For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India Playing XI:చాహల్, రిషభ్ పంత్‌కు మళ్లీ నిరాశే.. జింబాబ్వేతో బరిలోకి దిగే భారత జట్టు ఇదే!

India Playing XI vs Zimbabwe: Team India set to go unchanged, Rishabh Pant Likely to replace Dinesh Karthik

అడిలైడ్: టీ20 ప్రపంచకప్ 2022లో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించిన భారత్.. ఆఖరి సూపర్ 12 మ్యాచ్‌కు సిద్దమైంది. ఆదివారం మెల్‌బోర్న్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో జింబాబ్వేతో అమీుతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధిస్తే ఎలాంటి సమీకరణాలు లేకుండా సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంటుంది. మ్యాచ్ రద్దయినా నాకౌట్ బెర్త్ దక్కుతుంది. కానీ ఓడితే మాత్రం ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. కాబట్టి రోహిత్ సేన విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. మరోవైపు పాకిస్థాన్‌పై సంచలన విజయం నమోదు చేసిన జింబాబ్వే.. భారత్‌కు షాకివ్వాలనుకుంటుంది. దాంతో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

 విన్నింగ్ కాంబినేషన్ మార్చకపోవచ్చు..

విన్నింగ్ కాంబినేషన్ మార్చకపోవచ్చు..

విన్నింగ్ కాంబినేషన్‌ను టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ మార్చకపోవచ్చు. సౌతాఫ్రికాతో ఏకైక మార్పుతో బరిలోకి దిగిన టీమిండియా మూల్యం చెల్లించుకుంది. ఈ క్రమంలోనే విన్నింగ్ కాంబినేషన్‌ను కొనసాగించేందుకు రోహిత్ అండ్ ద్రవిడ్ మొగ్గు చూపనున్నారు. అంతేకాకుండా నిలకడలేమి ఫామ్‌తో సతమతమైన కేఎల్ రాహుల్ కూడా టచ్‌లోకి వచ్చాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన గత మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో చెలరేగాడు. మెల్ బోర్న్ పిచ్ కండిషన్స్ ప్రకారం ఏమైనా మార్పులు చేస్తే చెప్పలేం కానీ.. ఆటగాళ్ల వైఫల్యం ఆధారంగా మార్చే ప్రస్తకే అయితే లేదు.

రిషభ్ పంత్‌కు చాన్స్..

రిషభ్ పంత్‌కు చాన్స్..

జట్టులో ఏమైనా మార్పులు చేయాలనుకుంటే అది దినేశ్ కార్తీక్ స్థానంలో రిషభ్ పంత్‌ను తీసుకోవడమే. గత నాలుగు మ్యాచ్‌ల్లో బెంచ్‌కే పరిమితమైన రిషభ్ పంత్‌ను ఈ మ్యాచ్‌లో ఆడించే అవకాశం ఉంది. మెల్‌బోర్న్ వేదికగా ప్రాక్టీస్ సెషన్ ముగిసిన అనంతరం ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని జట్టు వర్గాలు పేర్కొన్నాయి. గత నాలుగు మ్యాచ్‌లో దినేశ్ కార్తీక్ దారుణంగా విఫలమయ్యాడు. అయినా టీమ్‌మేనేజ్‌మెంట్ అతనిపైనే నమ్మకం ఉంచింది. కానీ మాజీ క్రికెటర్లు మాత్రం కార్తీక్‌కు బదులు రిషభ్ పంత్‌ను ఆడించాలని సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే కీలక సెమీఫైనల్ ముందు పంత్‌ను పరీక్షించే అవకాశం ఉంది.

చాహల్, హర్షల్ పటేల్‌కు మళ్లీ నిరాశే..

చాహల్, హర్షల్ పటేల్‌కు మళ్లీ నిరాశే..

టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌తో పాటు హర్షల్ పటేల్‌కు మళ్లీ నిరాశే ఎదురుకానుంది. అశ్విన్‌ను కాదని చాహల్‌ను ఆడించే పరిస్థితులు కనబడటం లేదు. పేస్ అనుకూలించే మెల్‌బోర్న్ పిచ్‌పై స్పిన్నర్లు ప్రభావం అంతంత మాత్రమే. అంతేకాకుండా జింబాబ్వేలో లెఫ్టాండర్స్ ఉన్న నేపథ్యంలో అశ్విన్‌నే రోహిత్ కొనసాగించనున్నాడు. బ్యాటింగ్‌లో కూడా విలువైన పరుగులు చేస్తుండటం కలిసొచ్చే అంశం. ఇక అక్షర్ పటేల్ పెద్దగా రాణించకపోయినా.. అతన్ని మార్చే సాహసం చేయకపోవచ్చు. పిచ్ కండిషన్స్ ఆధారంగా ఎక్స్‌ట్రా పేసర్‌ను తీసుకోవాలనుకుంటే హర్షల్ పటేల్.. ఎక్స్‌ట్రా బ్యాటర్ కావాలనుకుంటే పంత్, హుడాలో ఒకరు బరిలోకి దిగనున్నారు. టాపార్డర్ బ్యాటర్లు, పేస్‌ బౌలింగ్‌లో మార్పులకు ఎలాంటి ఆస్కారం లేదు.

 తుది జట్టు(అంచనా)

తుది జట్టు(అంచనా)

రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దినేశ్ కార్తీక్/ రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్

Story first published: Friday, November 4, 2022, 15:16 [IST]
Other articles published on Nov 4, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+