For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs ZIM: పొట్టి ప్రపంచకప్ చరిత్రలోనే తొలిసారి!

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ 2026 టోర్నీలో టీమిండియా బ్యాటర్లు సరికొత్త రికార్డును నమోదు చేశారు. పొట్టి ప్రపంచకప్ చరిత్రలోనే ఒకే ఇన్నింగ్స్‌లో టాప్-6 బ్యాటర్లు 150 ప్లస్ స్ట్రైక్‌రేట్‌తో పరుగులు చేయడం ఇదే తొలిసారి. జింబాబ్వేతో చెన్నై వేదికగా గురువారం జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో భారత బ్యాటర్లు ఈ ఫీట్ అందుకున్నారు.

ఈ మ్యాచ్‌లో సంజూ శాంసన్ ఓపెనర్‌గా బరిలోకి దిగడంతో టీమిండియా పూర్వవైభవాన్ని అందుకుంది. గత నాలుగు మ్యాచ్‌ల్లో డకౌట్ అయిన ఓపెనర్లు.. ఈ మ్యాచ్‌లో మాత్రం అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. సంజూ శాంసన్ 160 స్ట్రైక్‌రేట్‌తో 15 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 24 పరుగులు చేయగా.. తన డకౌట్ల పరంపరకు చెక్ పెట్టిన అభిషేక్ శర్మ(30 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 55) 183.33 స్ట్రైక్‌రేట్‌తో ఫామ్ అందుకున్నాడు.

ఫస్ట్ డౌన్‌కు డిమోట్ అయిన ఇషాన్ కిషన్.. 158.33 స్ట్రైక్‌రేట్‌తో 24 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 38 పరుగులు చేయగా.. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 253.85 స్ట్రైక్‌రేట్‌తో 33 పరుగులు చేశాడు. హార్దిక్ పాండ్యా(23 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 50 నాటౌట్) 217.39 స్ట్రైక్‌రేట్‌తో విధ్వంసం సృష్టించగా..నెంబర్ 6లో బ్యాటింగ్ చేసిన తిలక్ వర్మ(16 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 44 నాటౌట్) 275 స్ట్రైక్‌రేట్‌తో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 19 ఏళ్ల టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఏ జట్టు టాప్-6 బ్యాటర్లు కూడా ఈ ఫీట్ సాధించలేదు.

India Script History Become 1st Team To Have six batters with 150 above strike rate in T20 World Cup history

భారత టాప్-6 బ్యాటర్ల స్ట్రైక్‌రేట్..

సంజూ శాంసన్- 160

అభిషేక్ శర్మ-183.33

ఇషాన్ కిషన్-158.33

సూర్యకుమార్ యాదవ్- 253.85

హార్దిక్ పాండ్యా-217.39

తిలక్ వర్మ-275

భారత్ ఘన విజయం..

ఈ మ్యాచ్‌లో భారత్ 72 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 256 పరుగుల భారీ స్కోర్ చేసింది. జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్ నగర్వా, బ్రెస్సింగ్ ముజుర్బాని, మపోసా, సికందర్ రజా తలో వికెట్ తీసారు.

అనంతరం జింబాబ్వే 20 ఓవర్లలో 6 వికెట్లకు 184 పరుగులు చేసి ఓటమిపాలైంది. బ్రియాన్ బెన్నిట్(59 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో 92 నాటౌట్)తన జోరు కొనసాగించగా.. కెప్టెన్ సికందర్ రజా(21 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 31) దూకుడుగా ఆడాడు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్(3/22) మూడే వికెట్లు తీయగా.. వరుణ్ చక్రవర్తీ, అక్షర్ పటేల్, శివమ్ దూబే చెరో వికెట్ తీసారు.

Story first published: Friday, February 27, 2026, 9:13 [IST]
Other articles published on Feb 27, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+