India T20 Squad WI Tour: కోహ్లీకి రెస్ట్ వెనుకు బీసీసీఐ కుట్ర! మండిపడుతున్న ఫ్యాన్స్!

న్యూఢిల్లీ: వెస్టిండీస్ పర్యటన నుంచి టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని తప్పించడాన్ని అభిమానులు తప్పుబడుతున్నారు. ఉద్దేశపూర్వకంగానే విరాట్ కోహ్లీని పక్కనపెట్టారని ఆరోపిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా బీసీసీఐపై దుమ్మెత్తిపోస్తున్నారు. కోహ్లీని పూర్తిగా జట్టు నుంచి తప్పించే కుట్ర కెప్టెన్ రోహిత్ శర్మ చేస్తున్నాడని మండిపడుతున్నారు. ఇప్పటికే కోహ్లీని వన్డే సిరీస్‌కు దూరం పెట్టిన బీసీసీఐ తాజాగా టీ20 జట్టులోకి తీసుకోలేదు. కోహ్లీతో పాటు బుమ్రాకు ఈ పర్యటన నుంచి రెస్ట్ ఇస్తున్నామని తెలిపింది. అయితే విరాట్ కోహ్లీ ఇలా విశ్రాంతి తీసుకోవడానికి ఏమాత్రం ఇష్టపడడని అభిమానులు ఆరోపిస్తున్నారు.
జట్టు నుంచి తప్పించే కుట్ర..
ఇటీవల పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న విరాట్ కోహ్లీ.. గజ్జలో గాయంతో ఇంగ్లండ్‌తో తొలి వన్డేకు దూరమయ్యాడు. రెండో వన్డే ఆడటంపై కూడా అనుమానాలు నెలకొన్నాయి. టెస్ట్ మ్యాచ్ అనంతరం తొలి టీ20 నుంచి విశ్రాంతి తీసుకున్న విరాట్.. గాయం కారణంగా వన్డేలకు దూరంగా ఉండి విశ్రాంతి తీసుకున్నాడు. అయినా అతనికి మళ్లీ విశ్రాంతినివ్వడం జట్టు నుంచి తప్పించే కుట్రేనని ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. రోహిత్ శర్మ సారథ్యంలో ఏ ఆటగాడి ప్లేస్‌కు సెక్యూర్ లేదని మండిపడుతున్నారు.
చేతికి 10 కుట్లు వేసుకొని..
'విరాట్ కోహ్లీ ఎట్టి పరిస్థితుల్లో విశ్రాంతి తీసుకోడు. అది అతని మనస్థత్వం కూడా కాదు. కానీ బీసీసీఐనే కావాలనే విశ్రాంతి ఇస్తుంది. బ్యాక్ టూ బ్యాక్ విరాట్ రెస్ట్ తీసుకుంటాడంటే ఎవరూ నమ్మరు. జట్టు నుంచి తప్పించేందుకు బీసీసీఐ ఇలా అతన్ని టార్చర్ చేస్తుంది. వెన్ను నొప్పి, గాయాలతో కూడా విరాట్ మ్యాచ్‌లు ఆడాడు. అతని తండ్రి మరణించినా మ్యాచ్ ఆడే ఇంటికి వెళ్లాడు. చేతికి 10 కుట్లు వేసుకొని సెంచరీ బాదిన సందర్భాన్ని ఎవరూ మరిచిపోరు'అని ఓ అభిమాని ట్వీట్ చేశాడు.
సంజూ శాంసన్ ఎక్కడా?
ఇక ఐర్లాండ్‌తో సత్తా చాటిన సంజూ శాంసన్‌కు ఎందుకు అవకాశం ఇవ్వరని మరికొంత మంది ఫ్యాన్స్ నిలదీస్తున్నారు. కోహ్లీ గైర్హాజరీలో సంజూను ఎంపిక చేయాల్సిందని అభిప్రాయపడుతున్నారు. శ్రేయస్ అయ్యర్ కంటే సంజూ గొప్ప బ్యాటరని కామెంట్ చేస్తున్నారు. ఇలా జట్టులోకి తీసుకోకుండా పక్కనపెట్టే బదులు అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించమని ఆదేశించాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ త్రిపాఠికి ఒక్క చాన్స్ అయినా ఇవ్వాల్సిందని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు.
ఉమ్రాన్ మాలిక్‌పై వేటు..
18 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను బీసీసీఐ వెల్లడిచింది. గాయంతో జట్టుకు దూరంగా ఉన్న కేఎల్ రాహుల్ ఈ జట్టులో చోటు దక్కించుకోగా.. వెటరన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ సైతం టీమిండియా పిలుపును అందుకున్నాడు. అయితే ఈ ఇద్దరు ఆడటం వారి ఫిట్‌నెస్‌పై ఆధారపడి ఉందని బీసీసీఐ స్పష్టం చేసింది. ఈ సిరీస్ సమయానికి వీరు తమ గాయాల నుంచి కోలుకొని పూర్తి స్థాయి ఫిట్‌నెస్ సాధిస్తేనే జట్టులోకి వస్తారని తెలిపింది. ఇంగ్లండ్ పర్యటనలో విఫలమైన ఐపీఎల్ సంచలనం, కశ్మీర్ ఎక్స్‌ప్రెస్ ఉమ్రాన్ మాలిక్‌పై వేటు పడింది. ఐర్లాండ్‌తో పాటు ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో ఉమ్రాన్ పేలవ ప్రదర్శన కనబర్చడంతో అతన్ని సెలెక్టర్లు పక్కనపెట్టారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications