Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SA: పంత్‌పై వేటు.. అతనికి చోటు! సౌతాఫ్రికాతో తొలి వన్డే ఆడే భారత జట్టు ఇదే!

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా సౌతాఫ్రికాతో తొలి మ్యాచ్‌‌కు టీమిండియా సిద్దమైంది. ఆదివారం రాంచీ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో ఆతిథ్య భారత్‌, సౌతాఫ్రికా అమీతుమీ తేల్చుకోనున్నాయి. అసాధారణ ప్రదర్శనతో రెండు టెస్ట్‌ల సిరీస్‌లో 2-0తో టీమిండియాను వైట్‌వాష్ చేసిన సౌతాఫ్రికా రెట్టించిన ఉత్సాహంతో ఉంది. మరోవైపు ఘోర పరాజయంతో డీలా పడిన భారత్.. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. టీమిండియా స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రీఎంట్రీ ఇవ్వగా.. గాయాలతో శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ దూరమయ్యారు. దాంతో టీమిండియా కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ ఎంపికయ్యాడు.

రిషభ్ పంత్‌పై వేటు..

దేశవాళి క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్న రుతురాజ్ గైక్వాడ్‌ ఈ సిరీస్‌కు ఎంపికయ్యాడు. టెస్ట్ సిరీస్ ఘోర పరాజయం‌తో పాటు కోహ్లీ, రోహిత్ రీఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో తుది జట్టు ఎంపిక ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. రుతురాజ్ గైక్వాడ్‌కు తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఓపెనర్‌గా కాకుండా మిడిలార్డర్‌లో ఆడే ఛాన్స్ ఉంది. అదే జరిగితే రిషభ్ పంత్‌పై వేటు పడనుంది.

India s Probable Playing XI for 1st ODI vs South Africa Gaikwad Set to Return Pant Likely Rested

రోహిత్ శర్మ‌తో కలిసి యశస్వి జైస్వాల్ ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. ఆసీస్ పర్యటనలో గిల్‌తో కలిసి రోహిత్ ఓపెనింగ్ చేశాడు. 38 ఏళ్ల వయసులోనూ రోహిత్ శర్మ అద్భుతమైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. సెంచరీతో చెలరేగాడు.గిల్ గైర్హాజరీలో సత్తా చాటేందుకు యశస్వి జైస్వాల్‌కు ఇది మంచి అవకాశం. విరాట్ కోహ్లీ మూడో స్థానంలో బరిలోకి దిగనున్నాడు.

హర్షిత్ రాణాకు చోటు..

ఆస్ట్రేలియా పర్యటనలో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో డకౌట్ అయిన కోహ్లీ.. మూడో వన్డేలో హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. సొంతగడ్డపై అతను చెలరేగాల్సిన అవసరం ఉంది. రుతురాజ్ గైక్వాడ్ నాలుగో స్థానంలో ఆడనుండగా.. కెప్టెన్ కేఎల్ రాహుల్ ఐదో స్థానంలో బరిలోకి దిగనున్నాడు. స్పిన్ ఆల్‌రౌండర్లుగా వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, పేస్ ఆల్‌రౌండర్‌గా నితీష్ కుమార్ రెడ్డి బరిలోకి దిగనుండగా.. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్ ఆడనున్నాడు. పేసర్లుగా అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణాకు అవకాశం దక్కనుంది.

సౌతాఫ్రికాతో తొలి వన్డే తుది జట్టు(అంచనా)

రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్(కెప్టెన్), రిషభ్ పంత్/తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా.

భారత వన్డే టీమ్:

రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్(కెప్టెన్), కీపర్, రిషభ్ పంత్(కీపర్), వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, రుతురాజ్ గైక్వాడ్, ప్రసిధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్, ధ్రువ్ జురెల్.

Story first published: Saturday, November 29, 2025, 14:12 [IST]
Other articles published on Nov 29, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+