Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India T20 WC Squad: టీమిండియాకు గుడ్ న్యూస్.. ఆ మ్యాచ్ విన్నర్లు రెడీ! ముహుర్తం ఫిక్స్!

India T20 WC Squad: Jasprit Bumrah, Harshal Patel clears Fitness test

న్యూఢిల్లీ: టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్. గాయంతో జట్టుకు దూరమైన స్టార్ పేసర్లు జస్‌ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్ పూర్తిగా కోలుకున్నారు. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ)లో శనివారం నిర్వహించిన ఫిట్‌నెస్ టెస్ట్‌ను ఈ ఇద్దరు క్లియర్ చేశారు. పక్కటెముకల గాయంతో హర్షల్ పటేల్, వెన్నుగాయంతో జస్‌ప్రీత్ బుమ్రా జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. ఈ ఇద్దరి గైర్హాజరీ కారణంగా టీమిండియా ఆసియాకప్ ఫైనల్ చేరకుండా ఇంటిదారి పట్టింది. దాంతో బుమ్రా, హర్షల్ పటేల్ విలువ ఏంటో మరోసారి అందరికి తెలుసొచ్చింది.

 ఆస్ట్రేలియాతో రీఎంట్రీ..

ఆస్ట్రేలియాతో రీఎంట్రీ..

ఇక ఆస్ట్రేలియా వేదికగా వచ్చే నెలలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు కూడా ఈ ఇద్దరిలో ఒకరు దూరమయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. హర్షల్ పటేల్ పూర్తిగా కోలుకున్నా.. బుమ్రా ఇంకా ఫిట్ అవ్వలేదని ప్రచారం జరిగింది. కానీ ఇవన్నీ గాలి వార్తలేనని ఎన్‌సీఏ వర్గాలు పేర్కొన్నాయి. బీసీసీఐ మెడికల్ టీమ్.. ఎన్‌సీఏలో వీరికి శనివారం ఫిట్‌నెస్ టెస్ట్ నిర్వహించగా.. ఇద్దరు క్లియర్ చేశారు. దాంతో ఈ ఇద్దరిని టీ20 ప్రపంచకప్ జట్టుతో పాటు సొంతగడ్డపై ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్‌లకు కూడా ఎంపిక చేయనున్నారు.

డెడ్‌లైన్ సెప్టెంబర్ 16..

డెడ్‌లైన్ సెప్టెంబర్ 16..

మరోవైపు టీ20 ప్రపంచకప్‌కు జట్టు ప్రకటించడానికి ఐసీసీ సెప్టెంబర్ 16 డెడ్‌లైన్‌గా విధించింది. దాంతో చేతన్ శర్మ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీ 16వ తేదినే ప్రపంచకప్ టీమ్ ఎంపిక చేస్తారని ప్రచారం జరిగింది. జస్‌ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్ గాయాల అప్‌డేట్ గురించి వేచి చూస్తున్నామని, ఆ రిపోర్ట్‌లు వచ్చిన వెంటనే జట్టును కూడా ప్రకటిస్తామని ఓ సెలెక్షన్ మెంబర్ తెలిపాడు.

ముహుర్తం ఫిక్స్..

ముహుర్తం ఫిక్స్..

అయితే ఇప్పుడు బుమ్రా, హర్షల్ పటేల్ ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన నేపథ్యంలో ఒక రోజు ముందుగానే అంటే సెప్టెంబర్ 15నే జట్టును ప్రకటించే అవకాశం ఉంది. ఇక ఆసియాకప్ బరిలోకి దిగిన భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్‌‌లు తమ స్థానాలను రిటైన్ చేసుకోనుండగా.. దారుణంగా విఫలమైన ఆవేశ్ ఖాన్‌పై వేటు పడనుంది. ఆసియాకప్ వైఫల్యం నేపథ్యంలో మహమ్మద్ షమీని కూడా జట్టులోకి తీసుకోవాలని సెలెక్టర్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొకాలి శస్త్ర చికిత్సతో రవీంద్ర జడేజా టీ20 ప్రపంచకప్ మొత్తానికి దూరం కాగా.. అతని స్థానంలో అక్షర్ పటేల్ అవకాశం అందుకోనున్నాడు.

భారత జట్టు(అంచనా)

భారత జట్టు(అంచనా)

రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, హార్దిక్ పాండ్యా, రిషభ్ పంత్, దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్/మహమ్మద్ షమీ, యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్/రవిచంద్రన్ అశ్విన్

Story first published: Sunday, September 11, 2022, 16:14 [IST]
Other articles published on Sep 11, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+