For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అతనే నా ఫేవరేట్ తెలుగు హీరో: హార్దిక్ పాండ్యా

Hardik Pandya: టాలీవుడ్ టాప్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటే తనకు చాలా ఇష్టమని టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తెలిపాడు. అతను నటించిన పుష్ప సినిమా తనకు బాగా నచ్చిందని ఓ ర్యాపిడ్‌ ఫైర్ చిట్‌చాట్‌లో చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా 2022లో పుష్ప సినిమా విడుదలైనప్పుడు హార్దిక్ పాండ్యా తన నానమ్మతో కలిసి శ్రీవల్లి పాటలోని ఐకాన్ స్టెప్‌ను వేసాడు.

ఇందుకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నాడు. ఈ వీడియోకు 'మా పుష్ప నాని'అని క్యాప్షన్ ఇచ్చాడు. ఈ వీడియోను అల్లు అర్జున్‌కు కూడా ట్యాగ్ చేశాడు. హార్దిక్ వీడియోకు ఫిదా అయిన అల్లు అర్జున్.. 'చాలా క్యూట్‌గా ఉంది. మీ వీడియో పట్ల నాకు ఎనలేని ప్రేమ, గౌరవం కలిగింది. ఇది నా హృదయాన్ని హత్తుకుంది.'అని బదులిచ్చాడు.

పుష్పలో కృనాల్ పాండ్యా..?

పుష్ప-2 సినిమాపై కూడా అల్లు అర్జున్ ప్రశంసల జల్లు కురిపించాడు. అల్లు అర్జున్ నటన అద్భుతమని, అతని మాస్ స్వాగ్ తనను విపరీతంగా ఆకట్టుకుందని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఓ ఇంటర్వ్యూలో పుష్ప సినిమాలోని ఒక నెగటివ్ క్యారెక్టర్ తన సోదరుడు కృనాల్ పాండ్యాలానే ఉన్నాడని హార్దిక్ ఆటపట్టించాడు.

ఖాళీ సమయాల్లో హిందీలోకి డబ్ అయిన సౌత్ సినిమాలు చూస్తానని చెప్పిన హార్దిక్ పాండ్యా.. అందులోని హీరోల ఎనర్జీ తనకు బాగా నచ్చుతుందని తెలిపాడు. కేజీఎఫ్ హీరో యష్ యాటిట్యూడ్, స్క్రీన్ ప్రెజెన్స్ తనకు చాలా ఇష్టమని చెప్పాడు. RRR సినిమా 'నాటు నాటు' పాటకు ఆస్కార్ అవార్డ్ వచ్చినప్పుడు కూడా హార్దిక్ పాండ్యా సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. 'ప్రపంచం మొత్తం నాటు నాటు అని జపిస్తోంది. ఇది ఇండియన్ సినిమా సాధించిన విజయం.' అని హార్దిక్ కొనియాడాడు.

India Star All-Rounder Hardik Pandya Reveals His Favorite Telugu Hero

సూపర్ ఫామ్‌లో హార్దిక్ పాండ్యా..

హార్దిక్ పాండ్యా తన ఇంటర్వ్యూల్లో ఎక్కువగా ఫిట్‌నెస్, క్రికెట్ సంబంధించిన విషయాలను మాత్రమే మాట్లాడుతాడు. సినిమాలు, హీరోలు, హీరోయిన్ల గురించి అతి తక్కువగా ప్రస్తావిస్తారు. ర్యాపిడ్ ఫైర్‌లాంటి ఫన్ చిట్‌చాట్‌లోనే సినిమాలు, హీరోల గురించి కామెంట్స్ చేస్తాడు. సోషల్ మీడియా వేదికగా యాక్టివ్‌గా ఉండే హార్దిక్.. ప్రతీ విషయంపై చురుకుగా స్పందిస్తాడు. ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్న హార్దిక్ పాండ్యా.. బ్యాట్, బాల్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ దుమ్మురేపుతున్నాడు.

నమీబియాతో మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. మెగా టోర్నీకి ముందు ఆర్మీ తరహా ట్రైనింగ్ తీసుకున్నానని, దాంతోనే రాణించగలుగుతున్నానని హార్దిక్ చెప్పాడు. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లోనూ మెరుగైన ప్రదర్శన చేస్తానని వెల్లడించాడు. టీమిండియాకు హార్దిక్ పాండ్యా ఒక ఆస్తిలా మారాడు. అతను రాణిస్తే టీమిండియా సులువుగా విజయం సాధిస్తోంది. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లోనూ హార్దిక్ సత్తా చాటితే టీమిండియాకు తిరుగుండదు.

Story first published: Sunday, February 15, 2026, 10:08 [IST]
Other articles published on Feb 15, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+