Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India Playing XI: ఆ ఐపీఎల్ స్టార్లకు నిరాశే.. జింబాబ్వేతో తొలి టీ20 ఆడే భారత తుది జట్టు ఇదే!

టీ20 ప్రపంచకప్ 2024లో విజేతగా నిలిచిన టీమిండియా జింబాబ్వే పర్యటనకు సిద్దమైంది. ఈ టూర్‌తోనే టీ20ల్లో టీమిండియా కొత్త శకం ప్రారంభం కానుంది. 11 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ టీమిండియాకు ఐసీసీ టైటిల్ అందించిన కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో పాటు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ధనాధన్ ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే.

ఇప్పటికే జింబాబ్వే పర్యటనకు బీసీసీఐ 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఈ పర్యటన నుంచి ప్రపంచకప్ ఆడిన సీనియర్ ఆటగాళ్లందరికి విశ్రాంతినిచ్చింది. ఈ పర్యటనకు శుభ్‌మన్ గిల్‌ను సారథిగా ఎంపిక చేసిన టీమిండియా.. ప్రపంచకప్ జట్టులో ఉన్న సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్‌, శివమ్ దూబేలతో పాటు రిజర్వ్ ప్లేయర్‌గా ఉన్న రింకూ సింగ్‌ను కూడా జట్టులోకి తీసుకుంది.

India Playing XI vs Zimbabwe for 1st T20I No chance for Ruturaj Gaikwad and Riyan Parag

పాపం నితీష్ రెడ్డి..
ఐపీఎల్‌లో సత్తాచాటిన రియాన్ పరాగ్, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ‌లకు కూడా ఈ జట్టులో చోటు దక్కింది. తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి కూడా ఎంపికయ్యాడు. కానీ చివరి నిమిషంలో గాయంతో తప్పుకోగా.. శివమ్ దూబే‌తో అతని స్థానాన్ని భర్తీ చేశారు. ఈ ఐదు టీ20ల సిరీస్‌లో తొలి మ్యాచ్ శనివారం(జూలై 6) జరగనుంది.

రుతురాజ్‌కు నిరాశే..
ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగే తుది జట్టుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎన్‌సీఏ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ ఈ పర్యటనలో టీమిండియాకు హెడ్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్‌లు ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. ఐపీఎల్‌లో సంచలన ప్రదర్శన కనబర్చిన అభిషేక్ శర్మ ఫస్ట్‌డౌన్‌లో ఆడవచ్చు. రుతురాజ్ గైక్వాడ్‌ బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయి.

వికెట్ కీపర్‌గా సంజూ శాంసన్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయవచ్చు. పేస్ ఆల్‌రౌండర్ శివమ్ దూబే ఐదో స్థానంలో ఆడనుండగా.. రింకూ సింగ్ ఆరో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. స్పిన్ ఆల్‌రౌండర్లుగా వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్‌లు బరిలోకి దిగనుండగా.. ఆవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు.

ఐపీఎల్‌లో మెరుగైన ప్రదర్శన చేసిన రియాన్ పరాగ్‌తో పాటు ధ్రువ్ జురెల్, తుషార్ దేశ్‌పాండే‌లు కూడా బెంచ్‌కు పరిమితం కానున్నారు.

జింబాబ్వేతో తొలి టీ20కి భారత తుది జట్టు(అంచనా)
యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), సంజూ శాంసన్(కీపర్), రియాన్ పరాగ్, శివమ్ దూబే, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, ఆవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్.

జింబాబ్వే పర్యటనకు ఎంపికైన భారత జట్టు:
శుభ్‌మన్ గిల్(కెప్టెన్), యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకూ సింగ్, సంజూ శాంసన్(కీపర్), ధ్రువ్ జురెల్, శివమ్ దూబే, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, ఆవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్, తుషార్ దేశ్‌పాండే.

Story first published: Monday, July 1, 2024, 14:24 [IST]
Other articles published on Jul 1, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+