IND vs NZ: కోహ్లీ, రోహిత్ రీఎంట్రీ.. న్యూజిలాండ్‌తో వన్డేల్లో తలపడే భారత జట్టు ఇదే!
సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్‌తో టీమిండియా కొత్త ఏడాదిని ప్రారంభించనుంది. ఇప్పటికే ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026తో పాటు న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ ఆడే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. టీ20 ప్రపంచకప్‌లో బరిలోకి దిగే జట్టే న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్ ఆడుతుందని చెప్పింది. కానీ టీ20 సిరీస్ కంటే ముందే జరిగే మూడు వన్డేల సిరీస్‌లో బరిలోకి దిగే భారత జట్టును మాత్రం భారత సెలెక్టర్లు ఇంకా ప్రకటించలేదు.
దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ నేపథ్యంలో న్యూజిలాండ్‌తో తలపడే భారత వన్డే టీమ్‌ను సెలెక్టర్లు ఎంపిక చేయలేదు. ఈ దేశవాళీ టోర్నీలో ఆటగాళ్ల సత్తాను పరీక్షించి ఈ సిరీస్‌కు ఎంపిక చేయనుంది. టీ20 ప్రపంచకప్ 2026 నేపథ్యంలో ఈ మెగా టోర్నీకి ఎంపికైన ఆటగాళ్లు.. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు దూరంగా ఉండనున్నారు. దాంతో కొత్త ఆటగాళ్లకు అవకాశం దక్కనుంది. జనవరి 11, 14, 18 తేదీల్లో వడోదర, రాజ్‌కోట్, ఇండోర్ వేదికగా ఈ మూడు వన్డేల సిరీస్ జరగనుంది.

బుమ్రా, హార్దిక్‌కు నో ఛాన్స్..
టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాతో పాటు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు వన్డే సిరీస్ నుంచి విశ్రాంతి ఇవ్వనున్నారు. ఈ ఇద్దరితో పాటు అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణాలను కూడా వన్డే సిరీస్‌కు దూరంగా ఉంచే అవకాశాలు ఉన్నాయి. శుభ్‌మన్ గిల్ సారథ్యంలో వన్డే జట్టును ఎంపిక చేయనున్నారు. వన్డే ఫార్మాట్ మాత్రమే ఆడుతున్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రీఎంట్రీ ఇవ్వనున్నారు.
ఆస్ట్రేలియా పర్యటనలో గాయపడి జట్టుకు దూరమైన శ్రేయస్ అయ్యర్ పూర్తిగా కోలుకొని ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాడు. విజయ్ హజారే ట్రోఫీలో కూడా అతను ఆడనున్నాడు. ఆ టోర్నీలో రాణించడంపైనే అతను భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. విజయ్ హజారేలో అతను ఫిట్‌నెస్ నిరూపించుకొని సత్తా చాటితే వైస్ కెప్టెన్‌గా రీఎంట్రీ ఇవ్వనున్నాడు.
దేశవాళీ ఆటగాళ్లకు ఛాన్స్..
పొత్తికడుపు కండరాల గాయంతో బాధపడుతున్న యశస్వి జైస్వాల్.. పూర్తిగా కోలుకుంటే ఈ టోర్నీలో ఆడనున్నాడు. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌లో సత్తా చాటిన రుతురాజ్ గైక్వాడ్‌కు కూడా అవకాశం దక్కనుంది. తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి కూడా ఎంపికవ్వనున్నాడు. ప్రసిధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్‌తో పాటు ఆకాష్ దీప్ పేసర్లుగా ఎంపిక కానున్నారు. స్పిన్నర్లుగా రవీంద్ర జడేజాతో పాటు వాషింగ్టన్ సుందర్ అవకాశం అందుకోనున్నారు. విజయ్ హజారే ట్రోఫీలో మెరుగ్గా రాణించే ఆటగాళ్లను కూడా సెలెక్టర్లు పరిగణలోకి తీసుకోనున్నారు.
న్యూజిలాండ్‌తో తలపడే భారత వన్డే జట్టు:
రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి, రుతురాజ్ గైక్వాడ్/శ్రేయస్ అయ్యర్, ప్రసిధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్, ధ్రువ్ జురెల్, ఆకాశ్ దీప్/ముకేష్ కుమార్/ఆకిబ్ నబీ.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications