న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌కు టీమిండియా సిద్దమైంది. జనవరి 11న వడోదర వేదికగా జరిగే తొలి వన్డేతో ఈ సిరీస్‌కు తెరలేవనుంది. సౌతాఫ్రికాపై వన్డే సిరీస్ గెలిచిన భారత్ అదే జోరును కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. ఇటీవల ఈ సిరీస్ బరిలోకి దిగే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. గాయాలతో జట్టుకు దూరమైన కెప్టెన్ శుభ్‌మన్ గిల్, వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌లు తిరిగి జట్టులోకి వచ్చారు.
రిషభ్ పంత్ తన స్థానాన్ని నిలబెట్టుకోగా.. జస్‌ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యాకు ఈ సిరీస్ నుంచి రెస్ట్ ఇచ్చారు. మహమ్మద్ షమీని పట్టించుకోని సెలెక్టర్లు మహమ్మద్ సిరాజ్‌ను ఎంపిక చేశారు. దాంతో టీమిండియా కాంబినేషన్ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.

కెప్టెన్ శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ ఓపెనింగ్ చేయనుండగా.. విరాట్ కోహ్లీ మూడో స్థానంలో ఆడనున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో హాఫ్ సెంచరీతో ఫిట్‌నెస్ నిరూపించుకున్న శ్రేయస్ అయ్యర్ నాలుగో స్థానంలో బరిలోకి దిగనున్నాడు.
ఐదో స్థానంలో వికెట్ కీపర్‌గా కేఎల్ రాహుల్ ఆడనుండగా.. రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ స్పిన్ ఆల్‌రౌండర్లుగా బరిలోకి దిగనున్నారు. పేసర్లుగా అర్ష్‌దీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్ చోటుకు డోకా లేదు. పిచ్ పేస్ కండిషన్స్‌కు అనుకూలంగా ఉంటే వాషింగ్టన్ సుందర్ స్థానంలో పేస్ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి బరిలోకి దిగుతాడు.
శుభ్‌మన్ గిల్(కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్(వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్(కీపర్), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్/ నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్
శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్(వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, మహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, రిషభ్ పంత్, నితీష్ కుమార్ రెడ్డి, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్.