టీ20 ప్రపంచకప్ 2024 విజయానంతరం టీమిండియా.. జింబాబ్వే పర్యటనకు వెళ్లింది. ఈ సిరీస్ నుంచి ప్రపంచకప్ ఆడిన ఆటగాళ్లకు విశ్రాంతి కల్పించిన బీసీసీఐ ద్వితీయ శ్రేణి జట్టును ఎంపిక చేసింది. శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని కుర్రాళ్ల జట్టు జింబాబ్వేతో ఐదు టీ20ల సిరీస్ ఆడుతోంది.
ఇప్పటికే రెండు మ్యాచ్‌లు జరగ్గా.. ఇరు జట్లు చెరొక మ్యాచ్ గెలిచాయి. ఈ సిరీస్ అనంతరం టీమిండియా శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఈ నెల చివర్లో ప్రారంభం కానున్న శ్రీలంక పర్యటనలో టీమిండియా మూడేసి వన్డేలు, టీ20లు ఆడనుంది.

సన్నాహకాలు షురూ..
టీ20 సిరీస్‌కు ద్వితీయ శ్రేణితో కూడిన జట్టునే కొనసాగించనుండగా.. వన్డేలకు మాత్రం ప్రధాన జట్టును ఎంపిక చేయనున్నారు. వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఉన్న నేపథ్యంలో ఈ పర్యటన నుంచే టీమిండియా సన్నాహకాలు ప్రారంభించనుంది. కోత్త కోచ్ కూడా ఈ పర్యటన నుంచే తమ బాధ్యతలను చేపట్టనున్నాడు.
ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియాకు ఎక్కువగా వన్డే సిరీస్‌లు లేవు. ఈ క్రమంలోనే శ్రీలంకతో వన్డే సిరీస్‌కు ఫస్ట్ ఛాయిస్ ఆటగాళ్లంతా అందుబాటులో ఉండనున్నారు. వన్డే ప్రపంచకప్ 2023 తర్వాత టీమిండియా 50 ఓవర్ల ఫార్మాట్‌లో ఒక్క సిరీస్ కూడా ఆడలేదు. ఈ క్రమంలోనే శ్రీలంక పర్యటనకు ఎంపిక చేసే వన్డే జట్టుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
రోహిత్, కోహ్లీ రీఎంట్రీ..
కెప్టెన్ రోహిత్ శర్మ ఈ సిరీస్‌తోనే రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇప్పటికే ఛాంపియన్స్ ట్రోఫీ వరకు రోహిత్ శర్మనే కెప్టెన్‌గా కొనసాగుతాడని బీసీసీఐ స్పష్టం చేసింది. అతనికి జతగా శుభ్‌మన్ గిల్ ఓపెనర్‌గా ఆడనున్నాడు. విరాట్ కోహ్లీ ఫస్ట్ డౌన్‌లో బరిలోకి దిగనుండగా.. శ్రేయస్ అయ్యర్ నెంబర్ 4లో బ్యాటింగ్ చేయనున్నాడు.
రింకూ సింగ్ ఫినిషర్‌గా బరిలోకి దిగనున్నాడు. కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ వికెట్ కీపర్లుగా ఆడనున్నారు. రిషభ్ పంత్ కంటే రాహుల్‌కే తొలి ప్రాధాన్యత దక్కనుంది. వన్డే ఫార్మాట్‌లో రాహుల్ మిడిలార్డర్‌లో ఆడుతున్న విషయం తెలిసిందే.
బుమ్రాకు రెస్ట్..
రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా ఆల్‌రౌండర్లుగా బరిలోకి దిగనున్నారు. వన్డే ప్రపంచకప్ 2023 మధ్యలోనే గాయంతో తప్పుకున్న హార్దిక్ పాండ్యా.. మళ్లీ వన్డే ఫార్మాట్‌లో ఆడలేదు. వైస్ కెప్టెన్‌గా రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఒకవేళ రోహిత్ శర్మ రెస్ట్ తీసుకుంటే అతనే జట్టును నడిపించనున్నాడు.
అర్ష్‌దీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, ఆవేశ్ ఖాన్, మహమ్మద్ సిరాజ్‌లు పేసర్లుగా ఎంపికవ్వనున్నారు. వర్క్‌లోడ్ నేపథ్యంలో బుమ్రాకు ఈ సిరీస్ నుంచి విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది. కుల్దీప్ యాదవ్ స్పిన్ విభాగాన్ని లీడ్ చేయనున్నాడు.
శ్రీలంక పర్యటనకు వెళ్లే భారత జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రింకూ సింగ్, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా(వైస్ కెప్టెన్), అర్ష్‌దీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, ఆవేశ్ ఖాన్, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్.