష్టత వచ్చిన వెంటనే జట్టును ప్రకటించనున్నారు.

గాయాల అప్‌డేట్ రాగానే..
ఈ క్రమంలోనే బుమ్రా, హర్షల్ పటేల్‌లకు ఎన్‌సీఏలో ఫిట్‌నెస్ టెస్ట్ నిర్వహించనున్నారు. 'జట్టు వివరాలను అందజేసేందుకు కొన్నిరోజులు మాత్రమే సమయం ఉంది. మాకు జస్‌ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్ ఫిట్‌నెస్ అప్‌డేట్స్ అందాల్సి ఉంది. వారి గాయాలపై స్పష్టత వచ్చిన వెంటనే జట్టును ప్రకటిస్తాం. ఎన్‌సీఏలో బుమ్రా, హర్షల్ పటేల్‌లకు ఫిట్‌నెస్ టెస్ట్ జరగనుంది.'అని ఓ సెలెక్షన్ కమిటీ సభ్యుడు ఇన్‌సైడ్ స్పోర్ట్స్‌కు తెలిపారు.

బుమ్రా డౌట్..
బుమ్రా వెన్ను నొప్పితో బాధపడుతుండగా.. హర్షల్ పటేల్ పక్కటెముకల గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. అయితే హర్షల్ పటేల్ పూర్తిగా కోలుకొని జట్టులోకి వచ్చేందుకు సిద్దంగా ఉన్నాడని, బుమ్రా గాయంపై మాత్రం సందేహాలు నెలకొన్నాయని ఎన్‌సీఏ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే హర్షల్ పటేల్ నెట్స్‌లో బౌలింగ్ చేస్తుండగా.. బుమ్రా మాత్రం కాస్త సమయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. టీ20 ప్రపంచకప్‌కు ఇంకా నెల రోజుల సమయం ఉన్న నేపథ్యంలో బుమ్రా ఫిట్‌నెస్ రిపోర్ట్ కోసం రాహుల్ ద్రవిడ్, రోహిత్ శర్మ వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు.

జడేజా ఔట్..
టీ20 ప్రపంచకప్ బరిలోకి దిగే జట్టు వివరాలను అందజేయడానికి ఐసీసీ సెప్టెంబర్ 16ను డెడ్‌లైన్‌గా విధించింది. భారత సెలెక్షన్ కమిటీ కూడా అదే రోజు సమావేశమై జట్టును ప్రకటించనుంది. మొకాలి శస్త్ర చికిత్సతో ఈ టోర్నీకి రవీంద్ర జడేజా దూరం కాగా.. హర్షల్ పటేల్ ఆస్ట్రేలియాతో సొంతగడ్డపై జరిగే సిరీస్‌లకు అందుబాటులోకి రానున్నాడు. జస్‌ప్రీత్ బుమ్రా గాయంపై మాత్రం సందేహాలు నెలకొన్నాయి. జస్‌ప్రీత్ బుమ్రా గాయంపై సందేహాలు నెలకొన్న నేపథ్యంలో అతనికి బ్యాకప్‌గా మహమ్మద్ షమీని ఎంపిక చేయనున్నారు. అతన్ని స్టాండ్‌బై ప్లేయర్‌గా జట్టులోకి తీసుకోనున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications