Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రిషభ్ పంత్ ఇన్.. ఆ ఇద్దరు ఔట్! శ్రీలంకతో టెస్ట్‌ సిరీస్‌కు భారత జట్టు ఇదే!

జింబాబ్వే పర్యటన అనంతరం భారత జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2027లో భాగంగా శ్రీలంకతో రెండు టెస్ట్‌ల సిరీస్ ఆడనుంది. ఆగస్ట్ 15 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. గతేడాది నవంబర్‌లో సొంతగడ్డపై సౌతాఫ్రికాతో జరిగిన రెండు టెస్ట్‌ల సిరీస్‌లో టీమిండియా 0-2తో క్లీన్ స్వీప్ అయ్యింది. గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత టెస్ట్‌ల్లో టీమిండియా పేలవ ప్రదర్శన కనబరుస్తోంది.

మా అమ్మ కోసం A మార్క్.. రింకూ సింగ్‌ కోసం ఆ సెలెబ్రేషన్: వైభవ్ సూర్యవంశీ

మా అమ్మ కోసం A మార్క్.. రింకూ సింగ్‌ కోసం ఆ సెలెబ్రేషన్: వైభవ్ సూర్యవంశీ

ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్స్‌ టేబుల్‌లో ఐదో స్థానంలో ఉన్న టీమిండియా ఫైనల్ చేరాలంటే తమ తదుపరి 9 టెస్ట్‌ల్లో ఏడు గెలవాలి. శ్రీలంకతో రెండు, న్యూజిలాండ్‌‌తో రెండు, ఆస్ట్రేలియాతో సొంతగడ్డపై టీమిండియా ఐదు టెస్ట్‌లు ఆడాల్సి ఉంది.

India Squad For Test Series vs Sri Lanka Bumrah Jadeja Return Rishabh Pant In Uncapped Duo Out

బుమ్రా, జడేజా రీఎంట్రీ..

శ్రీలంకపై విజయం సాధిస్తేనే టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు సజీవంగా ఉండనున్నాయి. శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు ఇంకా జట్టును ప్రకటించలేదు. ఐపీఎల్ 2026 సీజన్ అనంతరం అఫ్గానిస్థాన్‌తో టీమిండియా ఏకైక టెస్ట్ మ్యాచ్ ఆడింది. కానీ ఇది డబ్ల్యూటీసీలో భాగం కాదు. ఈ మ్యాచ్‌కు దూరంగా ఉన్న జస్‌ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా శ్రీలంక పర్యటనతో రీఎంట్రీ ఇవ్వనున్నారు. దాంతో గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబేలు ఉద్వాసనకు గురవ్వనున్నారు.

నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ గాయాలతో ఇబ్బంది పడుతుండటం సెలెక్టర్లకు తలనొప్పిగా మారింది. సరైన టీమ్ కాంబినేషన్‌కు ఈ ఇద్దరూ కీలకం. ఒకవేళ నితీష్ రెడ్డి ఈ సిరీస్‌కు దూరమైతే టీమిండియా స్పెషలిస్ట్ బ్యాటర్‌ను తీసుకునే అవకాశం ఉంది. రుతురాజ్ గైక్వాడ్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌లో ఒకరికి అవకాశం దక్కుతుంది.

శ్రీలంకతో టెస్ట్ సిరీస్.. బుమ్రా, జడేజా రీఎంట్రీ! సుందర్, నితీష్ రెడ్డి డౌట్!

శ్రీలంకతో టెస్ట్ సిరీస్.. బుమ్రా, జడేజా రీఎంట్రీ! సుందర్, నితీష్ రెడ్డి డౌట్!

రిషభ్ పంత్ రీఎంట్రీ..

సుందర్ దూరమైతే హర్ష్ దూబేకు చోటు దక్కుతుంది. జడేజా, మానవ్ సుతార్‌తో పాటు హర్ష్ దూబే స్పిన్ బాధ్యతలు పంచుకుంటారు. ఆఫ్ స్పిన్నర్ కావాలనుకుంటే 33 ఏళ్ల సరాన్ష్ జైన్‌‌కు అవకాశం దక్కుతుంది. ఇటీవల శ్రీలంక-ఏతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో భారత్-ఏ తరఫున సరాన్ష్ జైన్ ఆడాడు. మధ్యప్రదేశ్‌కు చెందిన సరాన్ష్ జైన్‌కు ఇప్పటి వరకు టీమిండియా పిలుపు దక్కలేదు.

నెంబర్ 3 బ్యాటర్‌గా సాయి సుదర్శన్‌ తన స్థానాన్ని నిలబెట్టుకోనుండుగా.. దేవదత్ పడిక్కల్ అతనికి బ్యాకప్‌గా అవకాశం అందుకోనున్నాడు. మహమ్మద్ సిరాజ్ రీఎంట్రీ ఇవ్వనుండగా.. ప్రసిధ్ కృష్ణను జట్టులో కొనసాగించనున్నారు. ఈ ఇద్దరూ బుమ్రాతో కలిసి పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్‌లు ఓపెనర్లుగా ఎంపికవ్వనుండగా.. రిషభ్ పంత్ తిరిగి రానున్నాడు. ధ్రువ్ జురెల్‌ను అతనికి బ్యాకప్‌ వికెట్ కీపర్‌గా ఎంపిక చేయనున్నారు. ఈ జట్టును అధికారికంగా భారత సెలెక్షన్ కమిటీ మరో 24 గంటల్లోపు ఎప్పుడైనా ప్రకటించే అవకాశం ఉంది.

శ్రీలంక పర్యటనకు ఎంపికయ్యే భారత జట్టు(అంచనా)

శుభ్‌మన్ గిల్(కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేల్ రాహుల్, సాయి సుదర్శన్, రిషభ్ పంత్, దేవదత్ పడిక్కల్, నితీష్ కుమార్ రెడ్డి/రుతురాజ్ గైక్వాడ్/సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్/హర్ష్ దూబే/సరాన్ష్ జైన్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, మానవ్ సుతార్, ధ్రువ్ జురెల్(కీపర్).

Story first published: Saturday, July 25, 2026, 11:01 [IST]
Other articles published on Jul 25, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+