Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AUS: చెత్త బ్యాటింగ్‌తో టీమిండియా చిత్తు!

ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్‌లోనూ టీమిండియా శుభారంభం అందుకోలేకపోయింది. తొలి టీ20 వర్షార్పణం కాగా.. రెండో టీ20లో ఆసీస్ 4 వికెట్ల తేడాతో భారత్‌ను చిత్తు చేసింది. చెత్త బ్యాటింగ్‌ టీమిండియా ఓటమిని శాసించింది. ఈ గెలుపుతో ఐదు టీ20ల సిరీస్‌లో ఆసీస్ 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 18.4 ఓవర్లలో 125 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ అభిషేక్ శర్మ(37 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 68) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించగా.. హర్షిత్ రాణా(33 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 35) అతనికి అండగా నిలిచాడు. మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఇందులో ముగ్గురు బ్యాటర్లు ఖాతా కూడా తెరవలేదు. ఆసీస్ బౌలర్లలో జోష్ హజెల్ వుడ్(3/13) మూడు వికెట్లు తీయగా.. గ్జేవియర్ బార్ట్‌లెట్, నాథన్ ఎల్లిస్ రెండేసి వికెట్లు తీసారు. మార్కస్ స్టోయినీస్ ఒక వికెట్ తీసాడు. పరిస్థితులను గౌరవించకుండా దూకుడుగా ఆడి భారత బ్యాటర్లు మూల్యం చెల్లించుకున్నారు.

India s Over-Aggressive Batting Costs Them as Australia Clinch 2nd T20I Win
Photo Credit: X (twitter)

అనంతరం ఆస్ట్రేలియా 13.2 ఓవర్లలో 6 వికెట్లకు 126 పరుగులు చేసి గెలుపొందింది. కెప్టెన్ మిచెల్ మార్ష్(26 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 46) తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకోగా.. ట్రావిస్ హెడ్(15 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 28) దూకుడుగా ఆడాడు. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా(2/26), వరుణ్ చక్రవర్తీ(2/23), కుల్దీప్ యాదవ్(2/43) రెండేసి వికెట్లు తీసారు. పవర్ ప్లేలో కాస్త కట్టడిగా బౌలింగ్ చేసినా.. బ్యాటింగ్‌లో మరో 20 పరుగులు చేసినా ఫలితం మరోలా ఉండేది.

స్వల్ప లక్ష్యచేధనలో ఆసీస్‌కు అదిరిపోయే ఆరంభం దక్కింది. ఓపెనర్లు మిచెల్ మార్ష్, ట్రావిస్ హెడ్ దూకుడుగా ఆడారు. దాంతో 4.3 ఓవర్లలోనే ఆసీస్ 51 పరుగులు చేసింది. తిలక్ వర్మ స్టన్నింగ్ క్యాచ్‌కు ట్రావిస్ హెడ్ వెనుదిరగ్గా.. జోష్ ఇంగ్లీస్‌తో కలిసి మిచ్ మార్ష్‌ చెలరేగాడు. హాఫ్ సెంచరీ ముంగిట అతన్ని కుల్దీప్ యాదవ్ ఔట్ చేయగా.. టీమ్ డేవిడ్‌ను వరుణ్ పెవిలియన్ చేర్చాడు.

జోష్ ఇంగ్లీస్(20)ను కుల్దీప్ యాదవ్ ఔట్ చేయగా.. మిచెల్ ఓవెన్‌ను బుమ్రా కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. కానీ చేయాల్సిన లక్ష్యం తక్కువగా ఉండటంతో ఆసీస్‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా పోయింది. మాథ్యూ షార్ట్‌ను బుమ్రా క్లీన్ బౌల్డ్ చేయగా.. మార్కస్ స్టోయినీస్ క్విక్ డబుల్ తీసి విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు. బ్యాటింగ్‌లో రాణించిన హర్షిత్ రాణా బౌలింగ్‌లో మాత్రం దారుణంగా విఫలమయ్యాడు.

Story first published: Friday, October 31, 2025, 17:12 [IST]
Other articles published on Oct 31, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+