India Squad T20 WC: రిషభ్ పంత్‌ను పక్కనపెట్టనున్న రోహిత్ శర్మ.. ఎందుకంటే..?

హైదరాబాద్: టీ20 ప్రపంచకప్ కోసం ముందుగానే ఆస్ట్రేలియా వెళ్లిన టీమిండియా టైటిలే లక్ష్యంగా సన్నదమవుతోంది. ఇప్పటికే వెస్టర్న్ ఆస్ట్రేలియాతో రెండు సన్నాహక మ్యాచ్‌లు ఆడింది. మరో రెండు వార్మప్ మ్యాచ్‌లు ఆడనుంది. పాకిస్థాన్‌తో అక్టోబర్ 23న జరగనున్న తొలి మ్యాచ్‌తో రోహిత్ సేన టైటిల్ వేటను ప్రారంభించనుంది. అయితే యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్.. టోర్నీ ఆసాంతం బెంచ్‌కే పరిమితవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటీవల ముగిసిన రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో రిషభ్ పంత్(9, 9) దారుణంగా విఫలమయ్యాడు. దాంతో టీమ్‌మేనేజ్‌మెంట్ నమ్మకాన్ని కోల్పోయాడు.

కార్తీక్ దంచికొడుతుండటంతో..
మరోవైపు దినేశ్ కార్తీక్ జట్టు ఫినిషర్‌గా దుమ్మురేపుతున్నాడు. చివర్లో బ్యాటింగ్‌కు వచ్చి జట్టుకు కావాల్సిన విలువైన పరుగులు చేస్తున్నాడు. దాంతో రిషభ్ పంత్ జట్టులోకి వచ్చే దారులు మూసుకుపోయాయి. జట్టులో ఎవరైనా గాయపడితే తప్పా.. అతను జట్టులోకి వచ్చే అవకాశాలు లేవు. పాకిస్థాన్‌తో జరిగే తొలి మ్యాచ్‌లో కూడా అతను ఆడే సూచనలు కనబడటం లేదు. సన్నాహక మ్యాచ్‌ల్లో దినేశ్ కార్తీక్ కూడా విఫలమయ్యాడు. కానీ ఫినిషర్‌గా జట్టు అతనిపై నమ్మకం ఉంచింది.

పంత్ సెట్ అవ్వడం లేదు..
ఈ ఏడాది దినేశ్ కార్తీక్ టీ20ల్లో 181 బంతులు ఆడి 273 పరుగులు చేశాడు. 19 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ గణంకాలు నమోదు చేశాడు. మరోవైపు రిషభ్ పంత్ 17 ఇన్నింగ్స్‌ల్లో 338 పరుగులు చేసినా.. జట్టుకు కావాల్సిన రోల్‌లో అతను సెట్ అవ్వడం లేదు. కార్తీక్ ఫినిషర్‌గా 150.82 స్టైక్ రేట్‌తో ఆడితే.. పంత్ నెంబర్ 5లో 136.84 స్ట్రైక్‌రేట్‌తో ఆడాడు. అయితే జట్టుకు కావాల్సింది ఇది కాకపోవడంతో పంత్‌ను పక్కనపెడుతోంది. చివర్లో బ్యాటింగ్‌కు వచ్చి ఆడిన తొలి బంతినే బౌండరీ తరలించే ఫినిషర్ జట్టుకు అవసరం.

టీమ్ కాంబినేషన్‌కు ఇబ్బందులు..
ఇక పంత్‌ను జట్టులోకి తీసుకుంటే టీమిండియా 5-6 స్థానల్లో ఆడే ఆల్‌రౌండర్‌ను పక్కనపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. పంత్ జట్టులోకి వస్తే.. అక్షర్ పటేల్, దీపక్ హుడా, అశ్విన్ వంటి ఆల్‌రౌండర్లు ఆడలేని పరిస్థితి. పంత్ కూడా టీ20ల్లో ఇప్పటి వరకు తన మార్క్‌ను చూపించలేదు. అయితే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో జరిగే వామప్ మ్యాచ్‌ల్లో ద్రవిడ్, రోహిత్ శర్మ.. తుది జట్టు ఎంపికపై ఓ నిర్ణయానికి రానున్నారు. ఈ మ్యాచ్‌ల్లో పంత్‌తో పాటు దినేశ్ కార్తీక్‌కు అవకాశం ఇవ్వనున్నాడు. ఈ సన్నాహక మ్యాచ్‌ల్లో పంత్ ఏమైనా అద్భుతాలు చేస్తే తప్పా.. అతను జట్టులోకి వచ్చే అవకాశాలు లేవు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications