For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

10వ స్థానంలో తెలుగు టైటాన్స్.. ఇప్పటికైనా పుంజుకునేనా?

PKL 2019: Pro Kabaddi 2019 Points Table, Team Standings, Telugu Titans in 1oth position

హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ సీజన్‌-7లో ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన తెలుగు టైటాన్స్ పూర్తిగా నిరాశపరిచింది. స్టార్ రైడర్ రాహుల్ చౌదరి‌ని వదులుకుని.. కబడ్డీ 'బాహుబలి'గా పేరొందిన సిద్దార్థ్‌ దేశాయ్‌ని జట్టులోకి తీసుకున్నా టైటాన్స్ ఆటతీరు మాత్రం మారలేదు. తొలుత మ్యాచులు సొంత గడ్డపై జరిగినా ఒక్క దాంట్లో కూడా విజయం సాధించలేదు. ఆటగాళ్లు సమిష్టిగా రాణించడంలో విఫలమవడంతో టైటాన్స్ విజయాలను దూరం చేసుకుంటోంది. మరొకొన్ని మ్యాచులలో సరైన వ్యూహాలు రంచించలేక డ్రాలతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది.

ఇప్పటికైనా టైటాన్స్ పుంజుకుంటే:

ఇప్పటికైనా టైటాన్స్ పుంజుకుంటే:

తెలుగు టైటాన్స్ ఇప్పటి వరకూ 9 మ్యాచ్‌లు ఆడి కేవలం రెండు విజయాలు నమోదు చేసింది. ఐదు పరాజయాలు, రెండు డ్రాలతో పట్టికలో 10వ స్థానంలో ఉంది. ప్రస్తుతం టైటాన్స్ ఖాతాలో 18 పాయింట్లు ఉన్నాయి. జైపూర్ పింక్ పాంథర్స్ ఖాతాలో 31 పాయింట్లు ఉన్నాయి. టాప్-6లో చోటు దక్కించుకోవాలంటే టైటాన్స్ గట్టిగా పోరాడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా టైటాన్స్ పుంజుకుంటే ప్లేఆఫ్‌కి అర్హత సాధించొచ్చు. ఒక్క మ్యాచులో సత్తా చాటిన సిద్దార్థ్‌ దేశాయ్‌ చెలరేగాల్సిన సమయం ఆసన్నమైంది.

తొలి స్థానంలో జైపూర్:

తొలి స్థానంలో జైపూర్:

జులై 20న ఆరంభమైన సీజన్‌-7లో మొత్తం 12 జట్లు పోటీపడుతుంన్నాయి. ఇప్పటికే 50 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. దబాంగ్ ఢిల్లీ ఒక్క జట్టే 7 మ్యాచ్‌లు ఆడగా.. మిగతా అన్ని జట్లూ కనీసం ఎనమిది మ్యాచ్‌లు ఆడాయి. ఎనమిది మ్యాచ్‌లు ఆడిన జైపూర్ పింక్ పాంథర్స్ ఆరు విజయాలతో పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో కొనసాగుతోంది. దబాంగ్ ఢిల్లీ, బెంగాల్ వారియర్స్ రెండు మూడు స్థానాల్లో ఉన్నాయి. లీగ్ దశ ముగిసే సరికి టాప్-6లో నిలిచిన జట్లు ప్లేఆఫ్‌కి అర్హత సాధిస్తాయి.

సిద్దార్థ్ సూపర్-10:

సిద్దార్థ్ సూపర్-10:

సిద్ధార్థ్‌ దేశాయ్‌ ఈ సీజన్‌లో తొలిసారి స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడంతో ఆదివారం జరిగిన పోరులో తెలుగు టైటాన్స్‌ 40-29తో హరియాణా స్టీలర్స్‌ను చిత్తు చేసింది. సిద్దార్థ్‌ దేశాయ్‌ 18 రైడ్లలో 18 పాయింట్లు సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. మ్యాచ్ ఆరంభంలో ఇరు జట్లు పాయింట్ల కోసం పోటీ పడ్డాయి. అయితే సూరజ్, సిద్ధార్థ్‌ చెలరేగడంతో మొదటి 10 నిమిషాల తరువాత తెలుగు టైటాన్స్ 9-6 ఆధిక్యంలోకి వచ్చింది. టైటాన్స్‌ అదే జోరును కొనసాగిస్తూ.. తొలి అర్ధ భాగంలో 21-13తో ఆధిక్యంలోకి వెళ్ళింది. రెండవ సగం మొదటలో ఇరు జట్ల ఆటగాళ్లు పాయింట్లను సాధించారు. కానీ సిద్దార్థ్ చెలరేగి సూపర్ టెన్ సాధించడంతో హరియాణా ఓడిపోయింది.

Story first published: Wednesday, August 21, 2019, 12:48 [IST]
Other articles published on Aug 21, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+