టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. సింపుల్‌గా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా బుధవారం తన నిర్ణయాన్ని వెల్లడించాడు. వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతానని తెలిపాడు. రోహిత్ శర్మ ఆకస్మిక నిర్ణయంతో టీమిండియా తదుపరి టెస్ట్ కెప్టెన్ ఎవరా? అనే చర్చ జోరుగా సాగుతోంది. ఐపీఎల్ 2025 సీజన్ అనంతరం టీమిండియా ఐదు టెస్ట్‌ల సిరీస్ కోసం ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. డబ్ల్యూటీసీ 2025-27 సైకిల్ ఈ సిరీస్‌తోనే ప్రారంభం కానుంది.
ఈ క్రమంలోనే ఈ సిరీస్‌కు ప్రాధాన్యత ఏర్పడింది. అంతేకాకుండా ఇటీవల టెస్ట్ ఫార్మాట్‌లో టీమిండియా ఘోర పరాజయాలను చవిచూసింది. సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో మూడు టెస్ట్‌ల సిరీస్‌లో క్లీన్ స్వీప్ అయిన టీమిండియా.. ఆస్ట్రేలియా గడ్డపై 1-3తో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కోల్పోయింది. ఈ వైఫల్యంతో డబ్ల్యూటీసీ 2025 ఫైనల్ బెర్త్‌ను దక్కించుకోలేకపోయింది. ఈ వరుస వైఫల్యాల నేపథ్యంలోనే భారత సెలెక్టర్లు టెస్ట్ ఫార్మాట్‌లో కొత్త జట్టును తయారు చేయడంపై ఫోకస్ పెట్టారు.

వారం రోజుల్లో జట్టు ప్రకటన..?
ఓవైపు ఐపీఎల్ 2025 సీజన్ జరుగుతుండగానే మరోవైపు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే భారత జట్టును ఎంపిక చేయడంపై సెలెక్టర్లు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. తమ ప్రణాళికలను రోహిత్ శర్మకు స్పష్టంగా తెలియజేయడంతోనే అతను రిటైర్మెంట్ ప్రకటించినట్లు అర్థమవుతోంది. మరో వారం రోజుల్లో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే భారత టెస్ట్ జట్టును ప్రకటించే అవకాశం ఉంది.
కెప్టెన్‌గా కేఎల్ రాహుల్..?
టీమిండియా టెస్ట్ కెప్టెన్సీ రేసులో శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్‌తో పాటు జస్‌ప్రీత్ బుమ్రా పేర్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బుమ్రా.. టీమిండియా టెస్ట్ వైస్ కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. కానీ గాయాల బెడద, వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా అతన్ని లీడర్‌షిప్ గ్రూప్ నుంచి తప్పించే యోచనలో సెలెక్టర్లు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అంతేకాకుండా ఇంగ్లండ్ పర్యటనలో బుమ్రా ఐదు మ్యాచ్‌లకు ఐదు ఆడలేని పరిస్థితి. వర్క్‌లోడ్‌లో భాగంగా అతను రెండు టెస్ట్‌ల వరకు దూరమయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్‌లో ఒకరి టెస్ట్ కెప్టెన్సీ దక్కవచ్చు. అనుభవానికి ప్రాధాన్యత ఇస్తే కేఎల్ రాహుల్‌కు టెస్ట్ కెప్టెన్సీ దక్కుతుంది. అలా కాకుండా భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుంటే శుభ్‌మన్ గిల్‌కు సారథ్య బాధ్యతలు దక్కుతాయి.
సాయి సుదర్శన్‌కు ఛాన్స్
ఓపెనర్‌గా రోహిత్ శర్మ స్థానంలో సాయి సుదర్శన్ భారత జట్టులోకి రావచ్చు. అతనితో పాటు యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్, నితీష్ కుమార్ రెడ్డి, ధ్రువ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్‌లు బ్యాటర్లుగా అవకాశం అందుకోనున్నారు. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్ ఆడనుండగా.. స్పిన్ ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్‌కు అవకాశం దక్కవచ్చు. పేసర్లుగా జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్‌తో పాటు హర్షిత్ రాణా ఎంపికవచ్చు. జూన్ 20 నుంచి భారత్-ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. 2007 తర్వాత భారత్ ఇప్పటి వరకు ఇంగ్లండ్ గడ్డపై టెస్ట్ సిరీస్ గెలవలేదు.
ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే భారత జట్టు ఇదే
కేఎల్ రాహుల్(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, ధ్రువ్ జురెల్, నితీష్ కుమార్ రెడ్డి, సాయి సుదర్శన్, రవీంద్ర జడేజా, రిషభ్ పంత్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, సర్ఫరాజ్ ఖాన్.