Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India Playing XI: అతనికి మళ్లీ నిరాశే.. వెస్టిండీస్‌తో రెండో టీ20 ఆడే భారత జట్టు ఇదే!

ప్రొవిడెన్స్: ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌తో తొలి మ్యాచ్‌లో ఖంగుతిన్న టీమిండియా మరో ఆసక్తికరపోరుకు సిద్దమైంది. అగ్రరాజ్యం అమెరికాలోని ప్రొవిడెన్స్ వేదికగా ఆదివారం రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే రెండో టీ20లో ఆతిథ్య వెస్టిండీస్‌తో హార్దిక్ పాండ్యా సారథ్యంలోని భారత జట్టు అమీతుమీ తేల్చుకోనుంది.

తొలి టీ20లో ఎదురైన అనూహ్య పరాజయంతో రగిలిపోతున్న టీమిండియా.. అంతకంతకు బదులు తీర్చుకునేందుకు సిద్దమవుతోంది. మరోవైపు సమష్టి ప్రదర్శనతో విజయాన్నందుకున్న వెస్టిండీస్ అదే జోరును కొనసాగించాలనుకుంటోంది. ఈ నేపథ్యంలో తొలి మ్యాచ్ మాదిరి రెండో టీ20 కూడా రసవత్తరంగా సాగనుంది.

India Playing XI vs WI 2nd T20: No Chance for Yashasvi Jaiswal, Shubman Gill to retain spot

ఈ మ్యాచ్‌కు టీమిండియా కాంబినేషన్‌లో పెద్దగా మార్పులు చోటు చేసుకునే అవకాశం లేదు. తొలి టీ20లో విఫలమైన ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్‌లకు మరో అవకాశం ఇవ్వనున్నారు. దాంతో టీ20 అరంగేట్రం కోసం ఎదురు చూస్తున్న యశస్వీ జైస్వాల్‌కు మరోసారి నిరాశే ఎదురు కానుంది.

బౌలింగ్ విభాగంలోనూ టీమిండియా పెద్దగా మార్పులు చేసే అవకాశం లేదు. ఆసియాకప్ 2023 నేపథ్యంలో ప్రయోగాలు చేస్తున్న టీమిండియా మరోసారి ముగ్గురు స్పిన్నర్ల కాంబినేషన్‌తోనే బరిలోకి దిగే అవకాశం ఉంది. ఒకవేళ పిచ్ కండిషన్స్ నేపథ్యంలో మార్పులు చేయాలనుకుంటే ఎక్స్‌ట్రా పేసర్ లేదా బ్యాటర్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.

ఓపెనర్లుగా మరోసారి ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్ బరిలోకి దిగనుండగా.. ఫస్ట్ డౌన్‌లో సూర్యకుమార్ యాదవ్ ఆడనున్నాడు. నాలుగో స్థానంలో తెలుగు తేజం తిలక్ వర్మ తన స్థానాన్ని నిలబెట్టుకోనున్నాడు. అరంగేట్ర మ్యాచ్‌లో తిలక్ వర్మ అదిరిపోయే ప్రదర్శన ఇచ్చాడు. స్టన్నింగ్ క్యాచ్‌తో పాటు క్విక్ ఫైర్ నాక్ ఆడాడు.

ఐదో స్థానంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా బరిలోకి దిగనుండగా.. ఆరో స్థానంలో సంజూ శాంసన్ బ్యాటింగ్ చేయనున్నాడు. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ స్పిన్నర్లుగా బరిలోకి దిగనున్నారు. పేసర్లు ముకేష్ కుమార్, అర్ష్ దీప్ సింగ్ ఆడనుండగా.. ఎక్స్‌ట్రా పేసర్ కావాలనుకుంటే ఉనాద్కత్‌కు చోటు దక్కనుంది.

భారత తుది జట్టు(అంచనా): శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, సంజూ శాంసన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేశ్ కుమార్.

Story first published: Saturday, August 5, 2023, 9:52 [IST]
Other articles published on Aug 5, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+