For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs ENG: జైస్వాల్ ఔట్.. సంజూ ఇన్! ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ ఆడే భారత జట్టు ఇదే!

ఆస్ట్రేలియా పర్యటనను ఘోర పరాజయంతో ముగించిన టీమిండియా.. పరిమిత ఓవర్లకు సిద్దమవుతోంది. సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌తో పాటు మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ముందుగా ఇంగ్లండ్‌తో ఐదు టీ20ల సిరీస్ జనవరి 22 నుంచి ప్రారంభం కానుంది.

భారత్ వర్సెస్ ఇంగ్లండ్ మధ్య తొలి టీ20 కోల్‌కతా వేదికగా జనవరి 22న జరగనుండగా.. రెండో టీ20 చెన్నై వేదికగా జనవరి 25, మూడో టీ20 రాజ్‌కోట్ వేదికగా జనవరి 28న, నాలుగో టీ20 పుణే వేదికగా జనవరి 31న, ఐదో టీ20 ఫిబ్రవరి 2న ముంబై వేదికగా జరగనుంది. టీ20 మ్యాచ్‌లన్నీ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానున్నాయి.

India Squad for T20I Series vs England Jasprit Bumrah rested Yashasvi Jaiswal OUT

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. వెన్ను నొప్పితో బాధపడుతున్న జస్‌ప్రీత్ బుమ్రా ఈ పరిమిత ఓవర్ల సిరీస్‌లకు దూరంగా ఉండనున్నాడు. అతను నేరుగా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 బరిలోకి దిగనున్నాడు.

టీమిండియా టీ20 సారథిగా సూర్యకుమార్ యాదవ్ వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అతని సారథ్యంలోని యంగ్ ఇండియానే టీ20ల్లో ఇంగ్లండ్‌తో తలపడనుంది. ఈ సిరీస్‌లో తలపడే భారత జట్టును సెలెక్టర్లు ఇంకా ప్రకటించలేదు. జనవరి 12నే ఇంగ్లండ్‌తో టీ20, వన్డేల సిరీస్‌లతో పాటు ఛాంపియన్స్ ట్రోఫీ బరిలోకి దిగే జట్లను ప్రకటించే అవకాశం ఉంది.

సీనియర్ గైర్హాజరీ నేపథ్యంలో కుర్రాళ్లకు చోటు దక్కే ఛాన్స్ ఉంది. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన ఆటగాళ్లలో చాలా మందికి ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌ నుంచి విశ్రాంతి కల్పించే ఛాన్స్ ఉంది. మహమ్మద్ సిరాజ్, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రిషభ్ పంత్‌లకు రెస్ట్ ఇవ్వనున్నారు.

గత టీ20 సిరీస్‌ల్లో సత్తా చాటిన రుతురాజ్ గైక్వాడ్, సంజూ శాంసన్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, అభిషేక్ శర్మ, రింకూ సింగ్ రీఎంట్రీ ఇవ్వనున్నారు. స్పిన్ ఆల్‌రౌండర్లు అక్షర్ పటేల్, రమణ్‌దీప్ సింగ్ ఎంపికవ్వనుండగా.. వాషింగ్టన్ సుందర్‌కు టీ20 సిరీస్‌ నుంచి విశ్రాంతి కల్పించే ఛాన్స్ ఉంది. రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తీ తమ స్థానాలను నిలబెట్టుకోనున్నారు. బ్యాకప్ వికెట్ కీపర్‌గా జితీష్ శర్మకు అవకాశం దక్కనుంది. పేస్ బౌలర్లుగా అర్ష్‌దీప్ సింగ్, ప్రసిధ్ కృష్ణ, యశ్ దయాల్, హర్షిత్ రాణాలకు అవకాశం దక్కనుంది.

ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌ ఆడే భారత జట్టు(అంచనా)
సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, సంజూ శాంసన్, తిలక్ వర్మ, రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తీ, జితేశ్ శర్మ(కీపర్), ప్రసిధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్, యశ్ దయాల్, రమణ్‌దీప్ సింగ్, అభిషేక్ శర్మ, హర్షిత్ రాణా.

Story first published: Wednesday, January 8, 2025, 7:02 [IST]
Other articles published on Jan 8, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+