Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India Playing XI: కోహ్లీ, రోహిత్ రీఎంట్రీ.. సౌతాఫ్రికాతో తొలి వన్డే ఆడే భారత తుది జట్టు ఇదే!

సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌కు టీమిండియా సిద్దమైంది. నవంబర్ 30న రాంచీ వేదికగా జరిగే తొలి మ్యాచ్‌తో ఈ సిరీస్‌కు తెరలేవనుంది.ఈ మూడు వన్డేల సిరీస్ కోసం ఆదివారమే భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. మెడ నొప్పితో కెప్టెన్ శుభ్‌మన్ గిల్.. ప్లీహం గాయంతో వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఈ సిరీస్‌కు దూరం కావడంతో కేఎల్ రాహుల్‌ తాత్కలిక సారథిగా ఎంపికయ్యాడు.

టీ20 ప్రపంచకప్ 2026 నేపథ్యంలో జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్‌లకు రెస్ట్ ఇచ్చిన టీమిండియా మేనేజ్‌మెంట్.. గాయంతో జట్టుకు దూరమైన హార్దిక్ పాండ్యాను కూడా ఈ సిరీస్‌కు ఎంపిక చేయలేదు. దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్న రుతురాజ్ గైక్వాడ్ అవకాశం దక్కగా.. తిలక్ వర్మకు కూడా వన్డే జట్టులోకి వచ్చాడు. అక్షర్ పటేల్‌ స్థానంలో రవీంద్ర జడేజా రీఎంట్రీ ఇచ్చాడు. పేసర్లుగా అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా ప్రసిధ్ కృష్ణలు ఎంపికవ్వగా.. పేస్ ఆల్‌రౌండర్‌గా నితీష్ కుమార్ రెడ్డికి చోటు దక్కింది.

India s Probable Playing XI for 1st ODI vs South Africa Kohli and Rohit Return Pant Doubtful

ఓపెనర్లుగా రోహిత్, జైస్వాల్..

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రీఎంట్రీ ఇవ్వడం.. గిల్, అయ్యర్, బుమ్రా, హార్దిక్ పాండ్యా దూరమైన నేపథ్యంలో తుది జట్టు ఎంపిక ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ‌తో కలిసి యశస్వి జైస్వాల్ ఓపెనింగ్ చేయనున్నాడు. ఆసీస్ పర్యటనలో గిల్‌తో కలిసి రోహిత్ ఓపెనింగ్ చేశాడు. 38 ఏళ్ల వయసులోనూ రోహిత్ శర్మ అద్భుతమైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు.

గిల్ గైర్హాజరీలో యశస్వి జైస్వాల్‌కు ఇది మంచి అవకాశం. విరాట్ కోహ్లీ ఫస్ట్ డౌన్‌లో బరిలోకి దిగనున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో డకౌట్ అయిన కోహ్లీ.. మూడో వన్డేలో హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. సొంతగడ్డపై అతను బ్యాట్ ఝులిపించాల్సిన అవసరం ఉంది.

రిషభ్ పంత్ డౌట్..

కెప్టెన్ కేఎల్ రాహుల్ నాలుగో స్థానంలో ఆడనుండగా.. ఐదో స్థానంలో రిషభ్ పంత్‌ ఆడుతాడు. సుదీర్ఘ కాలం తర్వాత రిషభ్ పంత్ వన్డే ఫార్మాట్‌లో అవకాశం అందుకోనున్నాడు. ఒకవేళ ఇద్దరు వికెట్ కీపర్లు ఎందుకని భావిస్తే రిషభ్ పంత్ స్థానంలో రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మలో ఒకరికి చోటు దక్కుతుంది.

స్పిన్ ఆల్‌రౌండర్లుగా వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, పేస్ ఆల్‌రౌండర్‌గా నితీష్ కుమార్ రెడ్డి బరిలోకి దిగనుండగా.. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్ ఆడనున్నాడు. పేసర్లుగా అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణాకు అవకాశం దక్కనుంది. ప్రసిధ్ కృష్ణ, ధ్రువ్ జురెల్‌, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్‌ల‌కు నిరాశే ఎదురవ్వనుంది.


సౌతాఫ్రికాతో తొలి వన్డే తుది జట్టు(అంచనా)

రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్(కెప్టెన్), రిషభ్ పంత్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా.

Story first published: Monday, November 24, 2025, 10:40 [IST]
Other articles published on Nov 24, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+