మహిళల వన్డే ప్రపంచకప్ 2025 టోర్నీలో టీమిండియా కీలక పోరుకు సిద్దమైంది. గురువారం న్యూజిలాండ్‌తో జరిగే లీగ్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత మహిళల జట్టు అమీతుమీ తేల్చుకోనుంది. వరుసగా మూడు పరాజయాలతో చతికిలపడిన భారత మహిళల జట్టు.. న్యూజిలాండ్‌ను ఓడించి మళ్లీ విజయాల బాట పట్టాలనుకుంటుంది. ఈ మ్యాచ్ గెలిస్తేనే హర్మన్‌సేన సెమీస్ అవకాశాలు సజీవంగా ఉండనున్నాయి.
ఓడితే సెమీస్ సమీకరణాలు మరింత సంక్లిష్టంగా మారుతాయి. ఇప్పటికే టాప్-3లో నిలిచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ సెమీస్ బెర్త్‌లు ఖరారు చేసుకోగా.. నాలుగో స్థానం కోసం భారత్, న్యూజిలాండ్ పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

గత మూడు మ్యాచ్‌ల్లో టీమిండియా విజయం ముంగిట బొక్కాబోర్లా పడింది. ముఖ్యంగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌ను ఒత్తిడి తట్టుకోలేక చేజేతులా చేజార్చుకుంది. చావో రేవో మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో టీమిండియా ఉంది. టీమ్ కాంబినేషన్‌లో స్వల్ప మార్పులు చేసే అవకాశం ఉంది. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో ఎక్స్‌ట్రా బౌలర్‌ను తీసుకున్న టీమిండియా.. బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్‌పై వేటు వేసింది. ఆమె స్థానంలో రేణుకా సింగ్‌ను తీసుకుంది. ఆరంభంలో భారత బౌలర్లు విఫలమైనా.. చివర్లో చెలరేగి ఇంగ్లండ్‌ను కట్టడి చేశారు.
ఈ క్రమంలోనే న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో టీమిండియా ఇదే కాంబినేషన్‌ను కొనసాగిస్తుందా? లేక ఎక్స్‌ట్రా బ్యాటర్‌గా జెమీమాను ఆడిస్తుందా? అనేది చూడాలి. జెమీమాను ఆడించే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మ్యాచ్ జరిగే నవీ ముంబై పిచ్.. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండనుంది. డ్యూ ప్రభావం చూపనుంది. ఈ క్రమంలోనే టీమిండియా ఎక్స్‌ట్రా బ్యాటర్‌తో బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. మిగతా కాంబినేషన్‌లో పెద్దగా మార్పులు జరిగే అవకాశం లేదు.
ఓపెనర్ స్మృతి మంధాన సూపర్ ఫామ్‌లో ఉండగా.. ప్రతికా రావల్ మెరుపులు మెరిపించాల్సి ఉంది. హర్లీన్ డియోల్ కూడా చెలరేగితే భారత్‌కు తిరుగుండదు. హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా ఫామ్‌లోకి వచ్చింది. రిచా ఘోష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అమన్‌జోత్ కౌర్, దీప్తి శర్మ కూడా మెరుగ్గానే రాణిస్తున్నారు. ఛేజింగ్‌లో సెటిల్ అయిన బ్యాటర్ మ్యాచ్ ముగిసే వరకు క్రీజులో ఉండాల్సిన అవసరం ఉంది. ఈ విషయంపై టీమిండియా వర్క్ చేయాల్సి ఉంది. బౌలర్లుగా క్రాంతి గౌడ్, శ్రీచరణి, దీప్తి శర్మ, స్నేహ్ రాణా పర్వాలేదనిపిస్తున్నారు. సమష్టి ప్రదర్శన కనబరిస్తేనే టీమిండియాకు విజయం దక్కనుంది. మధ్యాహ్నం 3 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుండగా.. జియో హాట్‌స్టార్, స్టార్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.
స్మృతి మంధాన, ప్రతికా రావల్, హర్లీన్ డియోల్, హర్మన్‌ప్రీత్ కౌర్, రిచా ఘోష్, అమన్‌జోత్ కౌర్, స్నేహ్ రాణా, దీప్తి శర్మ, రేణుక సింగ్/జెమీమా రోడ్రిగ్స్, క్రాంతి గౌడ్, శ్రీ చరణి.