For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India squad of World Cup 2023: తిలక్ వర్మతో పాటు ఆ ఇద్దరూ ఔట్!

హైదరాబాద్: వన్డే ప్రపంచకప్ బరిలో దిగే భారత జట్టును మరికొద్ది గంటల్లో ప్రకటించే అవకాశం ఉంది. అక్టోబర్ 5 నుంచి భారత్ వేదికగానే జరగనున్న ఈ మెగా టోర్నీ కోసం ఇప్పటికే కొన్ని దేశాలు తమ ప్రాథమిక జట్లను ప్రకటించాయి. వరల్డ్ కప్‌ బరిలోకి దిగే జట్లను ప్రకటించేందుకు ఐసీసీ విధించిన గడువు సోమవారంతో ముగియనుంది.

ఈ నేపథ్యంలోనే అజిత్ అగార్కర్ సారథ్యంలోని భారత సెలెక్షన్ కమిటీ ఇవాళే(ఆదివారం) జట్టు ప్రకటించే అవకాశం ఉందని జాతీయ మీడియా పేర్కొంది. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు హెడ్ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌‌తో అజిత్‌ అగార్కర్‌ ప్రత్యేకంగా చర్చించి 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటిస్తారని పీటీఐ పేర్కొంది.

India squad of World Cup 2023 finalised, KL Rahul in and Sanju Samson, Tilak Varma Out

ఇక ఆసియా కప్‌ కోసం ఎంపిక చేసిన జట్టునే దాదాపు కొనసాగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. జట్టు ప్రకటనపై బీసీసీఐ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఆసియాకప్ 2023 కోసం భారత సెలెక్షన్ కమిటీ 17 మంది సభ్యులతో కూడిన జట్టుతో పాటు ఓ రిజర్వ్ ప్లేయర్‌ను ఎంపిక చేసింది. కానీ ప్రపంచకప్‌కు ఐసీసీ రూల్స్ ప్రకారం 15 మందినే ప్రకటించాలి.

బ్యాకప్‌గా రిజర్వ్ ఆటగాళ్లను ఎంచుకోవచ్చు. ఆసియాకప్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు దూరమైన కేఎల్ రాహుల్.. ఎన్‌సీఏలో ఫిట్‌నెస్ టెస్ట్ పూర్తి చేసుకున్నట్లు బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. సూపర్-4లో అతను భారత్‌ తరఫున బరిలోకి దిగుతాడని తెలుస్తోంది. రాహుల్ రాకతో సంజూ శాంసన్‌కు ఉద్వాసన తప్పేలా లేదు.

తెలుగు తేజం తిలక్ వర్మతో పాటు ప్రసిధ్ కృష్టలను కూడా పక్కనపెట్టనున్నారు. ఈ ముగ్గురిని స్టాండ్ బై ప్లేయర్లుగా ఎంపిక చేసే అవకాశం ఉంది. వన్డేల్లో సూర్యకుమార్ యాదవ్‌కు గొప్ప ఫామ్‌ లేకపోయినప్పటికీ జట్టులో కొనసాగే అవకాశం ఉంది. ఎక్స్‌ట్రా స్పిన్నర్‌ను తీసుకోవాలని భావిస్తే చాహల్, అశ్విన్ పేర్లను పరిశీలించే అవకాశం ఉంది. అప్పుడు సూర్యను పక్కనపెట్టవచ్చు.

పేసర్లుగా జస్‌ప్రీత్ బుమ్రా, షమీ, సిరాజ్‌, శార్దూల్, హార్దిక్‌ పాండ్యా అవకాశం అందుకోనుండగా.. స్పెషలిస్ట్‌ స్పిన్నర్‌గా కుల్దీప్‌ యాదవ్‌ను తీసుకోవడం ఖాయం. స్పిన్‌ ఆల్‌రౌండర్లుగా రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ కొనసాగనున్నారు.

భారత ప్రపంచకప్ జట్టు (అంచనా):
రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్‌ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శుభ్‌మన్‌ గిల్, శ్రేయస్‌ అయ్యర్, సూర్యకుమార్‌ యాదవ్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్‌ యాదవ్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, మహమ్మద్‌ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా

Story first published: Sunday, September 3, 2023, 19:27 [IST]
Other articles published on Sep 3, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+