India Playing XI:అర్ష్‌దీప్‌కు చోటు డౌటే.. రోహిత్‌కు జతగా పంత్! విండీస్‌తో తొలి టీ20 ఆడే భారత జట్టు ఇదే!

హైదరాబాద్: వెస్టిండీస్ గడ్డపై జోరు మీదున్న టీమిండియా మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. శిఖర్ ధావన్ సారథ్యంలోని టీమిండియా మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసి చరిత్ర సృష్టించింది. అదే జోరుతో ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరగనున్న తొలి టీ20లో ఆతిథ్య విండీస్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ సిరీస్‌లో భారత జట్టును రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ నడిపించనుండగా.. హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్, రిషభ్ పంత్ వంటి సీనియర్ ఆటగాళ్లు జట్టులోకి వచ్చారు. దాంతో టీమ్ కాంబినేషన్ ఎలా ఉంటుందా? అనేదానిపై ఆసక్తి నెలకొంది. వన్డే సిరీస్‌లో ఒక్క అవకాశం కూడా ఇవ్వని అర్ష్‌దీప్ సింగ్‌కు ఈ మ్యాచ్‌లోనైనా చోటిస్తారా? లేదా? అనే ఆతృత అభిమానుల్లో నెలకొంది.

ఓపెనర్లుగా రోహిత్ శర్మ, రిషభ్ పంత్..
టీమిండియా ఇన్నింగ్స్‌ను కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు రిషభ్ పంత్ ప్రారంభించనున్నాడు. రెగ్యులర్ ఓపెనర్ కేఎల్ రాహుల్ ఈ సిరీస్‌కు ఎంపికైనా కరోనా కారణంగా చివరి నిమిషంలో దూరయ్యాడు. అతనికి ప్రత్యామ్నాయ ఆటగాడిని సెలెక్టర్లు ఎంపిక చేయలేదు. బ్యాకప్ ఓపెనర్‌గా ఇషాన్ కిషన్ ఉన్నా.. పంత్‌తోనే ఇన్నింగ్స్ ప్రారంభించనున్నారు. తద్వారా దినేశ్ కార్తీక్‌ను తుది జట్టులోకి తీసుకోనున్నారు. పంత్ టాపార్డర్‌లో ఆడితే కార్తీక్ ఫినిషర్ రోల్ పోషించనున్నాడు.

మిడిలార్డర్‌లో అయ్యర్, సూర్య, హార్దిక్..
వన్డే సిరీస్ ఆడిన శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ టీ20ల్లోను ఆడనున్నారు. ఫస్ట్ డౌన్‌లో అయ్యర్ రానుండగా.. తర్వాత సూర్య బ్యాటింగ్ చేయనున్నాడు. వన్డే సిరీస్‌కు దూరంగా ఉన్న స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా టీ20 సిరీస్‌తో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. అయ్యర్ సూపర్ ఫామ్‌లో ఉండగా.. సూర్య వన్డే సిరీస్‌లో విఫలమయ్యాడు. మూడు వన్డేల్లో చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వలేదు. మరోవైపు ఇంగ్లండ్ గడ్డపై అదరగొట్టిన హార్దిక్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు.

జడేజా డౌట్..
మొకాలి గాయంతో వన్డే సిరీస్‌లో బెంచ్‌కే పరిమితమైన రవీంద్ర జడేజా టీ20 సిరీస్ ఆడటంపై కూడా అనుమానాలు నెలకొన్నాయి. అతను గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడనే విషయంపై క్లారిటీ లేదు. గాయం నయం కాకుంటే మాత్రం టీ20 సిరీస్‌కు కూడా అతను దూరంగా ఉండనున్నాడు. అదే జరిగితే జడేజా స్థానంలో అక్షర్ పటేల్ తుది జట్టులోకి రానున్నాడు. విండీస్‌తో జరిగిన రెండో వన్డేలో అక్షర్ మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడాడు. ఆరో స్థానంలో దినేశ్ కార్తీక్ బ్యాటింగ్ చేయనుండగా.. ఏడో స్థానంలో అక్షర్ పటేల్ ఆడనున్నాడు.

భువీ ఈజ్ బ్యాక్..
ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో దుమ్మురేపిన భువనేశ్వర్ కుమార్.. మళ్లీ ఈ సిరీస్‌తో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. అతనితో పాటు హర్షల్ పటేల్ పేస్ బాధ్యతలను పంచుకోనున్నాడు. అయితే ఎక్స్‌ట్రా పేసర్‌ను తీసుకుంటారా?లేక స్పిన్నర్ అనేది చూడాలి. పేసర్ అయితే అర్ష్‌దీప్ సింగ్‌కు చోటు దక్కుతుంది. స్పిన్నర్ అయితే కుల్దీప్ యాదవ్, అశ్విన్‌లలో ఒకరు బరిలోకి దిగుతారు. బ్యాటింగ్ సామర్థ్యం ఉన్న అశ్విన్‌కు అవకాశం దక్కవచ్చు. జడేజా దూరమైతే అతని ప్లేస్‌లో అశ్విన్‌ను ఆడించి అర్ష్‌దీప్ సింగ్‌ను తీసుకోవచ్చు.

భారత తుది జట్టు(అంచనా)
రోహిత్ శర్మ(కెప్టెన్), రిషభ్ పంత్ (కీపర్), శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్, రవీంద్ర జడేజా/అక్షర్ పటేల్/అశ్విన్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్/ అర్ష్‌దీప్ సింగ్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications