Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత టీ20 జట్టులో గందరగోళం.. ఆరుగురు ఆటగాళ్లు దూరం! రింకూతో పాటు నలుగురు కొత్త ఆటగాళ్లకు అవకాశం!

జింబాబ్వేతో మూడు టీ20ల సిరీస్ కోసం భారత జట్టులో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. వికెట్ కీపర్ సంజూ శాంసన్‌తో పాటు ఆరుగురు ఆటగాళ్లు ఈ సిరీస్‌కు దూరం కాగా.. ఫినిషర్ రింకూ సింగ్‌తో సహా మరో ఆరుగురు ఆటగాళ్లకు జట్టులో చోటు దక్కింది. ఇందులో నలుగురు ఆటగాళ్లు తొలిసారి టీమిండియా పిలుపును అందుకోవడం గమనార్హం.

IND vs ZIM: వైభవ్, రింకూ రీఎంట్రీ.. జింబాబ్వేతో తలపడే భారత తుది జట్టు ఇదే!

IND vs ZIM: వైభవ్, రింకూ రీఎంట్రీ.. జింబాబ్వేతో తలపడే భారత తుది జట్టు ఇదే!

ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల్లో పేలవ ప్రదర్శన కనబర్చిన శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని భారత జట్టు.. జింబాబ్వేలో పర్యటిస్తోంది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ గురువారం హరారే స్టేడియంలో జరగనుంది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో భారత జట్టు 7 మ్యాచ్‌లు ఆడి ఒక్క విజయాన్ని అందుకోలేకపోయింది. దాంతో తొలి విజయాన్ని అందుకోవాలనే ఆతృతతో అయ్యర్ ఉన్నాడు.

India T20 Squad vs Zimbabwe Major Shake-Up Sees Six Players Dropped Returns for Rinku and Mayank

అజిత్ అగార్కర్ సారథ్యంలోని భారత సెలెక్షన్ కమిటీ.. ఇంగ్లండ్ పర్యటన నుంచే జట్టులో పలు మార్పులు చేసింది. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనకు దూరంగా ఉన్న రింకూ సింగ్‌ను తిరిగి జట్టులోకి తీసుకున్నారు. పేస్ సెన్సేషన్ మయాంక్ యాదవ్‌కు అవకాశం కల్పించారు. ఈ ఇద్దరితో పాటు ఐపీఎల్ పేసర్లు అశోక్ శర్మ, యశ్ ఠాకూర్, హర్ష్ దూబే, వికెట్ కీపర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌లకు అవకాశం కల్పించారు. ఈ నలుగురికి టీమిండియా పిలుపు దక్కడం ఇదే తొలిసారి.

IND vs ZIM టీ20 సిరీస్: జియోస్టార్, సోనీ టీవీలో రాదు.. ఎలా చూడాలంటే?

IND vs ZIM టీ20 సిరీస్: జియోస్టార్, సోనీ టీవీలో రాదు.. ఎలా చూడాలంటే?

మరోవైపు సంజూ శాంసన్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిధ్ కృష్ణ, హర్షిత్ రాణా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ సహా ఆరుగురు ఆటగాళ్లకు ఈ సిరీస్ నుంచి విశ్రాంతి కల్పించారు. గాయం కారణంగా వరుణ్ చక్రవర్తీ ఈ సిరీస్‌కు దూరం కాగా.. రవి బిష్ణోయ్‌ను ఎంపిక చేశారు.

భారత జట్టు: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, శివమ్ దూబే, హర్ష్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, యశ్ ఠాకూర్, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్, అశోక్ శర్మ, రవి బిష్ణోయ్, ప్రభ్‌సిమ్రన్ సింగ్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్.

Story first published: Thursday, July 23, 2026, 14:54 [IST]
Other articles published on Jul 23, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+