Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India Playing XI: హర్షిత్ రాణా ఇన్.. పంత్ ఔట్! సౌతాఫ్రికాతో తొలి వన్డే ఆడే భారత తుది జట్టు ఇదే!

సౌతాఫ్రికాతో రెండు టెస్ట్‌ల సిరీస్‌లో క్లీన్ స్వీప్ అయిన టీమిండియా.. వన్డే సిరీస్‌కు సిద్దమైంది. ఆదివారం (నవంబర్ 30న) రాంచీ వేదికగా జరిగే తొలి మ్యాచ్‌తో ఈ సిరీస్‌కు తెరలేవనుంది. టీమిండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రీఎంట్రీ ఇవ్వనుండగా.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్,వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గాయాలతో ఈ సిరీస్‌కు దూరమయ్యారు. దాంతో కేఎల్ రాహుల్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశారు.

టీ20 ప్రపంచకప్ 2026 నేపథ్యంలో జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్‌లకు రెస్ట్ ఇచ్చిన టీమిండియా మేనేజ్‌మెంట్.. గాయంతో జట్టుకు దూరమైన హార్దిక్ పాండ్యాను కూడా ఈ సిరీస్‌కు ఎంపిక చేయలేదు. దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్న రుతురాజ్ గైక్వాడ్ అవకాశం దక్కగా.. తిలక్ వర్మకు కూడా వన్డే జట్టులోకి వచ్చాడు. అక్షర్ పటేల్‌ స్థానంలో రవీంద్ర జడేజా రీఎంట్రీ ఇచ్చాడు. పేసర్లుగా అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా ప్రసిధ్ కృష్ణలు ఎంపికవ్వగా.. పేస్ ఆల్‌రౌండర్‌గా నితీష్ కుమార్ రెడ్డికి చోటు దక్కింది.

India s Probable XI for 1st ODI vs South Africa Harshit Rana Set for Debut Pant Uncertain

ఓపెనర్లుగా రోహిత్, జైస్వాల్..

టెస్ట్ సిరీస్ పరాజయం నేపథ్యంలో తుది జట్టు ఎంపిక ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. రుతురాజ్ గైక్వాడ్‌కు అవకాశం దక్కినా అతనికి తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు కనిపించడం లేదు. టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ‌తో కలిసి యశస్వి జైస్వాల్ ఓపెనింగ్ చేయనున్నాడు. ఆసీస్ పర్యటనలో గిల్‌తో కలిసి రోహిత్ ఓపెనింగ్ చేశాడు. 38 ఏళ్ల వయసులోనూ రోహిత్ శర్మ అద్భుతమైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు.

గిల్ గైర్హాజరీలో యశస్వి జైస్వాల్‌కు ఇది మంచి అవకాశం. విరాట్ కోహ్లీ మూడో స్థానంలో బరిలోకి దిగనున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో డకౌట్ అయిన కోహ్లీ.. మూడో వన్డేలో హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. సొంతగడ్డపై అతను బ్యాట్ ఝులిపించాల్సిన అవసరం ఉంది.

రిషభ్ పంత్ డౌట్..

కెప్టెన్ కేఎల్ రాహుల్ నాలుగో స్థానంలో ఆడనుండగా.. ఐదో స్థానంలో రిషభ్ పంత్‌ ఆడుతాడు. సుదీర్ఘ కాలం తర్వాత రిషభ్ పంత్ వన్డే ఫార్మాట్‌లో అవకాశం అందుకోనున్నాడు. ఒకవేళ ఇద్దరు వికెట్ కీపర్లు ఎందుకని భావిస్తే రిషభ్ పంత్ స్థానంలో తిలక్ వర్మకు అవకాశం దక్కనుంది.

స్పిన్ ఆల్‌రౌండర్లుగా వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, పేస్ ఆల్‌రౌండర్‌గా నితీష్ కుమార్ రెడ్డి బరిలోకి దిగనుండగా.. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్ ఆడనున్నాడు. పేసర్లుగా అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణాకు అవకాశం దక్కనుంది. ప్రసిధ్ కృష్ణ, ధ్రువ్ జురెల్‌, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్‌ల‌కు నిరాశే ఎదురవ్వనుంది.


సౌతాఫ్రికాతో తొలి వన్డే తుది జట్టు(అంచనా)

రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్(కెప్టెన్), రిషభ్ పంత్/తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా.

భారత వన్డే టీమ్: రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్(కెప్టెన్), కీపర్, రిషభ్ పంత్(కీపర్), వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, రుతురాజ్ గైక్వాడ్, ప్రసిధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్, ధ్రువ్ జురెల్.

Story first published: Friday, November 28, 2025, 15:13 [IST]
Other articles published on Nov 28, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+