
సంజయ్ కథనంపై..
ఇక ఈ కథనాన్ని ట్విటర్ వేదికగా పంచుకున్న సంజయ్ మంజ్రేకర్.. అభిప్రాయం చెప్పాలని క్రికెటర్లను, విశ్లేషకులను కోరాడు 'ఫ్రీహిట్' అనేది పోవాలి. అది బౌలర్లకు తీరని అన్యాయం చేస్తుంది'అని క్యాప్షన్‌గా పేర్కొన్నాడు. దీనిపై స్పందించిన అశ్విన్.. తన ఫ్రీబాల్ డిమాండ్‌ను తెరపైకి తీసుకొచ్చాడు. 'కమాన్ సంజయ్, ఫ్రీహిట్ అనేది గొప్ప మార్కెటింగ్ టూల్. అభిమానులు దానికి ఆకర్షితులయ్యారు.
అందుకే నాన్‌స్ట్రైకర్ బంతి వేయక ముందే క్రీజు దాటిన ప్రతిసారీ ఫ్రీ బాల్ ఇవ్వాలి. ఆ బంతికి వికెట్ రావాలి లేదా పది పరుగులను స్కోరు నుంచి తీసేయాలి' అని అశ్విన్ అభిప్రాయపడ్డాడు.

నాన్ స్ట్రైకర్ క్రీజు దాటితే..
అంతేకాకుండా 'గుర్తుంచుకోండి.. బంతి చేతుల్లోంచి వదిలాకే నాన్‌స్ట్రైకర్ క్రీజు దాటాలి'అని మరో ట్వీట్ చేశాడు. అయితే అశ్విన్ ప్రతిపాదనను మాజీ క్రికెటర్ దీప్ దాస్ గుప్తా వ్యతిరేకించాడు. ఫ్రీబాల్‌కు 10 పరుగులు తీసేయడం సమంజసం కాదన్నాడు. 'ఈ ప్రతిపాదనకు నేను అంగీకరించను. ఫ్రీబాల్‌కు వికెట్ పడితే ఫర్వాలేదు.
లేదంటే అది డాట్ బాలే (10 పరుగులు తీసేయకూడదు)' అని అశ్విన్‌కు బదులిచ్చాడు. 'న్యాయమేంటో చర్చిద్దాం! సమన్యాయం ఉండాలన్న తపనను మాత్రం కొనసాగిద్దాం. మీ నుంచి వచ్చిన ఆ స్ఫూర్తిని ప్రేమిస్తాను' అని ఈ సీనియర్ స్పిన్నర్ బదులిచ్చాడు. దాంతో ఫ్రీ హిట్- ఫ్రీబాల్ అనే టాపిక్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.

ఇది అన్యాయం..
ఇక మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్- బౌలర్లకు సమన్యాయం ఉండేలా నిబంధనలు ఉండాలని సంజయ్ మంజ్రేకర్ తన కాలమ్‌లో అభిప్రాయపడ్డాడు. లెగ్ బైస్, ఫ్రీహిట్, చిన్న బౌండరీలతో బౌలర్లకు అన్యాయం జరుగుతుందన్నాడు. క్రికెట్‌ను పూర్తిగా బ్యాట్స్‌మన్ ఫేవర్‌గా మార్చి బౌలర్లను శిక్షిస్తున్నారని అభిప్రాయపడ్డాడు. ఈ నిబంధనలను మార్చాలని అవసరం ఉందని నొక్కి చెప్పాడు. ముఖ్యంగా నోబాల్ విషయంలో ఇచ్చే ఫ్రీహిట్ అయితే మరీ దారుణమని పేర్కొన్నాడు. పైగా ఇప్పుడు నోబాల్స్‌ను థర్డ్ అంపైర్స్‌తో పరీక్షిస్తున్నారని తెలిపాడు. ఈ ఫ్రీ హిట్‌ను తీసేయాలన్నాడు.

బ్యాట్స్‌మన్‌కు ఫేవర్‌గా..
బౌలర్లు నోబాల్ వేస్తే బ్యాట్స్‌మన్‌కు ఉపయోగకరమైన ఫ్రీహిట్‌ను కొన్నేళ్ల క్రితం ఐసీసీ ప్రవేశపెట్టింది. ఇది పూర్తిగా బ్యాట్స్‌మన్ అనుకూలమైన నిబంధన. చాలామంది క్రికెటర్లు దీనిని వ్యతిరేకిస్తున్నారు. బ్యాటు, బంతి మధ్య అంతరం పెరుగుతోందని, బ్యాట్స్‌మెన్ అనుకూల క్రీడగా క్రికెట్ మారుతోందని విమర్శిస్తున్నారు. అందువల్ల సమన్యాయం చేసేందుకు ఫ్రీబాల్ ప్రవేశపెట్టాలని అశ్విన్, సంజయ్ మంజ్రేకర్ వంటి ఆటగాళ్లు డిమాండ్ చేస్తున్నాడు.


Click it and Unblock the Notifications
