Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AFG: అఫ్గాన్‌తో టీ20 సిరీస్.. హార్దిక్, నితీష్ రెడ్డి రీఎంట్రీ! ఆ RCB ఆల్‌‌రౌండర్‌కు చోటు!

శ్రీలంకతో టెస్ట్‌ సిరీస్‌ గెలిచిన భారత్.. మళ్లీ వైట్ బాల్ ఫార్మాట్‌కు సిద్దమైంది. సొంతగడ్డపై సెప్టెంబర్ 13 నుంచి ప్రారంభమయ్యే మూడు టీ20ల సిరీస్‌లో ఆతిథ్య అఫ్గానిస్థాన్‌తో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది. ఈ సిరీస్‌ ఆడే భారత జట్టును బీసీసీఐ ఇంకా ప్రకటించలేదు. అజిత్ అగార్కర్ సారథ్యంలో సెలెక్షన్ కమిటీ.. టీమ్ ఎంపికపై ఫోకస్ పెట్టింది. మరో రెండు రోజుల్లో జట్టును ప్రకటించే అవకాశం ఉంది.

టెస్ట్‌ల్లోనూ వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. 7 సిక్స్‌లతో వీరవిహారం!

టెస్ట్‌ల్లోనూ వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. 7 సిక్స్‌లతో వీరవిహారం!

గాయాలతో జట్టుకు దూరమైన హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి ఈ సిరీస్‌తో రీఎంట్రీ ఇచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఇద్దరూ బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్(సీఓఈ)లో ఉన్న సంగతి తెలిసిందే. వాషింగ్టన్ సుందర్ సీవోఈలో ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవాల్సి ఉంది. ప్రస్తుతం అతను చెన్నైలో విశ్రాంతి తీసుకుంటున్నాడు.

India Squad for Afghanistan T20I Series 2026 Hardik Pandya and Nitish Reddy Return Krunal Pandya Recalled

బుమ్రాకు రెస్ట్..

మరోవైపు జస్‌ప్రీత్ బుమ్రా పూర్తిగా కోలుకున్నా.. అతని విషయంలో టీమ్‌మేనేజ్‌మెంట్ ఆచితూచి వ్యవహరిస్తోంది. భవిష్యత్తులో కీలక టెస్ట్ టెస్ట్‌ సిరీస్‌లు ఉన్న నేపథ్యంలో అఫ్గాన్‌తో టీ20 సిరీస్‌కు బుమ్రాను దూరంగా ఉంచే అవకాశాలు ఉన్నాయి.

'అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్ కోసం జట్టు ఎంపికపై సెలెక్షన్ కమిటీ ఫోకస్ పెట్టింది. గాయాల నుంచి కోలుకొని ఫిట్‌నెస్ సాధించే ఆటగాళ్లను పరిగణనలోకి తీసుకుంటారు. నితీష్ కుమార్ రెడ్డి, హార్దిక్ పాండ్యా చాలా రోజుల నుంచి సీఓఈలో రిహాబిలిటేషన్ తీసుకుంటున్నారు. వ్యక్తిగత కమిట్‌మెంట్స్ కోసం అప్పుడప్పుడు బయటకు వెళ్లినా ఎక్కువ సమయం సీఓఈలోనే గడిపారు. హార్దిక్ పాండ్యా అయితే బెంగళూరులోనే స్థిరపడ్డాడు. సుందర్ కూడా ఫిట్‌నెస్ నిరూపించుకుంటే సెలెక్షన్స్‌కు అందుబాటులోకి వస్తాడు.'అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.

కృనాల్ పాండ్యా పునరాగమనం..

మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా పేరును కూడా సెలెక్టర్లు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. బ్యాటింగ్ సామర్థ్యంతో పాటు టీ20 ఫార్మాట్‌కు తగ్గట్లు బౌలింగ్ చేసే కృనాల్‌ను టీమిండియాలోకి తీసుకోవాలని సెలెక్టర్లు భావిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ తన స్థానాన్ని నిలబెట్టుకోనున్నాడు.

Vaibhav Sooryavanshi: బుడ్డోడా మజాకా.. 57 ఏళ్ల రికార్డ్ బద్దలు!

Also Read

Vaibhav Sooryavanshi: బుడ్డోడా మజాకా.. 57 ఏళ్ల రికార్డ్ బద్దలు!

అఫ్గాన్‌తో భారత టీ20 జట్టు(అంచనా)

వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), ఇషాన్ కిషన్, తిలక్ వర్మ(వైస్ కెప్టెన్), శివమ్ దూబే, సూర్యాన్ష్ షెడ్గే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్/గుర్నూర్ బ్రార్, కృనాల్ పాండ్యా/వాషింగ్టన్ సుందర్, యశ్ ఠాకూర్, ప్రసిధ్ కృష్ణ.

Story first published: Monday, August 31, 2026, 17:48 [IST]
Other articles published on Aug 31, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+