ఓవైపు ఐపీఎల్ 2024 సీజన్ రసవత్తరంగా సాగుతుండగా.. మరోవైపు టీ20 ప్రపంచకప్ 2024 బరిలో నిలిచే భారత జట్టును ఎంపిక చేయడంపై బీసీసీఐ ఫోకస్ పెట్టింది. మరో వారం రోజుల్లో భారత టీ20 ప్రపంచకప్ జట్టును ప్రకటించే అవకాశం ఉంది. ప్రపంచకప్ ఎంపిక చేసే జట్టులో ఏడుగురు స్పెషలిస్ట్ బ్యాటర్లకు అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలతో కూడా పవర్‌ఫుల్ బ్యాటింగ్‌లైనప్‌ను ఎంపిక చేయనుంది. టాపార్డర్‌లో పూర్తిగా స్పెషలిస్ట్ బ్యాటర్లనే ఆడించనుంది. డౌన్ ద ఆర్డర్ స్పెషలిస్ట్ ఫినిషర్‌లను తీసుకోనుంది.

రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్, యశస్వి జైస్వాల్, శివమ్ దూబేలను స్పెషలిస్ట్ బ్యాటర్లుగా ఎంపిక చేయనుంది. రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్ ఓపెనర్లుగా పరిగణించనుండగా.. విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్‌లను మిడిలార్డర్ బ్యాటర్లుగా తీసుకోనున్నారు. శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మలకు మరోసారి నిరాశే ఎదురుకానుంది.
వికెట్ కీపర్లుగా రిషభ్ పంత్‌తో పాటు సంజూ శాంసన్ ఎంపికయ్యే అవకాశాలున్నాయి. పేస్ ఆల్‌రౌండర్‌గా హార్దిక్ పాండ్యా.. స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్‌ను తీసుకునే ఛాన్స్ ఉంది. పేసర్లుగా జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్‌లతో పాటు ముఖేష్ కుమార్‌లను ఎంపిక చేయవచ్చు.
అగ్రరాజ్యం అమెరికాతో పాటు వెస్టిండీస్ వేదికగా టీ20 ప్రపంచకప్ జరగనుంది. జూన్ 1 నుంచి 18 వరకు గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. నాలుగు గ్రూప్‌ల్లో టాప్-2లో నిలిచిన జట్లు సూపర్-8కు అర్హత సాధిస్తాయి. జూన్ 19 నుంచి 24 వరకు సూపర్ 8 మ్యాచ్‌లు జరగుతాయి. టాప్-4లో నిలిచిన జట్లు జూన్ 26(గయానా), 27(ట్రినిడాడ్) తేదిల్లో సెమీఫైనల్ మ్యాచ్‌లు ఆడుతాయి. జూన్ 29న బార్బోడస్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
భారత్ తమ తొలి మ్యాచ్‌ను జూన్ 5న ఐర్లాండ్‌తో న్యూయార్క్ వేదికగా ఆడనుంది. జూన్ 9న దాయాదీ పాకిస్థాన్‌తోనే న్యూయార్క్ వేదికగా భారత్ అమీతుమీ తేల్చుకోనుంది.
భారత టీ20 ప్రపంచకప్ జట్టు: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్, యశస్వి జైస్వాల్, శివమ్ దూబే, రిషభ్ పంత్, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్