For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs SL: నో బుమ్రా.. కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా..శ్రీలంక పర్యటనకు ఎంపికైన భారత జట్టు ఇదే!

టీమిండియా శ్రీలంక పర్యటనతో నయా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తన బాధ్యతలను స్వీకరించనున్నాడు. ప్రస్తుతం జింబాబ్వే పర్యటనలో ఉన్న టీమిండియా..ఈ నెలాఖరులో శ్రీలంక టూర్‌కు వెళ్లనుంది. శ్రీలంక గడ్డపై టీమిండియా మూడు వన్డేలతో పాటు మూడు టీ20ల సిరీస్‌లు ఆడనుంది.

ఈ నెల 26 నుంచి 29 వరకు మూడు టీ20ల సిరీస్, ఆగస్ట్ 1 నుంచి 7 వరకు మూడు వన్డేల సిరీస్ జరగనుంది. జింబాబ్వే పర్యటనకు శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని ద్వితీయ శ్రేణి జట్టును పంపించిన బీసీసీఐ.. శ్రీలంక పర్యటనకు ఫస్ట్ ఛాయిస్ ఆటగాళ్లతో కూడిన జట్టు పంపించే అవకాశం ఉంది. ముఖ్యంగా గౌతమ్ గంభీర్.. తనకు కావాల్సిన జట్టునే తీసుకోనున్నాడు.

India T20 Squad for Sri Lanka Tour Hardik Pandya captain No Bumarah

ముందుగా టీ20 సిరీస్ జరుగుతుండటంతో టీమ్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని జట్టును ఎంపిక చేసే అవకాశం ఉంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలకగా.. హార్దిక్ పాండ్యా సారథిగా జట్టును నడిపించనున్నాడు. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాకు ఈ సిరీస్ నుంచి విశ్రాంతివ్వనున్నారు.

బ్యాటర్లు ఎవరంటే..?
ఈ సిరీస్‌కు టీమిండియా ముగ్గురు స్పెషలిస్ట్ ఓపెనర్లను ఎంపిక చేసే అవకాశం ఉంది. యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్‌తో పాటు అభిషేక్ శర్మకు చోటు దక్కనుంది. టీ20 స్పెషలిస్ట్ సూర్యకుమార్ యాదవ్ ఈ టోర్నీతోనే రీఎంట్రీ ఇవ్వనున్నాడు. రింకూ సింగ్ కూడా ఫినిషర్‌గా అవకాశం అందుకోనున్నాడు.

వికెట్ కీపర్లు‌గా పంత్, సంజూ..
టీమిండియా ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్ రీఎంట్రీ ఇవ్వనుండగా.. బ్యాకప్ వికెట్ కీపర్‌గా సంజూ శాంసన్ ఆడనున్నాడు. పేస్ ఆల్‌రౌండర్లుగా హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే కొనసాగనుండగా.. స్పిన్ ఆల్‌రౌండర్లు అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ బరిలోకి దిగనున్నారు. జడేజా రిటైర్మెంట్‌తో వాషింగ్టన్ సుందర్‌‌కు మార్గం సుగుమమైంది.

బుమ్రాకు రెస్ట్..
స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాకు రెస్ట్ ఇవ్వనున్న నేపథ్యంలో అర్ష్‌దీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్ పేస్ బాధ్యతలను మోయనున్నారు. ఆవేశ్ ఖాన్ మూడో పేసర్‌గా కొనసాగనుండగా.. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్ బరిలోకి దిగనున్నాడు. కుల్దీప్ యాదవ్‌ను టీ20 ఫార్మాట్‌కు దూరం పెడితే రవి బిష్ణోయ్‌కు అవకాశం దక్కుతుంది.

శ్రీలంకతో టీ20 సిరీస్‌ ఆడే భారత జట్టు ఇదే:

అభిషేక్ శర్మ, యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, సంజూ శాంసన్, రిషభ్ పంత్, రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, అర్ష్‌దీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్, ఆవేశ్ ఖాన్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్

Story first published: Thursday, July 11, 2024, 21:44 [IST]
Other articles published on Jul 11, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+