Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India Playing XI: ఆ నలుగురు బెంచ్‌కే.. టీ20 ప్రపంచకప్‌లో ఆడే భారత తుది జట్టు ఇదే!

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో బరిలోకి దిగే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. గత శనివారం(డిసెంబర్ 20) 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టు వివరాలను బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా, టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ మీడియాకు వెల్లడించిన సంగతి తెలిసిందే.

సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ ఆడిన జట్టులో సెలెక్టర్లు మూడు మార్పులు చేశారు. టీ20 ఫార్మాట్‌లో వరుసగా విఫలమైన శుభ్‌మన్ గిల్‌పై వేటు పడింది. వికెట్ కీపర్‌ జితేష్ శర్మను తప్పించిన సెలెక్టర్లు ..సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన కనబర్చిన ఇషాన్ కిషన్‌తో పాటు రింకూ సింగ్‌ను తిరిగి జట్టులోకి తీసుకున్నారు.అక్షర్ పటేల్‌కు వైస్ కెప్టెన్సీ దక్కింది. మిగతా టీ20 ప్లేయర్లు తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. ఫిబ్రవరి 7 నుంచి భారత్ వేదికగానే మెగా టోర్నీ ప్రారంభం కానుండగా.. భారత తుది జట్టు ఎంపిక ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.

India s Likely Playing XI for ICC T20 World Cup 2026 No Spot for Ishan Kishan Kuldeep Yadav and Two Others

ఓపెనర్లుగా అభిషేక్, సంజూ..

శుభ్‌మన్ గిల్ వేటుతో ఓపెనర్‌గా సంజూ శాంసన్‌కు మార్గం సుగుమమైంది. ఓపెనర్ కమ్ వికెట్ కీపర్‌గా తొలి ప్రాధాన్యత సంజూ శాంసన్‌కే దక్కనుంది. అతను విఫలమైతేనే ఇషాన్ కిషన్‌ తుది జట్టులోకి రానున్నాడు. నెంబర్ వన్ టీ20 బ్యాటర్‌గా కొనసాగుతున్న అభిషేక్ శర్మ చోటుకు డోకాలేదు. పవర్ ప్లేలో దూకుడుగా ఆడే ఈ జోడీ.. చెలరేగడంపైనే టీమిండియా విజయవకాశాలు ఆధారపడి ఉన్నాయి.

మిడిలార్డర్‌లో తిలక్, సూర్య, పాండ్యా

మిడిలార్డర్‌లో తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ బరిలోకి దిగనున్నారు. పిచ్ కండిషన్స్‌, మ్యాచ్ పరిస్థితులను బట్టి ఈ నలుగురి ఆటగాళ్ల బ్యాటింగ్ స్థానాలు మారనున్నాయి. తిలక్, సూర్య, హార్దిక్ సూపర్ ఫామ్‌లో ఉండగా.. సూర్య, అక్షర్ పటేల్ ఫామ్ అందుకోవాల్సి ఉంది. మరో పేస్ ఆల్‌రౌండర్‌గా శివమ్ దూబేకు అవకాశం దక్కనుంది. ఎక్స్‌ట్రా బ్యాటర్ కావాలనుకుంటే రింకూ సింగ్‌కు అవకాశం దక్కుతుంది.

బుమ్రా సారథ్యంలో..

బౌలింగ్ విభాగాన్ని జస్‌ప్రీత్ బుమ్రా నడిపించనున్నాడు. అతనికి తోడుగా హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్‌లు బరిలోకి దిగనున్నారు. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా వరుణ్ చక్రవర్తీ ఆడనున్నాడు. ఎక్స్‌ట్రా స్పిన్నర్ కావాలనుకుంటే అర్ష్‌దీప్ సింగ్‌పై వేటు పడనుంది. అయితే ఈ టోర్నీలో ఇషాన్ కిషన్, కుల్దీప్ యాదవ్, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్‌లు ఎక్కువగా బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

భారత తుది జట్టు(అంచనా)

అభిషేక్ శర్మ, సంజూ శాంసన్(కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), శివమ్ దూబే, హర్షిత్ రాణా, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్/కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తీ

భారత టీ20 ప్రపంచకప్ జట్టు:

సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్(కీపర్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్(వైస్ కెప్టెన్), రింకూ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తీ, వాషింగ్టన్ సుందర్, ఇషాన్ కిషన్(కీపర్), హర్షిత్ రాణా.

Story first published: Tuesday, December 23, 2025, 7:01 [IST]
Other articles published on Dec 23, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+