Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాతో బరిలోకి దిగే టీమిండియా ఇదే.. షమీ ఇన్ హార్దిక్ ఔట్!

India squad for Australia, South Africa series: Shami, Deepak Chahar find a place

న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్ 2022 బరిలోకి దిగే భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ.. ఈ మెగా టోర్నీకి ముందు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్‌ల్లో ఆడే జట్లను కూడా ఎంపిక చేసింది. రెండు మార్పులు మినహా ప్రపంచకప్ జట్టునే ఈ సిరీస్‌లకు కొనసాగించింది. చేతన్ శర్మ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీ సోమవారం 16 మంది సభ్యులతో కూడిన జట్ల వివరాలను వెల్లడించింది.

ఆస్ట్రేలియాతో సెప్టెంబర్‌ 20 నుంచి స్వదేశంలో జరగబోయే ఈ సిరీస్‌కు అర్ష్‌దీప్‌ మినహా అదే జట్టు. కెప్టెన్‌గా రోహిత్‌, వైస్‌ కెప్టెన్‌గా కేఎల్‌ రాహుల్‌ వ్యవహరించనున్నారు. చాలా రోజుల తర్వాత టీ20 జట్టులోకి మహ్మద్ షమీ ఎంపికవగా.. దీపక్ చాహర్‌కి కూడా చోటిచ్చారు. ఇక గాయం నుంచి కోలుకున్న జస్‌ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్‌కి కూడా టీ20 వరల్డ్‌కప్ ముంగిట ఈ సిరీస్‌ ప్రాక్టీస్‌గా ఉపయోగపడనుంది. షమీ, చాహర్‌ని మాత్రం టీ20 వరల్డ్‌కప్‌కి స్టాండ్ బై ప్లేయర్లుగా సెలెక్టర్లు ఎంపికచేశారు. బుమ్రా, హర్షల్‌కి మాత్రం టీ20 వరల్డ్‌కప్ రెగ్యులర్ టీమ్‌లో చోటు దక్కింది. అలానే టీ20 వరల్డ్‌కప్ జట్టులోకి ఎంపికైన అర్షదీప్ సింగ్‌కి ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ నుంచి సెలెక్టర్లు రెస్ట్ ఇచ్చారు.

ఆస్ట్రేలియా‌తో బరిలోకి దిగే భారత జట్టు:

రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌ (వైస్‌ కెప్టెన్‌), విరాట్‌ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్‌, దీపక్‌ హుడా, రిషభ్‌ పంత్‌ (కీపర్‌), దినేశ్‌ కార్తీక్‌ (కీపర్‌), హార్దిక్‌ పాండ్య, అశ్విన్‌, చాహల్‌, అక్షర్‌ పటేల్‌, భువనేశ్వర్‌ కుమార్‌, మహమ్మద్‌ షమి, హర్షల్‌ పటేల్‌, దీపక్‌ చాహర్‌, బుమ్రా

సెప్టెంబర్‌ 28 నుంచి దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్‌కు ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య, పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ అందుబాటులో ఉంటడం లేదని బీసీసీఐ తెలిపింది.

దక్షిణాఫ్రికాతో బరిలో దిగే భారత జట్టు..

రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌ (వైస్‌ కెప్టెన్‌), విరాట్‌ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్‌, దీపక్‌ హుడా, రిషభ్‌ పంత్‌ (కీపర్‌), దినేశ్‌ కార్తీక్‌ (కీపర్‌), అశ్విన్‌, చాహల్‌, అక్షర్‌ పటేల్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, మహమ్మద్‌ షమి, హర్షల్‌ పటేల్, దీపక్‌ చాహర్, బుమ్రా

Story first published: Monday, September 12, 2022, 21:57 [IST]
Other articles published on Sep 12, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+