Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India T20 WC Squad: లక్కీ చాన్స్ కొట్టేసిన హైదరాబాద్ పేసర్.. రాయుడు, వీవీఎస్‌ లక్ష్మణ్‌కు దక్కని అవకాశం!

India T20 WC Squad: Mohammad Siraj or Mohammed Shami likely to replace Jasprit Bumrah

హైదరాబాద్: టీమిండియా స్టార్ పేసర్, హైదరాబాద్ గల్లీ భాయ్ మహమ్మద్ సిరాజ్ మరో లక్కీ చాన్స్ కొట్టేసాడు. వచ్చే నెల ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో ఆడే అవకాశాన్ని అందుకోనున్నాడు. ఇప్పటికే తన ప్రతిభకు అదృష్టం తోడవడంతో స్టార్ క్రికెటర్‌గా ఎదిగిన ఈ గల్లీ భాయ్ ఇప్పుడు ప్రపంచకప్ ఆడే కలను నెరవేర్చుకునేందుకు అడుగు దూరంలో నిలిచాడు. వెన్ను పూస ఫ్రాక్చర్‌తో స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా టీ20 ప్రపంచకప్‌కు దూరమైన విషయం తెలిసిందే. దాంతో అతని స్థానంలో మహమ్మద్ సిరాజ్‌ను ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

వెన్ను గాయంతో..

వెన్ను నొప్పితో బుధవారం సౌతాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో ఆడని బుమ్రాకు పరీక్షలు నిర్వహించగా.. అతని వెన్నులో ఫ్రాక్చర్ అయినట్లు తేలింది. ఎలాంటి సర్జరీ అవసరం లేకపోయినప్పటికీ.. సుమారు 4-6 నెలల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. దాంతోనే అతను త్రివేండ్రం నుంచి గౌహతికి వెళ్లలేదని సమాచారం. ఈ విషయాన్ని ప్రముఖ వార్త సంస్థ పీటీఐ తెలపగా.. బీసీసీఐ ధృవీకరించాల్సి ఉంది.

షమీ ఒక్కడే అడ్డు..

షమీ ఒక్కడే అడ్డు..

ఇక బుమ్రా స్థానంలో మహమ్మద్ షమీతో పాటు సిరాజ్ పేర్లను సెలెక్టర్లు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే షమీని ప్రపంచకప్ జట్టు స్టాండ్ బై ప్లేయర్‌గా ఎంపిక చేశారు. అయితే అతను ఇటీవలే కరోనా బారిన పడి కోలుకున్నాడు. ఈ కారణంగానే ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా‌లతో సిరీస్‌లకు దూరమయ్యాడు. కార్డియో వాస్క్యులర్ టెస్ట్ చేయాల్సి ఉంది. ఈ టెస్ట్‌లో పాసైతేనే జట్టులోకి రానున్నాడు. విఫలమైతే 100 శాతం ఫిట్‌గా లేడని సెలెక్టర్లు పరగణించనున్నారు.

పేస్, స్వింగ్ ఉండటంతో..

పేస్, స్వింగ్ ఉండటంతో..

ఒక వేళ షమీ కోలుకొని ప్రధాన జట్టులోకి వచ్చినా.. మహమ్మద్ సిరాజ్‌కు స్టాండ్‌బై లిస్ట్‌లో చోటు దక్కనుంది. సిరాజ్ బౌలింగ్‌లో పేస్, స్వింగ్ ఉండటం అతని అదనపు బలం. అతని బౌలింగ్ శైలి ఆసీస్ పరిస్థితులకు సరిగ్గా సరిపోతుంది. పైగా ఆస్ట్రేలియా గడ్డపైనే అతను అంతర్జాతీయ టెస్ట్‌లోకి అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్‌లోనే 5 వికెట్లతో సత్తా చాటాడు. అప్పుడు కూడా బుమ్రా, షమీ గాయాలతో దూరమవడంతో బౌలింగ్ విభాగాన్ని ముందుండి నడిపించాడు. ఈ క్రమంలోనే సిరాజ్‌ను తీసుకోవాలని సెలెక్టర్లు యోచిస్తున్నట్లు ఆజతక్ తమ కథనంలో పేర్కొంది.

రోహిత్ శర్మ ఒకే అంటేనే..

రోహిత్ శర్మ ఒకే అంటేనే..

అయితే సిరాజ్ ఎంపికకు కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో పాటు రోహిత్ శర్మ మద్దతు తెలపాల్సి ఉంటుంది. వారు షమీతో పాటు ఉమేశ్ యాదవ్‌కు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ సిరాజ్ జట్టులోకి వస్తే మాత్రం.. తుది జట్టులో ఉండటం ఖాయం. అదే జరిగితే తెలుగు గడ్డ నుంచి ప్రపంచకప్ ఆడిన క్రికెటర్‌గా సిరాజ్ చరిత్రకెక్కనున్నాడు. దిగ్గజ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్, అంబటి రాయుడులు అందుకోలేని ఘనతను అందుకోనున్నాడు. మనం కూడా సిరాజ్‌కు అవకాశం రావాలని కోరుకుందాం.

Story first published: Thursday, September 29, 2022, 16:37 [IST]
Other articles published on Sep 29, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+