India Playing XI: ఆ నలుగురికి నిరాశే.. అమెరికాతో తలపడే భారత తుది జట్టు ఇదే!
India Playing XI: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీకి డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా సిద్దమైంది. ఆదివారం ముంబైలోని వాంఖడే వేదికగా అమెరికాతో జరిగే తొలి మ్యాచ్‌తో టీమిండియా తమ ప్రపంచకప్ క్యాంపైన్‌ను ప్రారంభించనుంది. హిస్టరీ రిపీట్, హిస్టరీ డిఫీట్ అనే నినాదంతో సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు ఈ మెగా టోర్నీ బరిలోకి దిగుతోంది. ఫామ్, ట్రాక్ రికార్డ్ నేపథ్యంలో టీమిండియా హాట్ ఫేవరేట్‌గా కనిపిస్తోంది.
ఈ టోర్నీలో విజేతగా నిలిచి డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో టైటిల్ నిలబెట్టుకోవడంతో పాటు గత చరిత్రను తిరగరాయాలనుకుంటుంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే ఇప్పటి వరకు ఏ జట్టు వరుసగా టైటిల్ గెలవలేదు. అంతేకాకుండా హోమ్ టీమ్‌కు కూడా టైటిల్ దక్కలేదు.

ఓపెనర్‌గా ఇషాన్ కిషన్
అమెరికాతో జరిగే మ్యాచ్‌లో టీమిండియా తమ ప్రధాన జట్టుతో బరిలోకి దిగనుంది. ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మలు ఇన్నింగ్స్ ప్రారంభించనుండగా.. తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్ మిడిలార్డర్‌లో ఆడనున్నారు. అక్షర్ పటేల్ స్పిన్ ఆల్‌రౌండర్‌గా ఆడనుండగా.. జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తీ బౌలర్లుగా బరిలోకి దిగనున్నారు.
న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో విఫలమైన రెగ్యులర్ ఓపెనర్ సంజూ శాంసన్ బెంచ్‌కే పరిమితం కానున్నాడు. ఇషాన్ కిషన్ తమ ఓపెనర్ అని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రీ మ్యాచ్ కాన్ఫరెన్స్‌లో పేర్కొన్నాడు.
ఆ నలుగురికి నిరాశే..
అమెరికాతో తొలి మ్యాచ్‌లో సంజూ శాంసన్‌తో పాటు కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణాలకు నిరాశే ఎదురుకానుంది. హర్షిత్ రాణా గాయంతో జట్టుకు దూరమయ్యాడని, అతని స్థానంలో మహమ్మద్ సిరాజ్ తుది జట్టులోకి వచ్చాడని వార్తలు వస్తున్నాయి. సిరాజ్ జట్టులోకి వచ్చినా అతను బెంచ్‌కే పరిమితం కానున్నాడు. ముంబై పిచ్ బ్యాటింగ్‌తో పాటు స్పిన్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉంటుంది.
అమెరికాతో భారత తుది జట్టు(అంచనా)
ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తీ.
భారత్ టీ20 ప్రపంచకప్ జట్టు:
సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, రింకు సింగ్, సంజు శామ్సన్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications