Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs WI: టీమిండియా‌లో ఎలక్ట్రీషియన్‌ కొడుకు.. ఆ సమస్యకు చెక్!

హైదరాబాద్: టీమిండియాలో మన హైదరాబాద్ నుంచి మరో క్రికెటర్‌కు అవకాశం దక్కింది. కొన్నేళ్లుగా దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తూ.. ఐపీఎల్‌లో చెలరేగిపోతున్న యువప్లేయర్ ఠాకూర్ తిలక్ వర్మ‌ ప్రతిభకు గుర్తింపు లభించింది. వెస్టిండీస్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో పోటీ పడే భారత టీ20 జట్టుకు 20 ఏళ్ల తిలక్ వర్మ ఎంపికయ్యాడు.

అజిత్ అగార్కర్ సారథ్యంలోని ఆలిండియా సెలెక్షన్ కమిటీ బుధవారం హార్దిక్ పాండ్యా సారథ్యంలోని టీ20 జట్టును ప్రకటించింది. తిలక్ వర్మతో పాటు యశస్వీ జైస్వాల్‌కు తొలిసారి టీ20 పిలుపు అందింది. హైదరాబాద్‌లో అతి సాధారణ కుటుంబంలో పుట్టిన తిలక్ వర్మ ఒక్కో అడుగు వేస్తూ టీమిండియా ఆటగాడిగా ఎదిగాడు.

India squad for West Indies T20Is: Interesting Facts About Tilak Varma

11 ఏళ్ల వయసులో సరదాగా స్నేహితులతో టెన్నిస్ బాల్‌తో గల్లీ క్రికెట్ ఆడుతూ కోచ్ సలామ్ బయాష్‌కు కనబడటం అతని జీవితాన్నే మార్చేసింది. మంచి ఫుట్‌వర్క్‌తో బాల్‌ను పుల్ చేస్తున్న తిలక్‌లోని అసాధారణ ప్రతిభను గుర్తించిన బయాష్.. లింగంపల్లిలోని తన అకాడమీలో ఉచితంగా శిక్షణ ఇచ్చాడు.

ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్న తిలక్ తండ్రి ఒప్పుకోకపోయినా.. ఖర్చులన్నీ తానే బరిస్తానని సర్దిచెప్పి ట్రైనింగ్ ఇచ్చాడు. అతని ట్రైనింగ్‌లో రాటు దేలిన తిలక్ వర్మ హైదరాబాద్‌ అండర్ 14 టీమ్‌లో చోటు దక్కించుకొని సత్తా చాటాడు. మరో ఏడాదికే అండర్-16లోకి వచ్చిన అతను వరుస సెంచరీలతో భారత అండర్ 19 టీమ్‌కు ఎంపికయ్యాడు.

2019 అండర్ 19 ప్రపంచకప్‌లో పేలవ ప్రదర్శన కనబర్చడంతో అతనికి ఆ ఏడాది ఐపీఎల్‌లో ఆడే అవకాశం దక్కలేదు. అనంతరం మరింత కష్టపడిన తిలక్ వర్మ 2021 విజయ్ హజారే ట్రోఫీలో రెండు సెంచరీలతో పాటు 91 యావరేజ్‌తో పరుగులు చేశాడు. ఈ ప్రదర్శన అనంతరం ఐపీఎల్ 2022 సీజన్‌ మెగా వేలానికి రూ.20 లక్షల బేసిక్ ప్రైజ్‌తో వేలానికి వచ్చిన అతని కోసం ఫ్రాంఛైజీలు తీవ్రంగా పోటీ పడ్డాయి.

India squad for West Indies T20Is: Interesting Facts About Tilak Varma

ముంబై ఇండియన్స్ తిలక్‌ను రూ.1.7 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. ఆ క్షణం నుంచి తిలక్ వర్మ జీవితమే మారిపోయింది. తన రెండో ఐపీఎల్‌ మ్యాచ్‌లోనే రాజస్థాన్‌పై తిలక్ వర్మ 33 బంతుల్లోనే 61 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. ఆ సీజన్లో 14 మ్యాచ్‌లాడి 36.09 సగటుతో 303 పరుగులు చేసి ముంబై తరఫున సెకండ్ హయ్యెస్ట్ స్కోరర్‌గా నిలిచాడు.

అదే జోరును ఈ సీజన్‌లో కొనసాగించాడు. 11 మ్యాచ్‌ల్లో 42.87 సగటుతో 343 పరుగులు సాధించాడు. ఆర్‌సీబీతో తొలి మ్యాచ్‌లో కీలక ఆటగాళ్లు విఫలమైన వేళ (46 బంతుల్లో 84 నాటౌట్‌) అసాధారణ ఇన్నింగ్స్‌తో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. మిడిలార్డర్లో ఆడుతూ కూడా మరోసారి ముంబై తరఫున టాప్‌-3 స్కోరర్‌గా నిలిచాడు.

వికెట్‌కు విలువనిస్తూ ఓపిగ్గా క్రీజులో నిలవడమే కాకుండా.. అవసరమైనపుడు భారీ షాట్లతో విరుచుకుపడే నైపుణ్యమూ తిలక్‌లో ఉంది. అంతేకాకుండా టీమిండియాలో ఎడమచేతి వాటం బ్యాటర్లు తగ్గిపోతున్న సమయంలో తిలక్‌ రూపంలో ఆ సమస్యకు పరిష్కారం లభించనుంది. అంతర్జాతీయ క్రికెట్‌లోనూ నిలకడగా రాణిస్తే తిలక్ వర్మ మూడు ఫార్మాట్ల ఆటగాడిగా ఎదిగే అవకాశం ఉంది.

Story first published: Thursday, July 6, 2023, 8:20 [IST]
Other articles published on Jul 6, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+