For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ తెలుగు హీరో అంటే ఇష్టం: శివమ్ దూబే

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే తనకు ఇష్టమని టీమిండియా బ్యాటింగ్ ఆల్‌రౌండర్ శివమ్ దూబే తెలిపాడు. మహేష్ బాబు స్టైల్, స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుటుందని ఓ ర్యాపిడ్‌ ఫైర్ చిట్‌చాట్‌లో పేర్కొన్నాడు. మహేష్ బాబు సినిమాలు చూస్తానని చెప్పిన శివమ్ దూబే.. ఆయన 'చాలా క్లాస్, హ్యాండ్సమ్ హీరో' అని కొనియాడాడు.

ముంబైకి చెందిన శివమ్ దూబే సినిమాల గురించి చాలా తక్కువగా మాట్లాడుతాడు. ఐపీఎల్‌ ప్రమోషన్స్ కార్యక్రమంలో భాగంగా జరిగిన కొన్ని ర్యాపిడ్ ఫైర్ చిట్ చాట్స్‌లో సౌత్ హీరోలు, సినిమాలపై తనకు ఉన్న ఆసక్తిని వెల్లడించాడు.

మహేష్ బాబుతో పాటు అల్లు అర్జున్ అంటే కూడా తనకు ఇష్టమని చెప్పుకొచ్చాడు. అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా మూవీ పుష్ప తనకు బాగా నచ్చిందని తెలిపాడు. అల్లు అర్జున్ డ్యాన్స్ బాగుంటుందని కొనియాడాడు. బాహుబలి, 'పుష్ప' వంటి పాన్-ఇండియా సినిమాలు విడుదలైన సమయంలో వాటి విజయాలను అభినందిస్తూ శివమ్ దూబే ఎక్స్ వేదికగా పోస్ట్‌లు పెట్టాడు. ఖాళీ సమయాల్లో హిందీలోకి డబ్ అయిన తెలుగు చిత్రాలను చూస్తానని వెల్లడించాడు.

India Star All Rounder Shivam Dube Reveals His Favorite Telugu Hero
Photo Credit: Shivam Dube Instagram

అయితే సినిమాల గురించి మాట్లాడేందుకు శివమ్ దూబే పెద్దగా ఆసక్తికనబర్చాడు. ముఖ్యంగా 'కపిల్ శర్మ షో', ఆకాష్ చోప్రా 'ఆకాష్ వాణి' షోలో సినిమాల గురించి ప్రశ్నించినా.. తన వ్యక్తిగత జీవితం, క్రికెట్ గురించే ఎక్కువగా మాట్లాడాడు.

ప్రస్తుతం శివమ్ దూబే సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా నెదర్లాండ్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇతర బ్యాటర్లంతా తడబడిన వికెట్‌పై శివమ్ దూబే(31 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 66) విధ్వంసకర హాఫ్ సెంచరీతో జట్టుకు భారీ స్కోర్ అందించాడు. అనంతరం బౌలింగ్‌లో రెండు వికెట్లు తీసాడు. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లోనూ చివర్లో బ్యాటింగ్‌కు వచ్చి దూకుడైన షాట్స్ ఆడాడు. అలవోకగా సిక్సర్లు బాదుతున్న శివమ్ దూబే.. టీమిండియాకు కీలక ప్లేయర్‌గా మారాడు.

గుడ్డిగా ఊపి ఆడటం కంటే పరిస్థితులకు తగ్గట్లు బ్యాటింగ్ చేయడంపైనే ఫోకస్ పెడుతానని శివమ్ దూబే తెలిపాడు. ధోనీ సలహాలు, సూచనలతోనే తన బ్యాటింగ్ మెరుగైందని చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా షార్ట్ బాల్స్ ఎలా ఆడాలో ధోనీ నుంచే నేర్చుకున్నానని చెప్పాడు. వరుసగా 4 విజయాలతో సూపర్-8 చేరిన భారత్.. ఆదివారం సౌతాఫ్రికాతో అమీతుమీ తేల్చుకోనుంది.

Story first published: Friday, February 20, 2026, 7:55 [IST]
Other articles published on Feb 20, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+